ఇలా 'దుస్తులు తొలగించి చెసే తనిఖీ' లైంగిక వేదింపు కాదా? స్పైస్‌జెట్ మహిళా సిబ్బంది

"తనిఖీల పేరుతో వారు మా శరీరాన్ని అసభ్యకరరీతిలో తాకుతున్నారు. ఇది మాకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. మా సానిటరి ప్యాడ్స్‌ను తీసివేయాలని, మా శరీరాన్ని తాకాలని మీ పాలసీ లో ఉందా? ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం​ మమ్మల్ని నియమించుకున్నారు. కానీ మా భద్రత గౌరవం మాటేంటి" అంటూ ఎయిర్‌హోస్టెస్‌లు ఏయిర్‌లైన్స్‌ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. తమపట్ల తమ గౌరవం భద్రతా సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరు అత్యాచారం, వేధింపుల కంటే ఏమైనా తక్కువగా ఉందా? అంటూ ఎయిర్‌హోస్టెస్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

స్పైస్‌జెట్ బడ్జెట్ క్యారియర్‌గా మంచి పేరున్న ఏయిర్లైన్స్. అయితే స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌లో ఇప్పుడిప్పుడే పై విధంగా షాకింగ్ సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆ సంస్థకు చెందిన ఎయిర్ హోస్టెస్‌ లను సొంత భద్రతా సిబ్బందే దుస్తులు తొలగించి మరీ తనిఖీలు చేశారు.  చెన్నై ఎయిర్‌పోర్టు లో గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ వ్యవహారంపై ఒక ఎయిర్ హోస్టెస్ మీడియాకు వెల్లడించడంతో ఇది బయటి ప్రపంచానికి తెలిసింది.

ఒక  ఎయిర్‌హోస్టెస్ బ్యాగులోని శానిటరీ ప్యాడ్స్ సైతం తొలగించి మరీ తనిఖీ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మహిళా భద్రతా సిబ్బంది తమను నూలుపోగు లేకుండా నిలువబెట్టి అసభ్యంగా తాకారని వాపోయింది. విమాన సిబ్బంది విధులకు ముందు, విధులు ముగించుకున్న తర్వాత తనిఖీలు చేయడం సాధారణమే అయిన ప్పటికీ, ఈ తరహా ట్రీట్‌-మెంట్‌ తమను అవమానించడమేనని ఎయిర్‌హోస్టెస్‌ పేర్కొంది.
 
ఎయిర్‌హోస్టెస్‌లు ఆహారపదార్థలు, ఇతర తినుబండారాలు, ఫౄట్ జూస్ లాంటి బెవెరేజెస్  అమ్మడానికి ప్రయాణికుల వద్ద నుంచి డబ్బు తీసుకుంటున్నారనే అనుమానంతో కొద్దికాలం నుంచి స్పైస్‌జెట్‌ యాజమాన్యం విమానాలు డీబోర్డింగ్‌ అయ్యాక వారిని భద్రతా సిబ్బంది చేత తనిఖీలు చేయిస్తుంది. తనిఖీలు నిర్వహించే వరకు బాత్‌రూం లోకి కూడా వెళ్లకూడదని ఎయిర్‌హోస్టెస్‌లను ఆదేశించింది. ఈ విషయం గురించి ఎయిర్‌హోస్టెస్‌లు నిరసన తెలపడంతో స్పైస్‌జెట్‌ అధికారులు వారితో గుర్గావ్‌లోని తమ కార్యలయంలో మీటింగ్‌ నిర్వహించారు. దీనివల్ల ఆ రోజు రెండు ఇంటర్నేషనల్‌ విమానాలు ఆలస్యంగా నడిచాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: