కేసీఆర్ ను పట్టించుకొనే నాధుడే లేడా...!

Prathap Kaluva

కేసీఆర్ ఆ మద్యంతా ఫెడరల్ కూటమి అని దానికి నేనే సారధ్యం వహిస్తా అని నానా హంగామా చేసారు. కానీ చివరకు ఎవరి నుంచి కూడా అంతగా రెస్పాన్స్ రానట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా మూడో ఫ్రంట్ మీద అంతగా ఆసక్తి చూపించడం లేదు. తమిళ నాడు లో కూడా స్టాలిన్ అంతగా ఈ కూటమికి ప్రాధాన్యత ఇవ్వలేదు అని చెప్పవచ్చు. ఇది నిజంగానే కేసీఆర్ కు షాక్ అని చెప్పవచ్చు. 


చివరికి మూడోఫ్రంట్ ప్రయత్నాలతో ఉపయోగంలేదని, భాజపా వ్యతిరేకతతో కాంగ్రెస్ తో కలిసిన కూటమి మాత్రమే నిలబడుతుందని చెప్పారు. కేసీఆర్ చెన్నై వెళ్లి డీఎంకేను కలిస్తే.. వారు తమ వద్దకు వచ్చింది మూడోకూటమి గురించి మాట్లాడడానికి కానేకాదని తేల్చేశారు. తీరా తొట్టతొలుత కేసీఆర్ భేటీ అయిన మమతా దీదీ కూడా చంద్రబాబును మూడోకూటమి ఏర్పాటు చేయడానికి సారథ్యం వహించాల్సిందిగా కోరుతుండడం విశేషం.


మరి ఇన్నాళ్ల కేసీఆర్ ప్రయత్నాలు ఏమైనట్టు? ఆయన కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరేనా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కేసీఆర్ కు జైకొట్టిన వారిలో ప్రస్తుతం నికరంగా ఆయన సారథ్యానికి ఓకె చెప్పిన వారు హేమంత్ సోరెన్ తప్ప మరెవ్వరూ లేరు. అఖిలేష్ యాదవ్ నిర్ణయం కూడా అచ్చంగా ఆయనకు మద్దతు అనడానికి వీల్లేదు. కాంగ్రెస్ తో కలిసిన కూటమి మాత్రమే ఉండాలని ఇతర పార్టీలన్నీ పట్టుబట్టేట్లయితే గనుక.. అలాంటి కూటమిలో కేసీఆర్ ఏమాత్రం ఇమడలేడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: