కమ్యూనిస్టులకు చుక్కలు చూపెడుతున్న పవన్ !

Seetha Sailaja
ప్రత్యేక హోదా కోసం కొనసాగుతున్న పోరాటంలో ప్రస్తుతం వామపక్ష పార్టీనాయకులతో కలసి ఉద్యమం చేస్తూ రానున్న ఎన్నికలలో ఉభయ కమూనిస్ట్ పార్టీలతో కలసి ఒక కూటమిగా ఎన్నికలబరిలోకి దిగుదాము అని భావిస్తున్న జనసేనాని పవన్ కు వామపక్ష పార్టీనేతలకు మధ్య  అభిప్రాయభేదాలు పెరిగిపోతున్నాయి అని రాజకీయ వర్గాలలో వార్తలు హడావిడి చేస్తున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు వ్యతిరేకంగా గళం ఎత్తవలసిన ఈసమయంలో పవన్ కళ్యాణ్ మితిమీరిన మెతకతనం వామపక్ష నేతలకు ఏమాత్ర రుచించడం లేదు అంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి జరుగుతున్న ఉద్యమంలో   వైఎస్ఆర్ కాంగ్రెసు తెలుగుదేశం పార్టీలు ప్రతిరోజు ఏదో ఒక పోరాటం చేస్తూ ఉంటే ఆపార్టీలకు దీటుగా దూకుడుగా పోరాటాలు చేయవలసిన పవన్ ఈ విషయం పై సాఫ్ట్ గా వెళ్దాం అంటూ ఎప్పటికప్పుడు వామ పక్షాల ఉత్సాహానికి బ్రేకులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని ఉధృతం చేసి తిరిగి ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిన వామ పక్షాలకు కనీసం రాబోతున్న ఎన్నికలలో కనీసపు స్థానాలు అయినా గెలవాలి అన్న ఉద్దేశ్యంతో పవన్ కల్యాణ్ ‘జన సేన’ తో జతకట్టిన తరువాత ప్రతీరోజు హై వేల పై  మార్నింగ్ వాక్ మినహా తమకు కలిసివచ్చింది ఏమిటి అని ఉభయ కమూనిస్ట్ పార్టీ నేతలు అంతర్మధనంలో ఉన్నట్లు తెలుస్తోంది.
 
సాధారణంగా వామపక్ష పార్టీలకు పోరాటాలు చేయడంలో చాలా వేగంగా స్పందిస్తాయి.  తమకు ప్రస్తుతం బలం తక్కువే అయినా పవన్ ఇమేజ్ తో జనం మధ్యకు చొచ్చుకుపోదామని భావించిన వామ పక్షాల వ్యూహాలకు ఆది లోనే అడ్డంకులు ‘జనసేన’ విధానవల్ల ఏర్పడటంతో వామ పక్షాల కేడర్ జరుగుతున్న పరిణామాలు చూసి షాక్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో వామపక్ష నేతలు స్పెషల్ హోదా విషయమై గట్టి పోరాటాలు చేయడానికి ఎలా పవన్ ను ఒప్పించాలా తెలియక తికమక పడుతున్నట్లు టాక్.  

మోడీని పల్లెత్తు మాట అనకుండా మరోవైపు జన జీవితాన్ని స్తంభింపజేసే ఉద్యమాలు చేయకుండా ఆమరణ నిరాహారదీక్షకు ఇంకా సమయం రాలేదు అంటూ ఇలా పవన్  రోజులు గడుపుకుంటూ పోతే ఈలోపున ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదు అంటూ వామపక్ష నేతలు తమ సాన్నిహిత వర్గాలతో కామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఇలాంటి పరిస్థితులలో ‘జనసేన’ కమ్యూనిస్టులతో కలసి  మూడు పార్టీల కూటమిగా పోటీచేసినా  వోట్ల విషయంలో మూడవ స్థానానికి పరిమితం అయి పోతామా అన్న భయం వామపక్ష నేతలను భయపెడుతోంది అన్న వార్తలు రాజకీయ వర్గాలలో హడావిడి చేస్తున్నాయి.  దీనితో పవన్ కన్ఫ్యూజన్ కమూనిస్ట్ పార్టీ నేతలకు కూడ బ్రహ్మ  పదార్ధంగా మారింది అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: