ప్లీనరీ రోజే కేసీఆర్ కి దిమ్మతిరిగే షాక్!

siri Madhukar
నేడు హైదరాబాద్ శివార్లలోని కొంపల్లిలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో  ముఖ్య అతిథులకు, పార్టీ నేతలు, కార్యకర్తలతో సందడి వాతావరణం నెలకొంది.  సభలో ముఖ్య నేతలు మాట్లాడారు..కేసీఆర్ తనదైన స్పీచ్ తో దుమ్మురేపారు..అంతా హ్యాపీగా సాగిపోతుండగా..టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు ప్లీనరీ రోజే ఊహించని షాక్ తగిలింది. ఓవైపు ప్లీనరీతో ఆయన భవిష్యత్ రాజకీయానికి బాటలు వేసుకుంటుండగా మరోవైపు ఆయన చిరకాల రాజకీయ ప్రత్యర్థి రూపంలో మింగుడు పరిణామం చోటుచేసుకుంది. 

ఇంతకీ ఎంటా విషయం అనుకుంటున్నారా! ఈ మద్య అసెంబ్లీలో రచ్చ చేసిన నల్లగొండ ఎమ్మెల్యే కోమటి రెడ్డికి సంబంధించిన విషయం. కాంగ్రెస్ ఎమ్మెల్యే  కోమరెట్టి వెంకటరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. వివరాల్లోకి వెళితే.. గత మూడు సంవత్సరాల క్రితం   కోమటిరెడ్డి విద్యార్హతకు టీఆర్ ఎస్ నేతలు దుబ్బాక నరసింహారెడ్డి - కంచర్ల భూపాల్ రెడ్డి వేసిన పిటిషన్ వేశారు. ఆ కేసుకు మూడేళ్లుగా కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా తుది తీర్పు వెలువడింది. అయితే కాకతాళీయంగా అదే రోజు టీఆర్ ఎస్ ప్లీనరీ కావడం విశేషం.

ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడిన విషయంలో కూడా కోమటిరెడ్డికి ఈ మధ్య కోర్టులో ఊరట లభించిన విషయం విదితమే. ఆయన విద్యార్హతలకు సంబంధించి దుబ్బాక నరసింహారెడ్డి - కంచర్ల భూపాల్ రెడ్డిలు వేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టేసింది. అంతేకాకుండా కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ పిటిషన్ దారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు వారిరువురిపై చెరో రూ. 25 వేల చొప్పున జరిమానా కూడా విధించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: