ఒకేసారి ఇద్దరితో అక్రమ సంబంధం.. దొరికితే ఏమైందో చూడండి..!

Chakravarthi Kalyan

వివాహేతర సంబంధం ఒక యువకుడి హత్యకు దారితీసింది. ఈ దారుణం రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. కడియం మండలం మాధవరాయుడుపాలెంకు చెందిన ప్రవీణ్‌కుమార్‌, మోరంపూడి ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్‌ లాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. శాటిలైట్‌ సిటీకి చెందిన విజయకుమారి అక్కడే ఏ ఎన్‌ఎంగా పనిచేస్తోంది.


విజయకుమారికి భర్త, ఇద్దరు పిల్లలున్నారు. ఈ నేపధ్యంలో ప్రవీణ్‌కుమార్‌, విజయకుమారి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. భర్త ఉన్నా.. అప్పటికే విజయకుమారికి అదే ప్రాంతానికి చెందిన గమానియేల్‌ అనే యువకుడితో ఎఫైర్ ఉంది. ఐతే.. ప్రవీణ్‌కుమార్‌ పరిచయంతో విజయకుమారి గమానినియేల్ ను దూరం పెట్టడం ప్రారంభించింది.


ఈ పరిణామంతో గమానియేల్ విజయకుమార్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈనెల 20న విజయకుమారి ని ప్రవీణ్ కుమార్ ఆమె ఇంట్లోనే కలిశాడు.. ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఇంటి నుంచి వస్తున్న ప్రవీణ్‌కుమార్‌ను గమానియేల్‌, అతని స్నేహితుడు మాటు వేసి హత్య చేశారు. శవం ఆనవాళ్లు దొరకకుండా తగులబెట్టారు. సాక్షాలను మాయం చేసే ప్రయత్నం కూడా చేశారు.


ఐతే.. మృతుని పళ్లకు ఉన్న డెంటల్‌ క్లిప్‌ నిందితులను పట్టించింది. వాటి ఆధారంగా మృతదేహం ప్రవీణ్‌కుమార్‌దేనని పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: