ప్రభుత్వానికి పలువురు ఐపిఎస్ అధికారులు ఝలక్ ఇవ్వనున్నారా?

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో "కులం" ప్రధాన రాజకీయాలు నాయకత్వాలు రాజ్యమేలుతున్నాయి. ఐతే ఒక రాష్ట్రంలో "ఒక కులం" మరో రాష్ట్రం లో "మరో కులం" ప్రాభవం సంతరించుకున్నాయి.  ఇలాంటి పరిస్థితుల్లో కొందరు అధికారులు ఈ ప్రభుత్వాలతో,  కులాలతో, కులనేతలతో  పని చేయటం చాలకష్టంగా ఉందని అంటున్నారు.  


కొంతమంది ఉద్యోగులు సంపాదనకే కాదు వృత్తిపట్ల అంకిత భావంతో పని చేసి వృత్తినుండి సంతృప్తిని అంటే (జాబ్ శాటిస్ఫాక్షన్) కోరుకుంటారు. అలాంటివాళ్లు ఐఏఎస్ ఐపిఎస్ తదితర స్థానాల్లో చాలమందే ఉంటారు. వీరికి సంతృప్తిని ఇచ్చేది వారి సేవల ద్వారా మెరుగైన జీవితం సాధించే ప్రజలే. సంపాదన కాదు. ఇలాంటివాళ్లు ఏ ప్రలోభాలకు లొంగరు. కుల,మత,ప్రాంత తదాది సరిహద్దులు వీళ్ళని ఏమీ చేయలేవు. కాని వాటి ఫలితంగా అప్రాదాన్య పోష్టుల్లో పని చేయాలంటే వారికి తీరని వ్యధే.  


ఈ సంకుల సమరంలో తాము ఇమడలేకపోతున్నామని అధికారులు కొందరు తమ ప్రవేట్ సందర్భాల్లో స్నేహితులతో పంచుకుంటూ విసుగు అసంతృప్తి నుండి  వెంటి -లేట్ అవుతుంటారు. ప్రస్తుతానికి ఏపి రాష్ట్ర ప్రభుత్వానికి కొందరు ఐపిఎస్ అధికారులు మాత్రం ఝలక్ ఇవ్వనున్నా రని తెలుస్తుంది.  మూడున్నరేళ్ళుగా ప్రభుత్వ తీరును గమనిస్తున్న ఉన్నతాధికారుల్లో అత్యధికు లు కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోవటానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు.


సంవత్సరాల తరబడి తమను అప్రాధాన్యత పదవుల్లో ఉంచటంతో పాటు, అనర్హులకు ప్రభుత్వం బాగా ప్రాధాన్యత ఇస్తూ ఉండటంతో చాలామంది సీనియర్ ఐపిఎస్ అధికారుల్లో అసంతృప్తి రగలటానికి కారణంగా కనిపిస్తోంది. శాఖల కేటాయిపుల్లో (పోస్టింగు) ప్రధానంగా  “కుల సామాజికవర్గం కీలక పాత్ర పోషిస్తుండటంతో వీరు ఏమీ చేయలేక పోతున్నారు. రాష్ట్ర పరిస్థితులు కూడా వీరికి మింగుడుపడటం లేదు.


గత మూడున్నరేళ్ళుగా ఈ వ్యవహారాలు గమనిస్తున్న చాలామంది ఉన్నతాధికారులు విసుగెత్తి ఇక్కడ గౌరవప్రథంగా పనిచేయటం కష్టమని నిర్ణయించుకున్నారు. అందు కనే కొన్ని ఇబ్బందులున్నా వేరే కులాలకు చెందిన వారు కేంద్ర సర్వీసుల లోకి వెళ్ళిపోవటానికి ప్రయత్నాలు సాగిస్తూ తదనుగుణంగా దరఖాస్తులు చేసుకుంటున్నారు.


దానికితోడు కేంద్రంలోని కూడా చాలా పోస్టులు ఖాళీగా ఉండటంతో వీరి ప్రయత్నాల్లో వేగం కూడా పెరిగింది. కేంద్రప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో ఏపికి 145 మంది ఐపిఎస్ లను కేటాయించింది. అయితే, క్షేత్రస్ధాయిలో పనిచేస్తున్నది మాత్రం 120 మంది మాత్రమే. అంటే 25 పోస్టులు కొరత ఉంది.  అందులో కూడా 10 మంది కేంద్ర సర్వీసుల్లోకి మరో నలుగురు డిప్యుటేషన్ పై సెంట్రల్ విజిలెన్స్ లో పనిచేస్తున్నారు. 


త్వరలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కీలక స్ధానాల్లో ప్రతిభ ఆధారంగా కాకుండా కుల సామాజికవర్గాన్ని దృష్టిలో పెట్టుకునే పోస్టింగులు ఇస్తుండటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.


రాష్ట్రం కోసమే జీవిస్తున్నమనే నాయకులు ఉన్నతస్థాయి మానవవనరులను కులం పేరుతో వృధా చేసుకుంటూ పోతే రాష్ట్రప్రజలకు ప్రయోజనం లేకపోగా రాష్ట్రం కులాల కుంపట్లపై కాగిపోవటంతప్ప జరిగేది ఏమీఉండదు. అనిశ్చితి అసహనం పెరుగుతూ పోవటం జరుగుతుంది. ప్రభుత్వాలు ఈవిషయం పట్టించుకోక పోవటం  కడుంగడు  శోచనీయం. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దలను కునే ముఖ్యమంత్రి నగర పునాదుల్లో కులమలినాలను తొలగించుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: