శ్రీవేంకటేశునికి కులం అంటగట్టిన మురళి మోహన్ - తరవాత టంగ్ స్లిప్ అని సవరణ

తెలుగు దేశం వాళ్ళకు ఈ మద్య నోటి దూల కుల మధం తారస్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా టాఈవుడ్ జనాలకి. చివరికి వీరి పిచ్చి ముదిరి పీక్స్ కు చేరింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశునికి కూడా కులం అంటగట్టటానికి తీవ్య అభ్యంతరకర ప్రయత్నాలు జరుగుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. తాను పొరపాటున నోరు జారి శ్రీ వెంకటేశ్వర స్వామిని 'వెంకన్న చౌదరి' గా పేర్కొన్న సంఘటనపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు మురళీమోహన్ వివరణ ఇచ్చారు. నోరు జారడం సహజంగా జరిగేదేనని, దేవుడితో కూడా ఇదే చెప్పుకున్నానని ఆయన అన్నారు..

రాజమండ్రిలో ఒక సమావేశంలో పొరపాటున 'వెంకన్న చౌదరి' అన్నట్లు చెబుతూ అప్పటి దాకా బుచ్చయ్య చౌదరి పక్కన కూర్చొని "చౌదరిగారూ.. చౌదరిగారూ.." అని మాట్లాడుకున్నామని చెప్పారు. వెంకన్న చౌదరి అనడం 'టంగ్‌ స్లిప్' తప్ప దేవుడికి కులాన్ని అంట గట్టేంత తెలివితక్కువ వాడిని కానని వివరణ ఇచ్చుకున్నారు. తనకు అసలు కులాల మీద నమ్మకమే ఉండదని, అలాంటిది వెంకటేశ్వరస్వామికి కులం ఎలా అంటగడతానని అన్నారు. టంగ్‌ స్లిప్‌ అనేది సహజంగా జరుగుతూ ఉంటుందని సమర్థించుకున్నారు. 

"టంగ్‌ స్లిప్‌ అయింది స్వామి.. పొరపాటుగా అన్నాను.. కావాలని అనలేదు.." అని దేవుడికి దండం పెట్టుకున్నానని అన్నారు. తాను వెంకన్న చౌదరి అని అనడంపై మురళీ మోహన్ వివరణ ఇస్తూ వీడియో పోస్టు చేశారు. అయితే జనం అనేదేమంటే, ఒక ప్రయత్నం చేశారు, ఎవరూ పట్టించుకోకపోతే, అలాగే శ్రీవేంకటెశ్వరుని వెంకన్న చౌదరి అంటూ ప్రచారంలోకి తెచ్చేవారు మురళి మోహన్ అంటున్నారు.

అది మురళి మోహన్ సమాజవర్గ సహజ లక్షణమేనని ఏపి ప్రజలు అభిప్రాయపడ్డారు. వీరి సమాజక వర్గ పిచ్చి పరాకాష్ఠకు చేరి మీడియా నుండి దైవం వరకు వ్యాపించింది అని  అంటున్నారు. రానున్న ఎన్నికల్లో కులం దెబ్బ దైవాపచారం దెబ్బ టిడిపికి ధారుణంగా తగలొచ్చు అనేది అభిజ్ఞ వర్గాల కథనం.    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: