దూకుడు పెంచిన పవన్..! స్ట్రాటజీల్లో చంద్రబాబు..!!

Vasishta

పోరాటయాత్రతో తెలుగుదేశం పార్టీ వైఫల్యాలపై పవన్ దండయాత్ర ప్రారంభించారు. రాష్ర్టంలో రాజకీయ మార్పు అనివార్యం అంటోన్న పవన్.. తెలుగుదేశం పార్టీని గద్దె దింపడమే లక్ష్యంగా పోరాటయాత్రలో విమర్శల దూకుడు పెంచారు.. అటు పవన్ దూకుడుతో తెలుగుదేశం పార్టీ అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తున్నారు..సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు..మహానాడు వేదికపైనే పవన్ పై విమర్శలు గుప్పించారు. పవన్.. బీజేపీ చేతిలో కీలు బొమ్మ అంటూ విమర్శించిన చంద్రబాబు.. ఎన్నికల్లో పోటీ చేస్తే ఆపార్టీకి ఒక్క శాతం ఓట్లు కూడా పడవంటూ వ్యాఖ్యానించారు.


2019 ఎన్నికలే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన పోరాట యాత్ర .. టీడీపీపై దండయాత్రగా మార్చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ .. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ప్రశ్నిస్తూ.. పవన్ పోరాటయాత్రలో సర్కార్ ను తీన్మార్ ఆడేస్తున్నారు. పోరాటయాత్రతో జనం సమస్యలు తెలుసుకూంట ముందుకు సాగుతున్న పవన్.. అక్కడికక్కడే ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా వ్యూహాత్మక ఉద్యమపంథాలో దూసుకెళ్తున్నారు. మొన్నటికి మొన్న ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలపై ఒక రోజు దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్.. ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలియజేశారు.


పోరాటయాత్రలో భాగంగానే ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకహోదాపై కేంద్రం తీరుపై నిరసన కవాతులు నిర్వహిస్తోన్న జనసేనాని.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు.  పేదలను అర్థం చేసుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదని.. నాలుగేళ్లుగా ప్రభుత్వం చెప్పే మాటలు విని విసిగిపోయామన్న పవన్.. ఇక మార్పే శరణమన్యారు. అటు పవన్ కల్యాణ్ దూకుడుతో తెలుగుదేశం పార్టీ అదే రేంజ్ లో పవన్ కు కౌంటర్ ఇస్తున్నారు. మహానాడు వేదికగా పవన్ పై విమర్శలు చేసిన చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో పవన్, జగన్ , బీజేపీ కలిసి పోటీ చేసినా ఒక్క శాతం ఓట్లు కూడా పడవన్నారు. కేంద్రం ఆడించినట్టు పవన్ ఆడుతున్నారని విమర్శించిన చంద్రబాబు.. ప్రజలు కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.


రాజకీయ పార్టీల మధ్య విమర్శలన్నీ ఎన్నికల్లో ఓట్లు , సీట్ల చుట్టే తిరుగుతుండడంతో రాష్ర్టంలో ఎన్నికల మూడ్ వచ్చేసింది. మహానాడుతో టీడీపీ, పాదయాత్రతో జగన్, పోరాటయాత్రతో జనసేనానిని ప్రజల అటెన్షన్ ను తమవైపుకు తిప్పుకునే పనిలో పడ్డారు. 2019 ఎన్నికల సంగ్రామానికి ఎవరి రూట్లో వారు ముందుకెళ్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: