కర్ణాటకలో చెలియలికట్ట దాటిన బిజెపి - ఇక టిడిపి కి గడ్దుకాలమేనా?

భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా చేయాలన్నది తెలుగు దేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవితాభిలాష గా మారింది. తన అభిలాషను మనసులో ఉన్నంత కఠినంగా చంద్రబాబు నాయుడు బహిరంగ ప్రకటన చేయక పోయినప్పటికీ, ఏపి రాష్ట్ర బడ్జెట్ సమావేశాల అనంతరం ఆయన చేస్తున్న ప్రతిచర్య అందుకు అనుగుణంగానే ఉంటున్నాయని అనుకోవచ్చు. 

ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు పట్ల నిర్దయగా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించగల కన్నా లక్ష్మీనారాయణ లాంటి సమర్ధుడైన నాయకుడిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా నియమించడంతో చంద్రబాబు రాజకీయ మంత్రాంగం నెఱిపే యంత్రాంగం కొత్త వ్యూహాలకు సిద్దపడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అయితే కర్ణాటకలో చంద్రబాబు నాయుడు ప్రచారం 'బూమరాంగైన దాఖలాలు'  కనిపిస్తున్నాయి. దరిమిలా ఇప్పుడు బిజెపి తెలుగు దేశం పార్టీని ఆగర్భ శత్రువుగా చూడటం తధ్యం. అందుకే చంద్రబాబు తన లోని కుటిల నీతికి పదును పెడుతున్నట్లు పరిశీలకుల వాదన. బిజెపి నూతన రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లోని లోపాలపై  "రంద్రా న్వేషణ" చేయమని తన కోటరీకి ఆదేశాలిచ్చినట్లు తెలుస్తుంది.  


గతంలో మంత్రిగా ఉండగా కన్నా లక్ష్మీనారాయణ, ఎలాంటి అవినీతి పనులు, అక్రమాలు చేశారు? ఎక్కడెక్కడ కన్నా దందాలు కొన సాగించారు? ఆయన మీద అప్పుడు పరిస్థితుల్లో ఎలాంటి విమర్శలు వచ్చాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుగుదేశం వర్గాలు త్రవ్వితీస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు బాబు ఆదేశాలు స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది. 

కన్నా లక్ష్మీనారాయణ గత కాంగ్రెస్ పాలనాకాలంలో నాటి ముఖ్యమంత్రులు నేదురుమిల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్ రాజశెఖరరెడ్డి తదితరుల హయాం లో మంత్రిగా చేశారు. అయితే వైఎస్సార్ సీఎం అయిన తర్వాత, దాదాపు పదేళ్ల కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారినా ఆయన పదవికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. 


ఇలాంటి నేపథ్యంలో తొలిసారి మంత్రి అయిన నాటి నుంచి ఇప్పటి దాకా ఆయన మంత్రిగా చేసిన సమయంలో జరిగిన తప్పులపై ఆరా తీయడానికి తెలుగు దేశం వర్గాలు సమాయత్తమై పరిశోధనలు, శూలసోధనలకు తెరతీసినట్లు ఇప్పటికే సమాచారం వెళ్ళడైంది. అలాగే స్థానికంగా ఆయన వారి సన్నిహితులు కూడా గుంటూరు జిల్లాలో కన్నా లక్ష్మీనారాయణ మీద ఎలాంటి ఆరోపణలు ఉన్నాయో వాటిపై నిశిత పరిశీలన చెసే అవకాశాలపై ఆరా తీస్తున్నారు.


NDA నుంచి తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చిన తరవాత నరెంద్ర మోడీ పై బాబు లో ఉన్న దుగ్ద కన్నా లక్ష్మీనారాయణను అవినీతిపరుడిగా ముద్ర వేసే వ్యూహం గా ప్రయత్నాలు మొదలయ్యాయట. అంటే కన్నా లక్ష్మీనారాయణ భుజస్కందాలపై గన్ పెట్టి బిజెపి లక్ష్యాన్ని చేధించటానికి వ్యూహం పన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. తద్వారా, భారతీయ జనతా పార్టీ ఇలాంటి అవినీతి పరుల్ని ప్రోత్సహిస్తున్నదన్న సంకేతాలను ప్రజలకు బలంగా ఇవ్వదలచుకుందని, రానున్న ఎన్నికల్లో ప్రశ్నించేలాగా వ్యూహాలు సిద్ధం చేస్తుందట. 


"ఇప్పటి బిజెపి సిద్ధాంతాల మీద నడిచే పార్టీ కాదని, మోడీ-షా వ్యూహాత్మక రాజకీయాల్లో పూర్తిగా రూపం మార్చుకున్న నవ బీజేపీ" అనే నినాదాలతో రాష్ట్రంలో ఆ పార్టీని మరింతగా దెబ్బ తీయడం లక్ష్యం గా తెలుగుదేశం పావులు కదుపుతోంది. అయితే చంద్రబాబు కోరుకున్నట్లు కర్ణాటకలో బిజెపి ఓడిపొయి ఉంటే, బాబు వ్యూహం ఫలించి ఉండేది. కాని దైవం బాబు విషయంలో వేరేలాగా తలిచాడు. 

జరిగేదేమంటే ఇన్నాళ్లూ రాష్ట్రానికి ద్రోహం చేసిన నరెంద్రమోడీ దళంపై నీలాపనిందలు వేస్తూ కాలం గడిపిన టిడిపికి ఇప్పుడు అదే నరెంద్ర మోడీదళం, చంద్రబాబు కు నషాళానికి అంటే ఝలక్ ఇవ్వనుందని గతంలో బాబే చెప్పారు. 

భారతీయ జనతాపార్టీ తమ రాష్ట్రస్థాయి నాయకునిగా కన్నా లక్ష్మీనారాయణ నియామకం చేసిన వెంటనే - బాబు దళం నుండి ఒక్కసారిగా "కన్నా భాజపాకు అధ్యక్షుడు అయినప్పటికీ, వైసిపికి వర్కింగ్ ప్రెసిడెంట్" అంటూ ఎగతా ళి చేస్తూ సెటైర్లు వేశారు. చూస్తుంటే టిడిపిలో పెల్లుబుకుతున్న "ధారుణ మానసిన మాంద్యం చాయలు"  కనిపిస్తున్నాయి.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కన్నా లక్ష్మీనారాయణ హయాంలో తాను చేసిన అవినీతికంటే ఈ నాలుగేళ్ళపాలనలో బాబు చేసిన అవినీతి, అక్రమాలు, బందుప్రీతి, చీకటి వ్యాపారాలు మొదలైన వివరాలతో  కన్నా లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నట్లు టిడిపి పరువు ప్రతిష్ట మరింత భయంకరంగా  చంద్రబాబు ఊహించినట్లే, దిగజార్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: