యడ్యూరప్ప అనే నేనూ..

siri Madhukar
నాటకీయ పరిణామాల మధ్య  కర్ణాటక సీఎంగా మూడో సారి యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం. కర్ణాటక రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన యడ్యూరప్ప దక్షిణాది రాష్ట్రాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా రికార్డు నెలకొల్పారు.లింగాయత్ సామాజిక వర్గం అండతో  రాజకీయాల్లో గుర్తింపు యెడ్డీ 1943 ఫిబ్రవరి 27న మాండ్య జిల్లా బూకనాకెరెలో జన్మించారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి RSSలో చేరిన యడ్యూరప్ప తొలుత 1970లో శికారిపుర RSS కార్యదర్శిగా ఎంపికయ్యారు.   

2007లో ఒకసారి, 2008లో మరొసారి యడ్యూరప్ప సీఎంగా చేశారు. ఆయన ఇప్పటివరకు ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యడ్యూరప్ప ఒక్కరే నేడు ప్రమాణ స్వీకారం చేశారు. యడ్యూరప్ప సర్కార్ 15 రోజుల్లో బలపరీక్షను ఎదుర్కోనున్న విషయం తెలిసిందే. బలనిరూపణ తరువాత కేబినేట్ ఏర్పాటు కానుంది.  కర్ణాటకలో 56 వేల కోట్ల రైతు రుణాలు రద్దు.  సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం చేసిన యడ్యూరప్ప. 

రాజ్‌భవన్‌లో యడ్యూరప్ప చేత గవర్నర్‌ వాజూభాయ్ వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి ముందు రాధాకృష్ణ ఆలయంలో యడ్యూరప్ప పూజలు చేశారు. ఇవాళ యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణం చేశారు.  బల నిరూపణ పూర్తయ్యే వరకు క్యాబినెట్‌ను విస్తరించే అవకాశం కూడా లేదు. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి ప్రధాన మంత్రి మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా హాజరుకాలేదు. 


కాగా, కర్ణాటకలో 24గంటలుగా నెలకొన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. సీఎం పీఠం నీదా.. నాదా అనే రీతిలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి, బీజేపీలు పెద్ద ఎత్తున పోటీ పడిన సంగతి తెలిసిందే. గవర్నర్ వాజుభాయ్ వాలాతో వరుస భేటీలతో ఆయా పార్టీల నేతలుగా బిజీబిజీగా గడిపారు. అయితే ఇరువైపుల వాదనలనూ విన్న గవర్నర్ తనకు కొంచెం సమయం కావాలని చెప్పి రెండు పార్టీల సీఎం అభ్యర్థులను వారితో వచ్చిన నేతలను పంపించేశారు. అయితే బుధవారం సాయంత్రం గవర్నర్ కీలక నిర్ణయం తీసుకుని సస్పెన్స్‌కు తెరదించారు.కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఇవాళ ఉదయం 9.00 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: