చంద్రబాబూ! కొత్తగా చేసిన అప్పు లక్ష కోట్లకు లెక్క చెప్పండి లేకపోతే.......

నారా చంద్రబాబు నాయుడును తొలుత చట్టం ముందు ముద్దాయిగా బోనులో నిలబెట్టేందుకు అవసరమైన ప్రతీ చర్యను తీసుకుంటామని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలనంగా ఒక ప్రకటన చేశారు. పార్లమెంటు వద్ద మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్ర మంతా తన శాసన సభ్యులలో సర్పంచ్ నుండి పార్టీ అధినేత వరకు అంతరాంతరాల్లో కొండలా పెరిగిపోయిన అవినీతిపై జాతీయ స్ధాయిలో చర్చించు కుంటున్నట్లు చెప్పారు. అదే విషయాన్ని తాను పదే పదే ప్రస్తావిస్తున్నట్లు చెప్పారు.

సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన అయ్యే నవ్యాంద్ర రాష్ట్రం ఏర్పడే నాటికి 1956 నుండి 2014 అంటే మొత్తం 57 సంవత్సరాలలో రాష్ట్రం అప్పు ₹ 90 వేల కోట్లు ఉంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 నుండి ఇప్పటికి అదనంగా ₹ 1.2 లక్షల కోట్ల వరకు కొత్త అప్పు వచ్చి చేరిందని ధ్వజమెత్తారు. తెచ్చిన లక్ష కోట్ల పైగా  అప్పంతా చంద్రబాబు ఏ సంపద సృష్టించటానికి  ఖర్చు చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తన అవినీతిపై నవ్యాంద్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబుపై ఉందన్నారు.

తనపై చంద్రబాబు, టిడిపి నాయకులు చేస్తున్న ఆరోపణలను నిరాధారాలని కొట్టేశారు.  చేసిన అప్పు లక్ష కోట్లకు లెక్క చెప్పండి లేక పోతే చట్టం ముందు దోషిగా బోనులో నిలబడటం తప్పదని ఉద్ఘాటించారు. రాజ్యసభ సభ్యుని హోదాలో తాను ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులను ప్రజా అవసరాల కోసం కలుస్తానని, దీని నెవరూ ఆపలేరని చెప్పారు.  రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ఇదని, దీన్ని ఉపయోగించుకోవటంలో తప్పులేదని, అందుకు మీరు ప్రశ్నించటం తప్పని మండిపడ్డారు. ముఖ్య మంత్రి చంద్రబాబు పాలన మొత్తం అవినీతి మయమైపోయిందంటూ, మంత్రులు, నాయకులు ఇందులో భాగస్వాములయ్యారని మండిపడ్డారు.

ప్రత్యక హోదా కోసం వైసిపి చిత్తుశుద్దితో పోరాటం చేస్తోందని, ఇంకెవరూ ఒక్క వైసిపి కాకుండా ఈ విధంగా పోరాటం చేసే వారు లేరని క్రెడిట్ మాత్రమే తీసుకునే వారు ఉన్నారని అందులో మాత్రం తెలుగుదేశం ముదిరిపోయిందని  అన్నారు. కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం లేదని మండిపడ్డారు. నిన్న మొన్నటి వరకూ కేంద్రప్రభుత్వంలో బాజపాకు భాగస్వామిగా ఉన్న తెదెపా ఇపుడు ఏ విధంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడుతుందని ఆయన తీవ్రంగా విమర్శిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: