జగన్ దెబ్బకి రాజకీయాలనుండి తప్పుకుంటున్న జేసీ దివాకర్ రెడ్డి..!

KSK
అనంతపురం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో తమ కుటుంబానికి ఎదురు లేదు అని అంటుంటారు జేసీ ఫ్యామిలీకి సంబంధించిన వారు. అయితే ఇంతటి ఫాలోయింగ్ ఉన్న వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని అన్నారు జెసి దివాకర్ రెడ్డి. దీంతో జేసి దివాకర్ రెడ్డి చేసిన కామెంట్లపై రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి.

ముఖ్యంగా జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఒక ప్రచారం గట్టిగా సాగుతుంది అదేమిటంటే వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా ఓడిపోతుంది ఇదే క్రమంలో వైసీపీ పార్టీకి తిరుగులేని నేపద్యంలో కచ్చితంగా జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అని తన సన్నిహితుల దగ్గర జెసి వాపోయాడు..అంటున్నారు తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది..

ఇదే విషయాన్ని మీడియా ముందు కూడా చాలాసార్లు అన్నారు జేసి దివాకర్ రెడ్డి. ఇదిలావుండగా గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి లబ్ధిపొందడానికి ప్రతిపక్షనేత వైసీపీ అధినేత జగన్ ని అనరాని మాటలు అంటూ తీవ్రంగా దూషించిన నేపద్యంలో వచ్చే ఎన్నికలలో జగన్ ముఖ్యమంత్రి కచ్చితంగా అవుతాడు.

ఇందుమూలంగా రాజకీయాలలో ఉంటే రాజకీయంగా తనకే నష్టమని జెసి దివాకర్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. తాజాగా జేసీ దివాకర్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో తెలుగుదేశం నాయకులు కంగుతిన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: