చాతగానోడికి మాటలెక్కువ - చెల్లని రూపాయికి గీతలెక్కువ - ఇది ఏపి రాజకీయాల తీరు

దేశ ప్రజల మనోవాంచితం పరిశుభ్రమైన నీతివంతమైన పాలన. నిన్న వారు మీపై ఆరోపణలు చేశారు కాబట్టి నేడు మీరు వారిపై ఆరోపణలు చేస్తున్నట్లుంది కాని నేఱగాళ్ళను శిక్షించేలాగా చేసినట్లు లేదు అంటున్నారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్‌ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు, అటు కేంద్ర ప్రభుత్వంపైనా, ఇటు భాజపా నేతలపైనా సంచలన ఆరోపణలు చేశారు. అలాగే బాజపా నేతలు అటు తెలుగుదేశం నేతలపైనా, ఇటు ముఖ్యమంత్రి పైనా ఆరోపణలు చేస్తూవస్తున్నారు.


కేంద్రంలో ప్రకంపనలు సృష్టించే కుంభకోణం త్వరలో వెలుగులోకి రాబోతోందన్నారు. నెల రోజుల్లోనే అన్ని ఆధారాలతో దాన్ని బయట పెడతామని ఆయన వెల్లడించారు. ప్రధాని నరెంద్ర మోదీకి దగ్గరగా ఉండే వ్యాపారసంస్థకు లబ్ధి చేకూర్చారన్న అంశం ప్రకంపనలు సృష్టించబోతోందన్నారు. గుర్తు పెట్టుకోండి! ఖచ్చితంగా ప్రకంపనలు పుట్టిస్తాం! అని భాజపా నేతలను కుటుంబరావి హెచ్చరించారు.


నేరం బయట పెడితే అది “ఎయిల్ ఏషియా” తరహాలో బయట పెట్టేయాలిగాని ఇలా అది చేస్తాం! ఇది చేస్తాం! అనటం బాగలెదని "చాతగానోడికి మాటలెక్కువ - చెల్లని రూపాయికి గీతలెక్కువ" అన్నట్టు కుటుంబరావు,మాట్లాడుతున్నారని విపక్షనేతలు అంటున్నారు. కేంద్రం చేసిన కుంభకోణంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామన్నారు. మంగళవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, యూసీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో పరిశీలనకు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు సిద్ధమా? అని ప్రశ్నించారు.


జీవీఎల్‌ నరసింహారావు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గోబెల్స్‌ మాదిరిగా ప్రచారం చేయడంలో ఆయనకు నోబెల్‌ బహుమతి ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఇది చూసి గోబెలే ఈ జన్మలో చంద్రబాబై పుట్టారని వైసిపి నేతలు అంటున్నారు.


కేంద్రం విడుదల చేసిన నిధులపై వాస్తవాలు వెల్లడించేందుకు కేంద్రం తరఫున నలుగురిని, రాష్ట్రం తరఫున నలుగురిని పెట్టి చర్చిద్దామని సవాల్‌ విసిరినా జీవీఎల్‌ స్పందించలేదని కుటుంబరావు ఆరోపించారు. పవన్ కళ్యాణ్ జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ పెట్టి చూపారుగదా! ఏం జరిగిందీ - మీరూ అంతే కేంద్రం చేసిన  కుంభ కోణంపై ప్రజాయోజన వ్యాజ్యం వేసేసి బిజెపి వాళ్ళను జనంలో నిలబెట్టండి జనమంతా సంతోషపడతాం.


2016లో డిల్లీ - ముంబయి పారిశ్రామిక కారిడార్‌కు ₹495కోట్లు కేటాయిస్తే, దేశంలో ఉన్న మిగతా వాటికి కేవలం ₹4.5 కోట్లు మాత్రమేఇవ్వడం దారుణమన్నారు.ఎన్ పి వి  పెడితే శ్రీకాళహస్తి, కృష్ణపట్నం అభివృద్ధి చేస్తామంటున్నారని గుర్తు చేశారు. దేశంలో 25 నోడ్స్‌ ఉంటే ఐదు నోడ్స్‌ గుజరాత్‌లోనే ఉన్నాయన్నారు. ఈ ఐదు నోడ్స్‌లో కూడా డొలేరాకు ఎక్కువ నిధులు ఇస్తున్నారని విమర్శించారు.


కృష్ణపట్నం నోడ్ విషయంలో కేంద్రం అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. యూసీలు అడగడానికి జీవీఎల్‌ ఎవరని నిలదీశారు. నిధుల మళ్లింపు, యూసీల విషయంలో సమావేశం ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించారు. తప్పని తేలితే క్షమాపణలు చెప్పడానికి సిద్ధమన్నారు. జీవీఎల్‌ సహా భాజపా నేతలెవ్వరూ వార్డు సభ్యులు కూడా కాలేరని విమర్శించారు. తొమ్మిది నెలల్లో అద్భుతంగా భాజపా జాతీయ కార్యాలయాన్ని నిర్మించారని, ఆ స్థాయిలో ఒక్క సంస్థ అయినా నిర్మాణం అయ్యేలా ఏపీకి సహకరించారా? అని నిలదీశారు. పారిశ్రామిక కారిడార్లు, యూసీలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్‌ విసిరారు. పీఎంవోలో ఫైల్‌ కదలాలంటే ఆరు నెలల సమయం పడుతోందని ఆరోపించారు. ఎయిర్‌ ఏషియా వ్యవహారంలో 85శాతం పని యూపీఏ-2లో పూర్తయిందని, ఎయిర్‌ ఏషియా వ్యవహారానికి ఆమోదం తెలిపింది మోదీ కేబినెటేనన్నారు.


చంద్రబాబు గారి హైదరాబాడ్ నివాస గృహం-అమరావతి నివాస గృహం నిర్మించుకోలేదా! అమరావతి సచివాలయం వానొస్తే కారిపోతోంది అలా చంద్ర బాబు గృహాలు కారి పోతు న్నాయా అని జనం అంటున్నారు. ఇప్పుడు మీరిద్దరూ కలసి జనానికి ద్వని కాలుష్యం తాప్ప ప్రయోజనం కలిగించట్లేదని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా గగ్గోలు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: