పవన్ కళ్యాణ్ కి జగన్ సెగ తగిలింది...దీంతో ఆ జిల్లాలో అడుగు పెట్టలేదు..!

KSK
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్ భలే ఝలక్ ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరూ ప్రజాక్షేత్రంలో యాత్రలతో బిజీగా ఉన్నారన్న సంగతి మనకందరికీ తెలిసినదే. ఈ క్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరికంటే ముందుగా ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ఎన్నికలు వస్తున్న నేపధ్యంలో ఎవరెవరు అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలి అని అనుకుంటున్నారో వారందరి గుట్టు రట్టు చేయడానికి ప్రతిపక్షనేత వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర అని ప్రజలను అప్రమత్తం చేయడానికి పూనుకున్న సంగతి మనకందరికీ తెలిసినదే.

ముఖ్యంగా గత ఎన్నికలలో చంద్రబాబు ఎటువంటి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను ఏవిధంగా మోసం చేశారో ఇలా ప్రతి ఒక్క విషయాన్ని సామాన్య ప్రజలకు తెలియజేస్తు ముందుకు సాగుతున్నారు జగన్. ప్రస్తుతం జగన్ చేస్తున్న పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో సాగుతోంది. ఇదిలా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన ప్రజా పోరాట యాత్ర ఇప్పటికే శ్రీకాకుళం , విశాఖపట్నం , విజయనగరం జిల్లాలలో యాత్ర ముగించుకున్న తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చెయ్యాల్సి ఉంది.

ప్రస్తుతం జగన్ తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు . దీనితో భద్రతా కారణాల దృష్యా ఒకేసారి ఇద్దరు నాయకులు పర్యటన సాగిస్తే భద్రతా సమస్యలు ఏర్పడతాయని పోలీసులు భావించారు.
.
దీనితో పవన్ కళ్యాణ్ యాత్ర కు పోలీసులు అనుమతించడం లేదు. తూర్పు గోదావరి జిల్లాలో యాత్రను ప్రారంభించాలని భావించిన పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని పోలీసులకు సమాచారాన్ని అందించారు . కానీ పోలీసులు దానికి నిరాకరించారు. దీంతో పోలీసులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షెడ్యూల్ను మార్చుకోవాలని సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: