మోడీతో బాబు కట్.. సోనియా విందుకు బాబు..?

Chakravarthi Kalyan
కేంద్రంతో దోస్తీపై చంద్రబాబు ఓ క్లారిటీకి వచ్చేశారు. మోడీతో కటీఫ్ చెప్పేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఓ కీలక ప్రకటన చేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు ముందున్న దారులు ఏంటి.. కేంద్రంలో ఉన్నవి రెండే ప్రధాన పార్టీలు ఒకటి బీజేపీ, రెండోది కాంగ్రెస్.. కాంగ్రెస్ పార్టీ ఏపీకి తీరని అన్యాయం చేసిందని చంద్రబాబు బీజేపీవైపు మొగ్గారు. గత ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టారు. 


కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బీజేపీతో ఇకపై కొనసాగలేని పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు చంద్రబాబు జాతీయ స్థాయిలో ఏ పార్టీ వైపు ఉంటారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.. దీనికితోడు ఈ పరిణామాలకు మరో కొత్త వార్త వచ్చింది. అదేంటంటే రాజకీయ విందు కోసం సోనియా గాంధీ చంద్రబాబును ఆహ్వానించారన్నది.. అసలేంజరిగిందంటే.. ఈ నెల 13 న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ విందు తలపెట్టారు. 


ఈశాన్య రాష్ట్రాల్లో దెబ్బ తిన్న కాంగ్రెస్ 2019 ఎన్నికల నాటికి రేసులో నిలబడాలంటే బీజేపీ వ్యతిరేక పార్టీలని ఒక్క తాటి మీదకు తేవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనికితోడు థర్డ్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ సీఎం కెసిఆర్ చేస్తున్న థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు కూడా సోనియాను కలవరపెట్టాయట. అందుకే ఆమె యుద్ధ ప్రాతిపదికన బీజేపీ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేయడానికి ఈ నెల 13 న ఢిల్లీలో విందు ఇస్తున్నారు.


ఈ విందుకు చంద్రబాబును కూడా ఆహ్వనించినట్టు తెలుస్తోంది. ఎన్డీఏలో ఉన్న బాబు విందుకు వస్తాడని వారికి ఆశలేదు. కానీ అనుకోకుండా ఎన్డీఏకు చంద్రబాబు ఇప్పుడు గుడ్ బై చెప్పేయడంతో కాంగ్రెస్ లో ఆశలు పెరిగాయి. చంద్రబాబును తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తారు. కానీ చంద్రబాబు వెళ్తారా.. వెళ్లే అవకాశాలు చాలా తక్కువ. గత ఎన్నికల్లో ఏపీ కాంగ్రెస్ కు సున్నా వచ్చిన విషయాన్ని ఆయన అప్పుడే మర్చిపోతారా..? 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: