నేడే బాహుబలిపుట్టిన రోజు

అహింసను ప్రభోదించిన జైన మత ప్రచారకుడు , వర్ధమాన మహావీరుడి జయంతిని ప్రతిసంవత్సరము చైత్రమాసంలో ఘనముగా జరుపుకుంటారు. బీహార్ లో వైశాలి కి సమీపములో కుంద గ్రామము లో క్రీ.పూ. 599 లో క్షత్రియ కుటుంబములో "సిద్దార్ధ మహారాజు" కు , "మహారాణి త్రిషాల"  కు జన్మించిన మహావీరుడికి తల్లి దండ్రులు పెట్టిన పేరు వర్ధమానుడు.

గ్రిగేరియన్ కాలెండర్ ప్రకారం అది ఏప్రిల్ 2వ తీదీగా చరిత్రకారులు గుర్తించారు. వైశాలి రాజ్యం గణరాజ్యం (democratic republic) అంటే గణతంత్ర  ప్రజాస్వామ్యరాజ్యం. రాజును ప్రజలు ఎంపికచేసే విధానం నాటి గణరాజ్యాల్లో సర్వవ్యాపితంగా ఉండేవి. ఈ వైశాలి రాజ్యం “విశ్వంలోనే తొలి ప్రజా స్వామిక రాజ్యం”  

తల్లి గర్భంలో ఉండగానే తమ రాజ్యంలో అన్నీ శుభాలు జరిగిన కారణంగా దాని సంకేతం గా ఆయనకు “వర్ధమానుడు” అని పేరు పెట్టారు. ఆయనకు వీర, వీరప్రభు, అతి వీర, సన్మతి, ఙ్జానపుత్ర అనే పేర్లతో కూడా పిలిచేవారు. ఐదేళ్ళ వయసులో సంస్కృత వేదాధ్యయనం కోసం గురుకులంలో చేరి విద్యావ్యాసాంగాన్ని పూర్తి చేసుకుని వచ్చిన తరవాత యశోధరను వివాహమాడి  ఒక కుమార్తె “ప్రియదర్శన” కు జన్మనిచ్చారు.

ఆ తరువాత  రాజ్యపాలనం 12 యేళ్ళ పాటు చేశారు. ఆసమయములో ఎక్కువ భాగము యోగ, ధ్యానంలో గడిపుతూ అహింసా మార్గంలో సకలజీవులను సమదృష్టితో చూసే వారు. జీవహింసను తన రాజ్యంలో నిరోధించారు. ధైర్య సాహసాలతో అహింసతో ఙ్జానభోధలతో ప్రజా జీవితం శాంతి సౌఖ్యాలతో ప్రజాపాలన నెరిపారు. ఆయన ఎంత  సౌమ్యుడో అంత గొప్ప ప్రజా సంరక్షకుడుగా ఉండటం తో ఆయనను ప్రజలు "మహావీర" అని పిలిచారు. అందుకే  ఆయన వర్ధమాన మహావీరుడుగా చరిత్రలో నిలిచారు. అతని యుద్ధచాతుర్యానికి ఫలితంగా ప్రజలు ఆయన్ని “బాహుబలి” అను కూడా పిలిచారు.  

అల్లారుముద్దుగా పెరిగిన మహావీరుని తల్లి దండ్రులు అతని 28 వ ఏట మరణించారు.  ఆ తరువాత  రాజ్యపాలనం 12 యేళ్ళ పాటు చేశారు.  ఆ తరవాత 36వ ఏట సన్యాసాన్ని స్వీకరించిన వర్ధమానుడు. 12 ఏళ్ళ పాటు తపస్సుచేసి మహావీరుడుగా జైనమత ప్రచారకుడయ్యాడు. అప్పటికే  జైనమతానికి 23మంది తీర్ధంకరులుగా ఉన్నప్పటికీ మహావీరుడు బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆ మతానికి సంభందించిన వివరాలు వెలుగుచూశాయి.  జైనమతానికి 24 వ తీర్ధంకరులుగా జినుడు జైనుడు అనే పేర్లతో ప్రఖ్యాతి గాంచారు.

ముప్పై రెండు యేళ్ళ పాటు అహింసా ధర్మముతో మత ప్రచారం జరిపిన మహావీరుడు 72వ ఏట అంటే క్రీ.పూ. 527  దీపావళి పర్వదినం రోజున మరణించారు. అతని ఆధ్యాత్మిక జీవన యానంలో ప్రజలకు శాంతి, అహింసల విలువలు భోధించారు.  జైనమతాన్ని అనేక దేశదేశాలు పాద రక్షలు లేకుండా  తిరిగి ప్రచారం చేశారు. ప్రజలను ఆధ్యాత్మికతకు అతిదగ్గరలో చేర్చటానికి ప్రయత్నించారు. 30సంవత్సరాల తనమార్గంలో ప్రజలకు సత్యం, అహింస, అబద్ధమాడకుండటం, పరిశుద్ధ జీవనవిధానం, సకలజీవులను సరిసమానంగా చూడటం ఇవన్నీ వర్ధమానుడు భోధించిన జైనమత సిద్ధాంతాలు. నిజమైన జైనులెవ్వరూ సూక్ష్మజీవులను కూడా చంపకపోవటం మనం గమనిస్తూనే ఉన్నాము. 


అహింస, సత్యం, దొంగతనం చేయకుండటం, బ్రహ్మచర్యం పాటించటం, అపరిగ్రహ - (అంటే దేనితోను భవభందాలు కలిగి ఉండని స్థితి అటు ప్రజలు, ప్రాంతాలు, పదార్ధాలు ఇలా వేటిపైనా ఇష్టం కలిగి ఉండకపోవటం)  అవే జైనమత మూల సూత్రాలు. ఇవి ప్రజలు పాటిస్తే ఇక విశ్వం కళ్యాణమయమవటం సత్యం. అందుకే భారత స్వాతంత్ర సమరంలో ఈ గుణాలే మహాత్మాగాంధిని ఆహింసామార్గం వైపు నడిపించటం దాంతోనే స్వాతంత్రం లభించటం జరిగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: