‘జగన్’పై బీజేపీ చేపట్టబోతున్న స్పెషల్ ఆపరేషన్..!?

Vasishta

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు యమ రంజుగా సాగుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ నుంచి టీడీపీని బయటకు లాగాలనుకున్న వైసీపీ.. ఆ విషయంలో సక్సెస్ అయింది. వైసీపీ ట్రాప్ లో పడ్డ చంద్రబాబు.. చివరకు ఎన్డీయే నుంచి బయటికొచ్చి ప్రత్యేక హోదా కోసం పోరుబాట పట్టారు. ఈ విషయంలో వైసీపీ సక్సెస్ అయింది. అదే సమయంలో బీజేపీతో వైసీపీ రహస్య స్నేహం చేస్తోందని, అందుకే తమను బీజేపీ పట్టించుకోవడం లేదని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే ఈ స్నేహానికి ఇప్పుడు బీటలు వారే అవకాశం కనిపిస్తోంది.


          కేంద్రంలోని బీజేపీతో వైసీపీ నేతలు అంటకాగడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోయింది. ప్రధాని మంత్రి కార్యాలయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఏంటి పని అని పలుమార్లు స్వయంగా సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. దీంతో వైసీపీ మరింత జోరు పెంచింది. ప్రధానిని కలవడంలో తప్పేంటని ఎదురుదాడి మొదలుపెట్టింది. టీడీపీ ఎంపీలు చూస్తుండగానే విజయసాయిరెడ్డి ప్రధాని కార్యాలయంలో ఇంకా ఎక్కువగా తారసపడడం మొదలుపెట్టారు. దీంతో వైసీపీని బీజేపీయే ప్రోత్సహిస్తోందని టీడీపీ ఆందోళన చెందింది. వైసీపీ దగ్గరవడం వల్లే బీజేపీ తమను దూరం పెడ్తోందనే అంచనాకు వచ్చింది. బీజేపీ నుంచి బయటకు వచ్చేసింది.


          అయితే ఇప్పుడు వైసీపీ – బీజేపీ మధ్య స్నేహం చెడిపోయేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా వైసీపీ దూకుడు పెంచింది. ఇందుకోసం బలమైన నాయకుల అన్వేషణలో పడింది. ఈ క్రమంలో కొంతమంది బీజేపీ నేతలను సైతం చేర్చుకునేందుకు సిద్దమైంది. బీజేపీ అధ్యక్షపదవి ఆకాంక్షించిన కన్నా లక్ష్మినారాయణ రేపోమాపో వైసీపీలో చేరడం ఖాయమైంది. ఇలా పలువురు బీజేపీ నేతలు వైసీపీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇది వైసీపీ – బీజేపీ మధ్య ఇన్నాళ్లుగా సాగిన ఫ్రెండ్ షిప్ కు ఇబ్బందులు తెచ్చేలా కనిపిస్తోంది.


సొంతంగా బలపడి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతుంటే.. తన పార్టీ నేతలను వైసీపీ చీల్చి తమలో కలుపుకోవడాన్ని బీజేపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంటున్నట్టు సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే వైసీపీలోని బలమైన నేతలను తమవైపు లాక్కోవాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాక- జగన్ కేసులపై మళ్లీ పట్టు బిగించే యోచనలో ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: