పెళ్లిలో డాన్స్ చేసినందుకు దళితుడిని కాల్చి చంపేశారు..!

KSK
దేశంలో రోజురోజుకీ అంటరానితనం పెచ్చుమీరి పోతుంది. సాంకేతికంగా సమాజం ముందుకు వెళ్తున్న అభివృద్ధి జరుగుతున్న కానీ మనిషికి మనిషికి మధ్య చాలా దూరం పెరిగిపోతుంది. ముఖ్యంగా భారతదేశంలో కుల వివక్ష మళ్లీ బలపడే రోజులు వస్తున్నాయి అనడంలో సందేహం లేదు. గతంలో గుజరాత్ రాష్ట్రంలో దళితుడు గుర్రంపై తిరుగుతున్నాడు అన్న నెపంతో అతడిని క్రూరంగా హింసించి దారుణంగా కొట్టి చంపేయడం జరిగింది.

అయితే ఇన్ని దాడులు జరుగుతున్న దళితులపై పటిష్టంగా ఉన్న చట్టాలు గాని పట్టించుకునే ప్రభుత్వాలు గాని చర్యలు తీసుకోకపోవడం దారుణం. తాజాగా ఇటీవల ఇటువంటి ఈ ఘటన పాట్నాలో జరిగింది. ఆహ్వానించకపోయినప్పటికీ...స్థానికంగా జరుగుతున్న వివాహ ఊరేగింపులోకి జొరబడి మరీ ఆనందంగా నృత్యాలు చేసిన ఓ దళితుడిని కాల్చి చంపేశారు.

ఇక్కడికి సమీపంలోని అభిఛప్ర గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇతర వెనుకబడిన కులానికి చెందిన ఓ కుటుంబంలో వివాహం తంతులో భాగంగా ఊరేగింపును నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన నవీన్‌ మాంఝీ (22) నాట్యం చేశాడు.

అదే సమయంలో అక్కడున్న వారిలో ఎవరో ఒక్కసారిగా తుపాకీ తీసి నవీన్‌మాంఝీని కాల్చి చంపేశారు.  పాత కక్షలతో తన కుమారుడిని చంపేశారని నవీన్‌మాంఝీ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ  ఉదంతం ఆ ప్రాంతంలో కలకలం రేపుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: