అమెరికా రష్యాల మద్య స్నేహంతో భారత్ ధర్మసంకటం

ప్రపంచం మొత్తం భారత్ కు వ్యతిరేఖంగా ఉన్నప్పుడు, భారత్ పై చైనా పాకిస్థాన్ లు కలిసి కుట్ర పన్నినప్పుడు, రష్యా మనకు సంపూర్ణ సాయం చేసి మనకు నిజమైన స్నేహితుడుగా నిలబడింది. అంతే కాదు మనకు దృఢమైన అండగా నిలిచింది. మనమా మైత్రిని నేడు మరచిపోలేము. అంతేకాదు ఇప్పటికీ  భారత్ తో రష్యా మైత్రి స్థిరం గానే ఉన్నా చైనాతో దాని సన్నిహితత్వం అనుమానాలకు దారితీస్తుంది.


రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా ఆంక్షలు విధించేందుకు సిద్ధపడుతున్న నేపథ్యంలో భారత్ ధర్మసంకటంలో పడిపోయింది. భారత్ లాంటి మిత్ర దేశాల కోసం అమెరికా ఆంక్షలను ఎప్పటికప్పుడు మనకు మాత్రం అనుకూలంగా సరళీకరిస్తూ వస్తుంది.  ప్రత్యేకించి తాజాగా మాత్రం — ఇక మీదట రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయొద్దంటూ ఒకరకం నిషేధం విదిస్తూండటం భారత్ ను కలవరపెడుతుంది.

భారత్  రష్యా నుంచి 5.5 బిలియన్ డాలర్ల విలువైన 'ఎస్-400 ట్రింఫ్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్‌'  కొనుగోలు చేయాలని భావిస్తోంది. కానీ రష్యాతో ఈ ఒప్పందం కుదుర్చుకోవద్దని అమెరికా ఒత్తిడి తెస్తోంది. వ్యూహాత్మక భాగస్వామిగా తాము  భారత్‌కు ఎంతో విలువిస్తున్నామని, రష్యా నుంచి ఎస్-400 మిస్సైల్ సిస్టమ్‌ లను కొనుగోలు చేయడం మాకు అభ్యంతరకరం అని అమెరికా ఘట్టిగానే మనలను హెచ్చరిస్తుంది. ఎస్-400 మిస్సైల్ సిస్టమ్‌ విషయమై రష్యాతో ఒప్పందం చేసుకుంటే 'ఎంక్యూ-9 డ్రోన్లు లేదా ప్రిడేటర్-బి'  లాంటి హైటెక్ ఆయుధాలను భారత్‌ కు విక్రయించ వద్దనిస్ అమెరికా కాంగ్రెస్ సభ్యులు తెగేసి చెబుతున్నారు. 


భారత్‌ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తున్నట్లు అమెరికా చెబుతోంది. ఇందు కోసం 'కమ్యూనికేషన్స్ కంపాటిబిలిటీ అండ్ సెక్యూర్ అరేంజ్‌మెంట్ (కామ్‌కాసా), బేసిక్ ఎక్స్‌చేంజ్ అండ్ కో-ఆపరేషన్ అగ్రిమెంట్ ఫర్ జియో స్పాటియల్ కో ఆపరేషన్ (బెకా)' పై భారత్ సంతకాలు చేయాలని కోరుతోంది. హిందూ-పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో చైనా దూకుడును అడ్డుకోవడానికి ఇది దోహదం చేస్తుందని అమెరికా భావిస్తోంది. 


అమెరికా వేస్తున్న రాజకీయ ఆయుద అమ్మకాల ఎత్తులు, వ్యూహాల వేగవంతమైన ముందడుగులతో,  రష్యా, భారత్ మధ్య ఉన్న చారిత్రాత్మక మైత్రి సంబంధాలు తాజాగా  దెబ్బ తినే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  భారత స్వత్రంత్రం తరవాత నుండి రష్యా అతి పెద్ద ఆయుధ భాగస్వామిగా ఉంది. కొన్నాళ్లుగా అమెరికా నుంచి ఆయుధ దిగుమతులు పెరిగినప్పటికీ. పెద్ద మొత్తంలో ఇప్పటికీ  రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాం.


కానీ మనల్ని దెబ్బతీయాలని చూస్తోన్న చైనాతో, రష్యా మైత్రి కొత్తపుంతలు తొక్కుతుండటంతో రష్యాతో  మన సంబంధాలు విపరీతమైన స్ట్రెయిన్ కు గురౌతున్నాయి. అంతేకాదు అది రష్యాతో మన సంబంధాలను ప్రభావితం చేస్తోంది. ఇదే సమయంలో అమెరికా  భారత్‌కి  తన స్నెహ హస్తం అందిస్తోంది. దీంతో రష్యా నుంచి ఆయుధ దిగుమతులు తగ్గించుకుని అమెరికా నుంచి దిగుమతులను పెంచాల్సిన పరిస్థితి తలెత్తింది.


చైనాతో రష్యా మైత్రి నేపథ్యంలో భారత్‌ కు ఆయుధ విక్రయాల్లో రష్యా స్థానాన్ని ఆక్రమించాలని అమెరికా యత్నిస్తోంది. పాకిస్థాన్‌ తో దాదాపు 70 ఏళ్లుగా అంటీముట్టనట్టు వ్యవహరించిన రష్యా ఇటీవల ఆ దేశంతో చైనా వలన సన్నిహితంగా మెలగడం, సైనిక సహకారం అందించడం కూడా భారత్‌ కు రుచించడం లేదు. 



మొత్తం మీద చైనా వలన రష్యాతో మన స్నేహం వ్యతిరెఖ ప్రభావానికి గురౌతుండగా అమెరికాతో తీవ్రమైన వత్తిడికి గురౌతుంది. అంతేకాదు పాకిస్తాన్ బలపడే పరిస్థితులు నేలకొంటున్నాయి. ఈ విషయంలో భారత్ భవిష్యత్ లో అనుసరించబోయే ఎత్తుగడలు ఈ "చతుర్ముఖ సంబందాలు" ఏ రూపు తీసుకుంటాయో అనేది ప్రశ్నార్ధకం.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: