నేడు ఆశారాం బాపు రేప్ కేసులో తుదితీర్పు..హై అలెర్ట్!

siri Madhukar
ప్రస్తుతం జైలు ఊచలు లెక్కపెడుతున్న ఆశారామ్‌జీ బాపూ ఒక ఆధ్యాత్మిక గురువు. ఇతని అనుచరులు సాధారణంగా ఇతనిని "బాపూజీ" అని పిలుస్తారు. భక్తులకు సత్సంగ్, యోగ, వేదాంతం, భక్తి, ముక్తి వంటి విషయాల గురించి బోధించే ఈ వృద్ధ బాపూజీ కామ కోరికలకు అతీతుడు కాదు. ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ 16 ఏళ్ల బాలిక ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇపుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. 

నేడు బాపు కేసులో నేడు జోధ్‌పూర్ కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అప్రమత్తంగా ఉండాలంటూ రాజస్థాన్, గుజరాత్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది.  పోస్కో చట్టం, ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఆశారాం 2013 ఆగస్టు 31 నుంచి జోథ్‌పూర్ జైలులోనే ఉన్నారు.

అత్యాచారం కేసులో ఆయన దోషిగా తేలితే గరిష్టంగా 10 ఏళ్ల జైలుశిక్ష పడుతుంది. ఇకపోతే, ఆశారాంకు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఫాలోయింగ్ ఉండడంతో భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్రం ఆదేశించింది. దీంతో రాజస్థాన్, గుజరాత్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రెడ్‌అలెర్ట్ ప్రకటించారు. అవసరమైతే అదనపు బలగాలను మోహరించాలని ఆదేశించింది.

మరోవైపు బాధిత బాలిక కుటుంబం ఇంటి వద్ద షహరాన్‌పూర్ జిల్లా యంత్రాంగం భారీగా బలగాలను మోహరించింది.  తుదితీర్పు సందర్భంగా ఆశారాం బాపు సహా మరో నలుగురు నిందితులు కోర్టుకు హాజరుకానున్నట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: