జగన్ అనే నేను.. ఫ్యూచర్ పొలిటికల్ సూపర్ హిట్ సినిమా..!

Chakravarthi Kalyan
మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ అంటేనే సూపర్ బంపర్ హిట్.. వీరిద్దరి కాంబినేషనల్ లో వచ్చిన శ్రీమంతుడు ఎంత హిట్టో అందరికీ తెలిసిందే. కొరటాల శివ సినిమాలు కమర్షియల్ హిట్ మాత్రమే కాదు.. అందులో సందేశం కూడా ఇమిడి ఉంటుంది. అందుకే అంత క్రేజ్.. ఇప్పుడు తాజాగా వీరిద్దరి కాంబినేషనల్ వస్తున్న భరత్ అనే నేను.. సినిమా కూడా సంచలనం సృష్టిస్తోంది. 


తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ సాంగ్ అదరగొడుతోంది. ఒక్క రోజులోనే 3 మిలియన్ల వ్యూస్ దాటేసి కలకలం సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా పొలిటికల్ మూవీ అన్న సంగతి టైటిల్లోనే తెలిసిపోతోంది. ఓ యువకుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్ ఇప్పటికే రివీల్ అవుతోంది. తాజా పాట ద్వారా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే రాజకీయ నాయకుడి పాత్ర మహేశ్ ది అని అర్థమవుతోంది. 



ఇక ఈ పాటను అక్షరం అక్షరం పరిశీలిస్తే.. అణువణువునా వైసీపీ అధినేత జగన్ గుర్తుకువస్తుండటం విశేషం. వైఎస్ జగన్ రాజకీయ నేపథ్యం, అధిష్టానాన్ని ఎదిరించి సొంతంగా పార్టీ పెట్టిన తీరు.. అధికారం కోసం అడ్డమైన హామీలు ఇవ్వకుండా నిజాయితీగా బరిలో నిలిచిన తీరు అన్నీ ఈ పాట కు బాగా సూట్ అవుతున్నాయి. అసలు పాట రచయిత జగన్ కోసమే ఈ పాట రాశారా అని అనిపిస్తోంది. 


ఈ సినిమా రిలిక్ ఓసారి గమనిద్దాం.. 
భరత్ అనే నేను.. హామీ ఇస్తున్నాను.. విరచిస్తా నేడే నవశకం.. నినదిస్తా నిత్యం జనహితం.. నలుపెరుగని సేవే అభిమతం.. కష్టం ఏదైనా సమ్మతం.. భరత్ అనే నేను.. హామీ ఇస్తున్నాను.. అనే ఈ పల్లవి జగన్ ను గుర్తుకు తెస్తుంది. జగన్ తండ్రి నేపథ్యం.. ప్రజల కోసం నిత్యం నినదిస్తా అనడం.. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ప్రత్యేక హోదా, విద్యార్థులు ఫీజుపోరు వంటి ఉద్యమాలను గుర్తుకు తెస్తున్నాయి. 


నలుపెరగని సేవే అభిమతం, కష్టం ఏదైనా సమ్మతం.. ఈ పదాలు ఆయన అడ్డగోలుగా హామీలు ఇవ్వని వ్యక్తిత్వాన్ని గుర్తు చేస్తున్నాయి. అలాగే కష్టం ఏదైనా సమ్మతం అనే ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి నిలిచారు. కాస్త సోనియాకు తలవంచి ఉంటే.. ఈపాటికి జగన్ సీఎం అయి ఉండేవారు కూడా. కానీ కష్టాలకు వెరవడం ఆయన డిక్షనరీలో లేదని తెలుస్తూనే ఉంది. 


పాలించే ప్రభువును కానని.. సేవించే బంటును నేనని.. అధికారం అర్థం ఇది అనీ.. తెలిసేలా చేస్తా నా పని.... ఈ వాక్యాలు జగన్ భవిష్యత్ కార్యాచరణకు సూచనగా నిలుస్తున్నాయి. ప్రజలకు ఆయన ఇప్పటికే రాజన్న రాజ్యం తెస్తానని మాట ఇచ్చాడు.. అంతే కాదు.. ఇప్పుడు నవరత్నాలు అంటూ  బడుగుజీవుల ప్రగతి లక్ష్యంగా కొన్ని పథకాల హామీలు ఇచ్చాడు.. అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తానని జగన్ చెబుతున్నట్టుగా ఈ చరణం అనిపించడం లేదూ.. 


మాటిచ్చా నేనే పుడమికి..  పాటిస్తా ప్రాణం చివరికి.. అట్టడుగున నలిగే కలలకు.. బలమివ్వని పదవులు దేనికి.. ఈ చరణం జగన్ భవిష్యత్ ను కళ్లకు కడుతోంది. జగన్ అధికారంలోకి వస్తే బడుగులకు బలమిస్తా.. అట్టడుగు వర్గాలకు అండగా నిలుస్తానని చెబుతున్నట్టుగా ఉంది. మొత్తానికి భరత్ అనే నేను.. కంటే ఈ పాట జగన్ అనే నేనుగా మారిస్తే మరింతగా అతికినట్టుగా అనిపిస్తుందంటే.. ఇది జగన్ భవిష్యత్ ను సూచిస్తున్నట్టుగానే ఉంది. జగన్ కు ఉన్న బ్రహ్మాండమైన భవిష్యత్ అంతా ఈ పాటలో కనిపిస్తోంది కదూ.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: