జనసేనకు భారంగా మారబోతున్న మెగాఫ్యామిలీ ప్రకటనలు !

Seetha Sailaja
శ్రీరెడ్డి వివాదంలో పవన్ కోరకుండానే మెగాఫ్యామిలీ అంతా పవన్ కు బాసటగా నిలిచి తామంతా ఒక్కటే అన్న సంకేతాలు ఇచ్చారు మెగా కుటుంబ సభ్యులు. గత కొన్ని సంవత్సరాలుగా పవన్ తో దూరం కొనసాగిస్తున్న అల్లుఅర్జున్ అరవింద్ లు కూడ  శ్రీరెడ్డి వివాదంలో పవన్ కు సంఘీభావం ప్రకటించి పవన్ ఏనిర్ణయం తీసుకున్నా తాము సపోర్ట్ చేస్తాము అని చెప్పి మెగా కుటుంబ ఐక్యతా రాగంలో అల్లుఅర్జున్ అరవింద్ లు కూడ తమ గొంతు కలిపారు. 

ఇది ఇలా ఉండగా ఈమధ్య ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ తాను  సరైన సమయంలో ‘జనసేన’ లో చేరబోతున్న సంకేతాలు ఇచ్చాడు. ఇదిచాలదు అన్నట్లుగా నిన్న చరణ్ మీడియావారితో మాట్లాడుతూ తాను జనసేనలోకి చేరే విషయంలో తన బాబాయి పిలుపు కోసం ఎదురు చూస్తున్న విషయానికి సంబంధించిన లీకులు ఇచ్చాడు. ఇప్పటికే ఇదే అభిప్రాయాన్ని సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ లు వ్యక్తపరిచిన పరిస్థితులలో పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులు అందరికీ ఎప్పుడు ఆహ్వానం పలుకుతాడు అనే విషయం పై రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 

ఈవిషయమై జనసేన వర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. రాబోతున్న ఎన్నికలలో పవన్ కు బాసటగా మొత్తం మెగా ఫ్యామిలీ అంతా రంగంలోకి దిగేతే మంచిది అని కొందరు ‘జనసేన’ కార్యకర్తలు అభిప్రాయపడుతూ ఉంటే ఇలాంటి నిర్ణయం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపి ‘జనసేన’ కూడ గతంలో ‘ప్రజారాజ్యం’ పార్టీలా కుటుంబ పార్టీ అన్న ముద్రవేయించుకునే ప్రమాదం ఉంది అని మరికొందరు జన సైనికులు అభిప్రాయ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు పరోక్షంగా అల్లు అరవింద్ సూచనలతో జనసేన అడుగులు వేస్తే దానివల్ల చాల నెగిటివ్ అభిప్రాయం జనసేన కార్యకర్తలలోనే ఏర్పడే ప్రమాదం ఉందని కొందరు పవన్ దృష్టికి తీసుకువెళుతున్నట్లు టాక్. 

దీనితో పవన్ తన కుటుంబ సభ్యులను జనసేన లోకి ఆహ్వానించాలా లేదంటే వారు ఆసక్తి కనపరుస్తున్నా వ్యూహాత్మక మౌనం కొనసాగించాల అన్న విషయమై ఎటూ తేల్చుకోలేక పోతున్నాడని సమాచారం. దీనికితోడు పవన్ ప్రారంభించిన ‘పోరాట యాత్ర’ ఈరోజు కూడ ఆగిపోయింది అని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం సెక్యూరిటీ రీజన్స్ అని అంటున్నారు. అయితే ప్రజల మధ్యకు వచ్చి కలిసిపోయి కష్టాలు తెలుసుకోవలసిన రాజకీయ నాయకుడుగా ప్రస్తుతం కొనసాగుతున్న పవన్ ఇలా ఎన్నిరోజులు ఎదో ఒక కారణంతో జనం మధ్యకు పూర్తిగా రాకుండా తప్పించుకోగలడు అన్న విమర్శలు పవన్ వ్యవహార శైలి పై వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: