ఆ తెలుగు యాంకర్ బ్లూ ఫిలిం చూసి.. వాళ్ల ఆయన ఏం చేశాడో తెలుసా..!?

Chakravarthi Kalyan
చిన్ని తెర అయినా పెద్ద తెర అయినా అంతా గ్లామర్ ప్రపంచమే.. ఈ గ్లామర్ ప్రపంచం కోసం ఎందరో యువతలు ఎన్నో అందాల కలలు కంటుంటారు. తమ అందంతో, టాలెంట్ తో అందలాలు ఎక్కాలని సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలగాలని కోరుకంటారు. ఒక్క ఛాన్స్ అంటూ సినీ నిర్మాతల వెంట పడతారు.. కానీ అందరి ఆశలూ నెరవేరవు.. 


సినిమాల్లో హీరోయిన్ గానీ టీవీలో బుల్లితెర నటిగానో వెలగాలంటే అందం, టాలెంట్ ఒక్కటే సరిపోవు. సరిగ్గా ఈ ఆకర్షణనే కొందరు క్యాష్ చేసుకుంటారు. అమ్మాయిలకు సినిమాల ఆశ చూపి వ్యభిచారం రొంపిలోకి దింపుతారు. వారితో బ్లూ ఫిలింలు చేయించి సొమ్ము చేసుకుంటారు. ఇటీవల ఓ తెలుగు యాంకర్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ మీడియాతో పంచుకుంది. 



ఆమె ఎలాంటి బ్లూఫిలిం చేయకపోయినా.. అలాంటి నింద ఎదుర్కోవాల్సి వచ్చిందట. ఆమె యాంకర్ శ్యామల. తెలుగులో పద్దతిగా యాంకరింగ్ చేసే అదికొద్ది మందిలో ఈమె ఒకరు. అయితే అలాంటి ఆమె ఓ బ్లూఫిలంలో నటించినట్టు వీడియో మార్ఫింగ్ చేసి యూట్యూబ్ లో పెట్టేశారట. అంతే కాదు.. ఈ వీడియా ఏకంగా వాళ్ల ఆయన చూశాడట. 


కాకపోతే వాళ్ల ఆయన కూడా సినీపరిశ్రమకు చెందిన వ్యక్తే కావడంతో అలాంటి వాటిని పట్టించుకోవద్దని యాంకర్ శ్యామలకు ధైర్యం చెప్పాడట. ఈ సమయంలో తాను చాలా మానసిక వేదనకు గురయ్యానంటోంది యాంకర్ శ్యామల. అర్థం చేసుకునే భర్త కాబట్టి ఎంతో పెద్ద ముప్పు తప్పిందని.. అదే వేరే వాళ్లయితే తన జీవితం నరకప్రాయంగా ఉండేదని అప్పటి అనుభవాలు గుర్తు చేసుకుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: