ఉప ఎన్నికల సవాల్ విసిరిన జగన్ ??

KSK
అన్యాయంగా విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు అధికారంలోకి వచ్చి మరింత నష్టాలు పలుచేశారు. ఆనాడు పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా హామీ ఇవ్వడం జరిగింది….అయితే ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు అశ్రద్ధగా వ్యవహరించారు. అంతేకాకుండా ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా కేంద్ర పెద్దల కాళ్ల దగ్గర పెట్టేసి ఆంధ్రరాష్ట్ర అభివృద్ధిని సమాధి చేసేసారు.


ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న  రాజకీయపార్టీలు ప్రత్యేకహోదా అంశం గురించి మాట్లాడటమే మానేశాయి ... అయితే ప్రతిపక్షనేత జగన్ మాత్రం ముందునుండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అని నమ్మి ప్రజలకు కూడా నమ్మకం కలిగించి…. ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచారు రాష్ట్రంలో. దీంతో చంద్రబాబు కూడా యూటర్న్ తీసుకున్నారు...ఈ విషయంలో ముందునుండి చిత్తశుద్ధితో జగన్ వ్యవహరిస్తుండడంతో రాష్ట్రంలో ప్రజలకు ప్రత్యేకహోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని నమ్మకం కలిగింది.


ఈ నేపద్యంలో జగన్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్లమెంటు సభ్యులు ప్రత్యేక హోదాకోసం రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అయితే ఈ విషయంలో కేవలం వైసీపీ ఎంపీలు మాత్రమే రాజీనామా చేశారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు మేకపోతు గాంభీర్యం మాటలు చెప్పి రాజీనామాలు చేస్తామని డప్పు కోట్టి చివరికి రాజీనామాలు చేసే సమయానికి వచ్చేసరికి చేతులెత్తేశారు. మొత్తానికి  ప్రత్యేక హోదా విషయంలో వైసిపి ఎంపీలు మాత్రమే రాజీనామాలు చేసరు..తాజాగా ఇటీవల స్పీకర్ కూడా ఈ రాజీనామాలను ఆమోదించడం జరిగింది.


ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయించకపోవడం వల్లే ఇవాళ దేశంలో చర్చ ఐదుగురు ఎంపీల వరకే పరిమితమైందని, అదే 25 మంది ఎంపీలు గనుక రాజీనామా చేసి ఉంటే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యేదని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కచ్చితంగా వచ్చి ఉండేదని చెప్పారు. కానీ, చేతులారా చంద్రబాబు నాయుడు ఈ అవకాశాన్ని నాశనం చేశారని ఆరోపించారు. పైగా చంద్రబాబు తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు తమపై బురదజల్లుతున్నారని పేర్కొన్నారు.


ఉపఎన్నికలు వస్తే చంద్రబాబు పోటీ పెడతామని అంటున్నారని, అసలు టీడీపీ ప్రత్యేక హోదాకు అనుకూలమా, వ్యతిరేకమా అనేది తేలిపోయిందని స్పష్టం చేశారు. ఉపఎన్నికలు వస్తే టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవని ఆయన పేర్కొన్నారు. కేవలం మీడియాను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబుకి ఒకవేళ ఈ ఉప ఎన్నికలు వస్తే తన రాజకీయ జీవితంలో భవిష్యత్తులో మళీ ఇటువంటి చర్యలకు పాల్పడకుండా తగిన విధంగా బుద్ధి చెబుతామని జగన్ హెచ్చరించారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: