రంగస్థలం.. ఫస్ట్ హాఫ్ అద్దిరిపోయింది.. కానీ...!?

Chakravarthi Kalyan
రామ్ చరణ్ అభిమానులు, మెగా క్యాంపస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సినిమా రంగ స్థలం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అప్పుడే సినిమా టాక్ పై క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఫస్ట్ టాక్ బయటకు వస్తోంది. రొటీన్ సినిమాగా కాకుండా.. సుకుమార్ ప్రత్యేక శ్రద్ధతో 1980 ల నాటి కథలో అలరించేందుకు చేసిన ప్రయత్నంపై ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో చూద్దాం.. 


ఇటీవలి కాలంలో తెలుగు సినిమా మిస్సయిన ఓ సూపర్ ఫ్లేవర్.. రూరల్ అప్పియరెన్స్.. అసలు పల్లెటూరి కథతో సినిమాలే రావడం లేదు. వచ్చినా అరకొరగానే ఉంటున్నాయి. స్టార్ హీరోలెవరూ పల్లెటూరి కథలను ఎంచుకోవడం లేదు. ఈ సమయంలో వచ్చిన పక్కా పల్లెటూరి కథ ఈ రంగస్థలం. ఈ సినిమాలో చెవిటివాడిగా చరణ్ నటన అదుర్స్ అంటున్నారు. 


ప్రత్యేకించి సినిమా ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందట. ప్రత్యేకించిన రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇన్నాళ్లూ రామ్ చరణ్ లోని నటనను సరిగ్గా వినియోగించుకోలేకపోయానే రేంజ్ లో చరణ్ యాక్టింగ్ ఉందట. అయితే సెకండ్ హాఫ్ మాత్రం కాస్త సాగదీసినట్టుగా ఉందట. ముందుగా ఊహించినట్టుగానే రన్ టైమ్ ఎక్కువ కావడం కాస్త ఇబ్బందిపెట్టిందట. 



అయితే ఓవరాల్ గా సినిమా చాలా బావుందని టాక్ వస్తోంది. రామ్ చరణ్ ఖాతాలో మరో సూపర్ హిట్ ఖాయమని అంటున్నారు. పూర్తి స్థాయి టాక్ తెలియాలంటే కాస్త 
ఆగాల్సిందే సుమా.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: