వైసీపీ నేత జగన్ కి తప్పిన ప్రమాదం..!

Edari Rama Krishna
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కల్లబొల్లి కబుర్లు చెబుతూ కాలం వెల్లదీస్తుందని..ప్రత్యేక హోదాపై ఉద్యమం చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ‘ప్రజా సంకల్ప యాత్ర’ ప్రారంభించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో పలు జిల్లాలు ఆయన పర్యటించి ప్రజలను చైతన్య పరుస్తున్నారు. రాజన్న మళ్లీ వచ్చాడని ప్రజలకు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల నేత వై యస్ జగన్ చేపట్టిన పాదయాత్ర వందవ రోజుకి చేరుకుంది. గ్రామగ్రామాల్లో జగన్ కు ఘన స్వాగతం పలుకుతున్నారు.  నిన్న జగన్ పాదయాత్ర వందవ రోజు సందర్భంగా ఒక అపశ్రుతి చోటు చేసుకుంది. వై యస్ జగన్ కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రకాశం జిల్లాలోని ఉప్పలపాడు గ్రామంలో ప్రజా యాత్ర చేస్తున్న జగన్, నిన్న ఆ గ్రామంలో ప్రసంగిస్తుండగా ఆ సంఘటన చోటు చేసుకుంది.

తమ ప్రియతమ నేత జగన్ ని దగ్గర నుంచి చూడటానికి అభిమానులు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. అక్కడున్న వారందరికీ అభివాదం చేస్తున్న జగన్ వెనుక కూడా చాలా మంది చేరారు. జనాల తాకిడి ఒక్కసారే ఎక్కువ కావడంతో జగన్ మోహన్ రెడ్డి పక్కకు స్లిప్ అయ్యారు..వెంటనే గమనించిన సెక్యూరిటీ గార్డు జగన్ ని గట్టిగా పట్టుకోని పైకి లాగారు. జగన్ గనక కింద పడి ఉంటే..విపరీతమైన తొక్కిసలాట జరిగి ఉండేదని..అని సిబ్బంది భయపడ్డారు...మొత్తానికి గండం తప్పిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఏది ఏమైనా తన అనుకుని వచ్చిన ప్రజలు ఎవరైనా సరే, వారిని దగ్గరికి తీసుకుంటాడు. సెక్యూరిటీ గురించి, ప్రమాదాల గురించి పెద్దగా లెక్క చెయ్యడు జగన్. ఆయనకు ఉన్న ఈ తీరు ఎంత మంచి పేరు తెచ్చి పెట్టిందో అలాగే జగన్ కి సెక్యూరిటీ ఏర్పరచడానికి కూడా అంతే ఇబ్బంది గా  మారింది. అందుకే జగన్ కి ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఎప్పటికప్పుడు అలెర్ట్ గా ఉండి, అతనికి సంబందించిన జాగ్రత్తలు వారే స్వయంగా పర్యవేక్షిస్తూ ఉంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: