నిర్లక్ష్యం చేస్తే "దక్షిణ భారత్ ను ప్రత్యేక దేశం" గా ప్రకటిస్తాడట సినీనటుడు మురళిమోహన్

ఇది రచయిత అభిప్రాయం మాత్రమే కాదు. అనేకమంది సామాజిక మీడియాలో చెప్పేనిజం. 

మాగంటి మురళి మోహన్ 77 సంవత్సరాల వయోవృద్దుడు చలన చిత్రనటుడు రాజకీయవేత్త. "తమను నిర్లక్ష్యం చేస్తే దక్షిణ భారత దేశం ఒక ప్రత్యేక దేశంగా ప్రకటించు కుంటుంది". ఆయన ప్రవచించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఫిబ్రవరి పన్నెండున ఒక ప్రెస్ కాన్-ఫరెన్స్ నుండి ఆ వీడియో విడుదలై నెట్టింట్లో సందడి చేస్తుంది.  కేంద్ర ప్రభుత్వం వీళ్ళపై సవతితల్లి ప్రేమ కురిపిస్తుందట. వీళ్ళు పన్నుల రూపంలో ఎక్కువ మొత్తం దేశానికి కంట్రిబ్యూట్ చేస్తున్నారట అందుకే వీరికి ఒక ప్రత్యేక దేశం కావాలట.

సమైఖ్య ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు వాళ్ల ఆధిపత్యంలో తెలంగాణా వాళ్ళను వాళ్ళ ఆర్ధిక సామాజిక వెనుకబాటు తనాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళను దోచేసినప్పుడు ఈ నొప్పి తెలియలేదా?  మీకు.


ఈ మద్య ఆయనకు తెలుగుదేశం ముఖ్యమంత్రి "తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్ష పదవి" ఇవ్వలేదు. అందుకే మానసికంగా దిగకుళ్ళిపోయాదు. చివరికి అఖండ భారతాన్ని ఉత్తర దక్షిణ భారతాలుగా చీల్చెయ్యాలని నోటి దురద తీర్చుకుంటున్నాడు. ఇది క్షంతవ్యం కాదు. ఇదే మురళి మోహన్ కోడలు వారసురాలుగా ఆయన నియోజకవర్గంలో  అనధికారంగా అధికారం చెలాయిస్తున్నారు. ఈయన, ఈయన తరవాత కోడలు, ఆ తరవాత మనవడు మనవరాలు అధికారంలో ఉంటే మిగిలిన ప్రజలు ఏం చెయ్యాలి? తస్మాత్ జాగ్రత్త మిస్టర్ మురళి మోహన్ గారు!
"ప్రత్యేక రాష్ట్రం వేరు ప్రత్యేక దేశం వేరు" నైతికత, దేశభక్తి లేకుండా పోవటం మంచిదికాదు.  అసలు మిమ్మల్ని ఎందుకు క్షమించాలి. తెలంగాణాలో మీరు (అంటే అర్ధం అయ్యే ఉండాలి) చేసిన--భూదోపిడీ ఎంత? సినిమారంగం, వ్యాపారరంగం, వాణిజ్యరంగం, పారిశ్రామికరంగం, రాజకీయరంగం, ఆర్ధికరంగం, రవాణారంగం, పత్రికా రంగం అంతటా కమ్మేశారు. మీరైతే వేరెవారికి సూది మొన మోపినంత అవకాశం కూడా బ్రతకటానికి ఇవ్వరు. కాని, మీకు కొంచెం చురుక్కు మంటే మాత్రం ప్రత్యేక దేశం ప్రకటిస్తారా?  

అలా ఈ దక్షిణ భారత్ లోని ఐదు స్టేట్స్ దేనికో ఒకదానికి కొట్లాడవా? అప్పుడు తమిళ దేశం, కన్నడ దేశం, తెలుగు దేశం ఇలా దేశాలు ప్రకటిస్తూ పోతారా ఉదాహరణ కు మురళి మోహన్ నివాస ప్రాంతం, అమరావతిలో వారికి తప్ప వేరే వారికి చోటుందా? అప్పుడు అమరావతి వెలుపల ఉన్నవారు ఒక ప్రత్యేక రాష్ట్రం లేదా దేశం కావాలని అడగుతారా? సిగ్గులేకపోతే సరి. ఇక్కడ అమరావతిలో వేరే మాలాంటి వారికి చోటుందా? ఎందుకు నోరు పారేసుకుంటావు? మీ బ్రతుక్కి ప్రత్యేక తెలంగాణా విభనని ఆపలేక పోయారు స్వంత ప్రయోజనాల కోసం. కనీసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వేర్పాటును నియంత్రించలేక పోయారు. 

ప్రత్యేక హోదా కోసం పోరాటం చెయ్యండి అంతేకాని ఈ తల తిక్క వాగుళ్ళు, అదీ ఒక పార్లమెంట్ సభ్యుని హోదాలో ఉన్న మీకు సిగ్గు చేటు. ఈ దేశంలో ఎవడికి వాడు ప్రకటనలు గుప్పించేస్తున్నాడు. ఒకడికి బుద్ది లేదంటే? సరే అనుకుందాం. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్, కమల్ హసన్లు నోటికి హద్దు లేకుండా "దక్షిణ భారత్ ప్రత్యెక దేశం" అంటూ ఎడా పెడా వాగేస్తున్నారు.

అప్పుడు ఈ దేశం నరెంద్ర మోడీ అబ్బ సొమ్మని మీరు ఒప్పుకున్నట్లే అవుతుంది.  ప్రధానిగా నరెంద్ర మోడీ నేరం చేస్తే ఆయనపై పోరాటం చెయ్యండి ప్రత్యేక హోదా సాధించండి. దేశ విభజన అనటం న్యాయం కాదు. మీ కోసం, మిగతా మేమంతా విడిపోయి ఉండలేం. తెలంగాణా ఆంధ్రప్రదేశ్ గా విడిపోవటం నచ్చని వ్యక్తులు ఇరు రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళిప్పటికి బాధ పడుతున్నారు.

మీకు పదవి లాలస, ధనమధం, రాజకీయ దుర్మధాంధత ఎక్కువ అయితేకావచ్చు. మాకు కలసి ఉండటం మక్కువ. మీరు స్వార్ధపరులు. మేం త్యాగధనులం. అందుకే మీరు అనకొండలా ఆక్రమించుకుంటున్నా మేము మామూలుగా బ్రతుకుతున్నాం.  


మనకు నష్టం జరిగితే ఎక్కువ స్థానాలు ఎన్నికల్లో గెలవాలి, అందరు కలవాలి, కలిసి పోరాడాలి. అవసరమైతే ఉత్తర భారత ప్రజలను కలుపుకు పోయి నరెంద్ర మోడీని క్రిందకు దించాలి. రాజ్యాంగం, చట్టం ఉన్నాయి. ఇప్పుడు సాధారణ పౌరుడు బ్రతికేలా మీ అమరావతి సమాజం ఉందా? ఎవడిక్కావాలి ప్రత్యేక హోదా? మీలాంటి డబ్బున్న పెట్టుబడి దార్లకు మాత్రమే. మా వరకు ఆ ప్రయోజనాలు ఎలాగు రావు. వచ్చినా మీరు పంచేసుకుంటారు. కనీసం దేశం అంతా కలిసి బ్రతికితే చాలు.


సెలెబ్రిటీ స్థానాల్లొ ఉన్న ఇలాంటి వాళ్లు ఇలా రెచ్చిపోతుంటే వారిపై చట్టపరమైన చర్యలకు కేంద్ర రాష్ట్ర ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపక్రమించాలి. సార్వభౌమత్వం జోలికి రావద్దని సామాన్యుని మనవి. ఈ విషయములో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి తన అభిప్రాయాన్ని బహిరంగంగా తెలపాలని మనవి. మురళి మోహన్ కు నాయకుడుగా ఉన్నందున ఆయన్ని మందలించకపోతే ఆ ఆలోచన మీదే నని భావించవలసి వస్తుంది.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: