ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల..టాపర్స్ వీరే!

Edari Rama Krishna
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు కాసేపటి క్రితం మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో విడుదల చేశారు.   ఈ ఏడాది ఏపీ ఎంసెట్‌లో భాగంగా 1,90,924 మంది విద్యార్థులు ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షకు హాజరవ్వగా.. 73,371మంది అగ్రి, మెడికల్‌ పరీక్షలకు హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 72.28 శాతంతో లక్షా 38వేల మంది ఉత్తీర్ణత సాధించారని, అలాగే అగ్రికల్చర్ విభాగంలో 87.6 శాతంతో 63,883 మంది అర్హత సాధించారని మంత్రి తెలిపారు. 
 గతంలో విడుదల చేసిన ఎసెంట్‌ కీకి సంబంధించి.. 224 అభ్యంతరాలు వచ్చాయని, నిపుణుల కమిటీ వాటిని పరిశీలించి.. అభ్యంతరాలను నివృత్తి చేస్తుందని మంత్రి గంటా తెలిపారు. 

ఇంజినీరింగ్‌లో భోగి సూరజ్‌ కృష్ణ (95.27శాతం మార్కులు) ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించగా, రెండో ర్యాంకును మైత్రేయ (94.93), మూడో ర్యాంక్‌ను లోకేశ్వర్‌రెడ్డి, నాలుగో ర్యాంక్‌ను వినాయక్‌ వర్ధన్‌ (94.20), ఐదో ర్యాంక్‌ను షేక్‌ వాజిద్‌ సొంతం చేసుకున్నారు. కొన్ని లక్షల మంది విద్యార్థులు ఎంసెట్ రాసి ఫలితాల కోసం వేచి ఉన్నారు. ఫలితాలను వెబ్‌‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.  కాగా ఈనెల 26 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారుజూన్‌ 11 నుంచి ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. అగ్రికల్చర్‌ విభాగంలో సాయిసుప్రియ (94.78శాతం మార్కులతో) మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నారు. రెండో ర్యాంక్‌ వాత్సవ్‌ (93.26), మూడో ర్యాంక్‌ హర్ష (92.47) సాధించారు.


ఇంజనీరింగ్ టాపర్ :
బోగి సూరజ్ కృష్ణ (95.27 శాతం)కు మొదటి ర్యాంకు వచ్చింది. గట్టు మైత్రేయకు (95.13) రెండో ర్యాంక్, లోకేశ్వర్ రెడ్డికి (94.22) మూడో ర్యాంకు, వినాయక్ శ్రీవర్ధన్‌కు (94.20) నాలుగో ర్యాంకు, షేక్ వాజిద్‌కు (93.78) ఐదో ర్యాంకు, బసవరాజు జిష్ణుకు (93.51) ఆరో ర్యాంకు, వంశీనాథ్‌కు (92.86) ఏడో ర్యాంకు, హేమంత్ కుమార్‌కు (92.71) ఎనిమిదో ర్యాంకు, బొడ్డపాటి యజ్ణేశ్వర్‌కు (92.67) తొమ్మిదో ర్యాంకు, ముక్కు విష్ణు మనోజ్ఞకు (92.56) పదో ర్యాంకు వచ్చాయి. 


అగ్రికల్చర్ అండ్ మెడికల్ టాపర్స్ :
జంగాల సుప్రియ (94.78) మొదటి ర్యాంకు వచ్చింది. గంజికుంట శ్రీవాత్సవ్‌కు (93.26) రెండో ర్యాంకు, శ్రీహర్షకు (92.47) మూడో ర్యాంకు, గుండె ఆదర్శ్‌కు (92.12) నాలుగో ర్యాంకు, జానుభాయ్ రఫియా (91.95) అయిదో ర్యాంకు, ముక్తేవీ జయసూర్య (91.95) ఆరో ర్యాంకు, నల్లూరి వెంకట విజయకృష్ణ (91.31) ఏడో ర్యాంకు, నీలి వెంకటసాయి అమృత (91.21) ఎనిమిదో ర్యాంకు, తరుణ్ శర్మ (91.18) తొమ్మిదో ర్యాంకు, వంటేరు వెంకటసాయి హర్షవర్ధన్ రెడ్డి (91.16) పదో ర్యాంకు వచ్చాయి. 


ఫలితాలు ఇలా చూసుకోండి: 
sche.ap.gov.in, www.sche.ap.gov.in/eamcet, www.vidyavision.com, www.manabadi.com, www.manabadi.co.in and www.schools9.com


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: