నేడే హనుమాన్ జయంతి..ఘనంగా ఉత్సవాలు..!

Edari Rama Krishna
హనుమాన్ జయంతికి భాగ్యనగరం ముస్తాబైంది. జయంతి ఉత్సవాల్లో భాగంగా వీరహనుమాన్ శోభయాత్ర జరగనుంది. ప్రత్యేక పూజల తర్వాత గౌలి గూడ రామమందిరం నుంచి ప్రారంభమయ్యే శోభయాత్ర… పుత్లీబౌలీ చౌరస్తా, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసి క్రాస్ రోడ్, ప్యారడైస్ మీదుగా సికింద్రాబాద్ లోని తాడ్ బండ్ వీరాంజనేయస్వామి ఆలయానికి చేరుకోనుంది.  రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఉదయం నుంచే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకున్నారు.

శోభాయాత్రకు బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ తో పాటు…పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కొన్ని రూట్లల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తామన్నారు పోలీసులు. కాగా, కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయంలో ఈ రోజు జరుగుతున్న హనుమత్ జయంతి ఉత్సవాలను వీఆర్ డీఓటీ యాప్ ద్వారా 360 వర్ట్యూవల్ రియాలిటీలో తిలకించే సౌకర్యాన్ని కల్పిస్తు న్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హనుమత్ భక్తులకు కర్మన్‌ఘాట్ హనుమంతుని పూజలు వీక్షించే విధంగా అవకాశం కల్పి స్తున్నట్లు కాల్పనిక్ టెక్నాలజీ అనే స్టార్ట్‌అప్ కంపెనీ వారు తెలిపారు. ర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయంలో హనుమత్ జయంతి ఉత్సవాల ప్రత్యక్ష ప్రసా రాలను భక్తులు తిలకించవచ్చని వారు తెలిపారు.

ఈ ప్రసారాలను చూసే భక్తులు తామే స్వయంగా కర్మన్‌ఘాట్ దేవాలయంలో ఉండి పూజలు చేస్తున్న రీతిలో లీనమయ్యేందుకు ఆస్కారం ఉందని వారు తెలిపారు. అయితే వీఆర్ డీవోటీ యాప్ ప్రస్తుతం గుగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్‌ల నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలని వారు అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: