డ్రైవర్ యూనిఫామ్ లో జగన్...!

Prathap Kaluva

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా లో కొనసాగుతుంది. అయితే ఈ పాదయాత్ర కు జనాల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ముఖ్యముగా యువత నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. జగన్ తో సెల్ఫీ ల కోసం ఎగ బడుతున్నారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో పోయిన ఎలక్షన్స్ లో ఒక్క సీటు కూడా వైసీపీ సాధించుకోలేక పోయింది. అయితే ఈ సారి ఎలాగైనా ఈ జిల్లాలో పట్టు సాధించాలని వైసీపీ అధినేత ప్రయత్నిస్తున్నాడు.


అయితే తెల్ల చొక్కాతో నిరంతరం పాదయాత్రలో నిమగ్నమై కనిపించే వైఎస్ఆర్సీ అధినేత జగన్ ఒక్కసారిగా ఖాకీలోకి మారారు. ఖాకీ చొక్కా వేసుకొని ఆటో డ్రైవర్ అవతారం ఎత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని మేదినరావుపాలెం జంక్షన్ వద్ద, ఆటోడ్రైవర్ యూనిఫాం వేసుకొని, ఆటోలో డ్రైవర్ సీట్ లో కూర్చున్నారు జగన్.


చంద్రబాబులా ఇది ప్రచారం కోసం స్టంట్ కాదు. ఫొటోలకు పోజులివ్వడానికి అంతకంటే కాదు. జగన్ ఇలా ఆటోడ్రైవర్ యూనిఫాం వేయడం వెనక ఓ రీజన్ ఉంది. మొన్న ఏలూరులో జరిగిన బహిరంగ సభలో ఆటోడ్రైవర్లకు వరాలు ప్రకటించారు జగన్. వైఎస్ఆర్సీ అధికారంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఆటో డ్రైవర్ కు 10వేల రూపాయలు అందజేస్తామని ప్రకటించారు. దానికి కృతజ్ఞతగా ఇలా ఆటోడ్రైవర్లంతా కలిసి జగన్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: