"పవన్ - ఉండవల్లి - జెపి" మంచి పొలిటికల్ కాంబినేషన్

ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక అత్యంత సమర్ధుడైన రాజకీయ వ్యుహ చతురుడు. ఆయన ఏ పార్టీ లో ఉన్నా ఆలోచనా, విశ్లేషనాత్మక విధానం అంతా సకారాత్మకం అంటే సానుకూలత ద్వనించే అనుకూల ధోరణి. బుద్ది ఘనం మాట దృడం. ఇంతటి సమర్ధునికి తోడు జయప్రకాష్ నారాయణ ప్రజాసేవ చేయాలన్న తపన శక్తి ఉన్న సమో న్నతుడు ఙ్జాని స్థిరచిత్తుడు స్థితప్రఙ్జుడు తోడుంటే వారిద్ధరూ చాణక్య చంద్రగుప్తులే.


ఇక వీరికి పవన్ కళ్యాణ్, ది క్రౌడ్ పుల్లర్, అంటే అగ్ని కర్పూరం ఆపై వాయువు తోడైతే ఇంకేం ముగ్గురూ ముగ్గురే - త్రిమూర్తులు. పవన్ తెచ్చిన క్రౌడ్స్ ను రాజకీయ  అను చరులుగా ఈ ముగ్గురు మార్చగలరు ఎందుకంటే ప్రజలు రాజకీయాలను మించి అభివృద్ధి కోరుకుంటున్నారు కాబట్టి. వీరు కలసిన రాజకీయం రసవత్తరం జనరంజకం. కలసి రాష్ట్ర ప్రయోజనాలకై సమైఖ్యంగా పనిచేస్తే  'కొండ మీద కోతేం ఖర్మ '  'కేంద్రమే జరజరా దిగిరాదా!' కోరికలు, విభజన ఫలాలు తీర్చదా! అసలు ఈ కాంబినేషన్ అనగానే రాష్ట్రంలో పాలించే అధికార పక్షానికే కాదు ప్రతిపక్షానికి కూడా చేమటలు పడతాయి.


ప్రజల నుండి ప్రజ్వల జ్వాలాముఖి జ్వలించదా! తుచ్చ రాజకీయ అధికార, అనధికార నాయకులు రాష్ట్రం నలుమూలల నుండి జనాగ్నికి దహించుకుపోరా! హైదరాబాద్ ను పదేళ్ళు కాకపోతే పదిహేనేళ్ళు రాజధానిగా వినియోగించుకోమన్న విభజన చట్టాన్ని అతిక్రమించి రాత్రికి రాత్రి రాజధానిని మూటాముల్లె సర్ధుకొని దిక్కులేని బిక్షగాళ్ళలా అమరావతి అని పేరుపెట్టుకొని పారిపోయిరావటానికి ఇది ప్రజాస్వామ్యమా! శత్రురాజు చేతిలో అకస్మాత్తుగా అఘాయిత్యానికి గురై పారిపోయి, వెరే చిన్న ప్రాంతానికి పారిపోయి వచ్చిన రాజస్వామ్యమా!


ఎవడి అబ్బ సొమ్ము హైదరాబాద్? 15 సంవత్సరాల వరకు రాజధానిగా వాడేసుకునే హక్కు రాష్ట్ర విభజన చట్టం ఇచ్చింది. పారిపోవటానికి అధికార పార్టీ ఎవరు? ఆ పార్టీ అధినేత ఎవరు? అధికార పార్టీ సభ్యులు కోరారా? విపక్షం కోరిందా? ఆంధ్రప్రదేశ్ జనం కోరారా? ఈ ప్రయోజనం వలన పదిహేనేళ్ళ సమయం దొరుకుతుంది నూతన రాజధాని మాహిష్మతి స్థాయిలో నిర్మించటానికి. కేంద్రానికి ఆర్ధిక వెసులుబాటు, సమయం రెండూ దొరుకుతాయి. ఈ ప్రయోజనం విలువ ఒక లక్ష కోట్ల రూపాయిల నుండి లక్షన్నర కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఎవడబ్బ సొమ్మని ఏపి ముఖ్యమంత్రి వదిలేశారు ఈ అత్యంత విలువైన ప్రయోజనాన్ని?


అభివృద్ధి చెందిన రాజధానిలో పరిపాలన సాగిస్తూ ఉంటే నూతన రాజధానికి విలువైన వనరుల వెల్లువ పెట్టుబడులుగా వస్తాయి. అది మరచి తన ఒక్కడి స్వార్ధ ప్రయో జనం కోసం సకల ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాన్ని బలిచేసిన ఆ అధినేతకు తగిన బుద్ది చెప్పాలంటే ఈ త్రిమూర్తులు సారధ్యం రాష్ట్రానికి చాలా అవసరం.


ఇకపోతే ప్రత్యేకరాష్ట్ర హోదా కూడా విభజన చట్టమిచ్చిందే. దీనికి ప్రత్యేక పాకేజీ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదు. ఆలోచించి చేసిన ప్రజాప్రయోజన చట్టం అది. దీనికి తిరుగు లేదు. దీని కోసం ఎవరో ఒక అంతర్జాతీయ బాంక్ ఋణం కేసులో రెడ్ కార్నర్ నోటీస్ తనపై విడుదలైన కేంద్రమంత్రి మద్యవర్తిత్వం తో అధికార పార్టీ అధినేత స్వార్ధం కోసం కమీషన్ల కక్కుర్తికి ప్రత్యేక హోదా బలైంది. దీనికి ఆ అధినేతకు ఆ మద్యవర్తి కేంద్రమంత్రికి తగిన బుద్ది చెప్పాలంటే ఈ త్రిమూర్తుల సారధ్యం రాష్ట్రానికి చాలా అవసరం.


"పోలవరం ప్రోజెక్ట్ నిధులు సమస్తం ట్రాన్స్-ట్రాయి పలహారం నిమిత్తం" అందులో వాటా ఉందేమో అందుకే కేంద్రం పదే పదే అడిగినా రాష్ట్రం లెక్కలు చెప్పదు. శ్వేతపత్రం ప్రకటించదు. ససేమిరా అంగీకరించదు. కేంద్రానికి ఆ హక్కు ఉంది. రాష్ట్రానికి బాధ్యత ఉంది. రాజకీయం చేసి కేంద్రాన్ని నేలపైకి నింపాలని సొల్లు వార్తలు రాసే పత్రికలు ఎన్నో! నిజాయతీని మరవకూదదు. వాళ్లు జాతికెంత ద్రోహం చేస్తున్నారో అని వాళ్ళే స్వయం నియంత్రణ విధించుకోవాలి. 


తెలుగు టెలివిజన్లలో ప్రజలంతా సినిమాలా చూసిన తెలంగాణా "టిఆరెస్ ఎమెల్సి కొనగోలు వ్యవహారం" లో తెలుగుదేశం ఎమెల్యే తెరపై ప్రదర్శించ బడ్డారు. కాని "బ్రీఫ్డ్-మీ" అనే టైటిల్ తో ఆడియో నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విచిత్రలీల. దీన్ని బయటికి లాగిన 'తెలంగాణా అవినీతి నిరోధక శాఖ'  ఏ చక్రబంధం లో ఇరుక్కుందో?  కూడా! బయటికి లాగాలన్నా ఈ త్రిమూర్తులకు సాధ్యమౌతుంది.


ఇవీ ఏపి ప్రభుత్వాధినేత రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిన అవినీతి అక్రమ లీలలు. ఇంకా ఎన్నో రాష్ట్రాధినేత లీలలు మంత్రుల దోపిడీలు. ఆఖరికి సినిమాలకు వినోదపన్ను రద్ధు నుంచి ప్రత్యేక ఆటలు ప్రదర్శించేంతవరకు. అంతకు మించి మంచి నటనకు, సాంకేతికతలకు ఇచ్చే స్వర్ణ నంది అవార్డులవంటి ప్రోత్సాహకాల వరకు కూడా! అంతా అవినీతి అక్రమ కంపే. వీటిని అడ్దుపెట్టుకొని కేంద్రంలో ప్రధాని ఆటాడేసుకుంటూ ఉండవచ్చు. వీళ్ళ రాజకీయ కుళ్ళు కుతంత్రాలకు న్యాయపరమైన పరిష్కారం సాధించి వీరి కబంధ హస్తాల నుండి రాష్ట్రాన్ని బయట పడేయాలంటే పట్టుదలతో ప్రయత్నిస్తే వీరు ముగ్గురూ సాధించగలరు.


ఇందులో రాష్ట్ర ప్రయోజనాలు సాధించే కార్యక్రమం లో టిడిపి ఎంపిలు పార్లమెంట్ ముందు ధర్నాలు. ఇసలు ఇందులో నీతి ఏముంది-కేంద్ర కాబినెట్ లో ఉన్నా టిడిపి మంత్రులే ఆమోదించిన బడ్జెట్ పై సభ వెలుపల అధినెత నేత్రుత్వంలో నాటకం కడు రక్తి కట్టించారు. మద్యలో సుజానా చౌదరి కేంద్రమంత్రి అరున్ జైట్లి తో రక్తిగట్తించే చర్చలు ఒకవైపు- పార్లమెంట్ లో అధికారపార్టీ మీడియాకి ముచ్చటేసిన గల్ల జయదేవ్ గారి బృహత్తర రసవత్తర ఉపన్యాసం ఆ తరవాత వారికి సన్మానం - డ్రామాలో ఒక మెలో డ్రామా- మొత్తంగా చూస్తే ఏపి ప్రజల చేతిలో చిప్పే కదా!     

ఇప్పుడు ఏపి ప్రజలు ఈ అరాచక రాజకీయాలు కోరుకోవటం లేదు. నైతికత ప్రామాణికంగా తీర్చి sదిద్దగల ప్రజల ప్రయోజనాలను సాధించిపెట్టే నాయకత్వం. ఈ ముగ్గురు ఏకమైతే విజయం వీరివెంటే.  ఇక ఈ లోపాలు సవరిస్తే కేంద్రం లోని ప్రభుత్వ మెంత? ప్రజలు ఈ నాయకుల వెంట రాజకీయాలకు దూరంగా నడిస్తే వారు నడిపిస్తే కేంద్రం ఖేల్ ఖతం - దుకాన్ బంద్. అంతవరకు రాజకీయాలకు అతీతంగా జరగటమే ప్రధానం.         

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: