సుత్తి లేకుండా సూటిగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్...!

Prathap Kaluva

పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే అస్సలైన రాజకీయ నాయకుడిలా, ప్రజలకు అర్ధమయ్యే విధముగా మాట్లాడుతున్నాడు. మొన్నటి వరకు టీడీపీ లో ఉండి మాట్లాడే మాటల వల్ల ఎవరికీ అర్ధమయ్యేవి కావు. ప్రతి విషయాన్ని పరోక్షంగా మాట్లాడే వాడు. అయితే ఇప్పుడు సూటిగా సుత్తి లేకుండా నన్ను గెలిపించి నాకు ఓటేస్తే మీ కష్టాలు తీరుస్తా అంటున్నాడు. నన్ను సీఎం గా చూడాలంటే నాకు ఓట్లెయ్యండి. మీ సమస్యలు నాకు చెప్పండి అంటున్నాడు. 

2019 ఎన్నికల్లో మీకు న్యాయం అనిపించే పార్టీనే ఎన్నుకోండి. నేను కరెక్ట్ అనుకుంటే జనసేనకే ఓటేయండి. నాకు పూర్తి సహకారం అందించండి. మీ సమస్యలు నేను పరిష్కరిస్తా. నన్ను ఆదరించండి. మీ కష్టాలు తీరుస్తా. చూశారుగా.. ఇలా సిసలైన ఎన్నికల ప్రచారాన్ని తలపించాడు పవన్ కల్యాణ్. బస్సు యాత్రకు ముందే తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని మరోసారి ప్రకటించిన పవన్.. తనకు, తన పార్టీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఇలా సిసలైన రాజకీయ నాయకుడిలా ప్రసంగించాడు పవన్. తనను ముఖ్యమంత్రిని చేస్తే.. తనకు పూర్తి సహకారం అందిస్తే.. ఒక కొత్త రకమైన బాధ్యతతో కూడిన ప్రభుత్వం జనసేన పేరుమీద స్థాపిస్తానంటూ ప్రకటించేశాడు. టీడీపీ, బీజేపీకి ఓటేయండని తను అప్పట్లో చెప్పానని.. కానీ ఇచ్చిన వాగ్దానాల్ని వాళ్లు నేరవేర్చలేదు కాబట్టి ఇప్పుడు తను నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చిందన్నాడు పవన్. అందుకే ప్రజలంతా జనసేనకే ఓట్లు వేసి సహకరించాలని కోరాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: