రాష్ట్రంలో పుంజుకోవడానికి కొత్త స్కెచ్ వేసిన కాంగ్రెస్..తెలిస్తే షాక్ అవుతారు!

KSK
2014 ఎన్నికల్లో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తన రాజకీయ లబ్ధి కోసం ఉమ్మడిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రెండుగా ఛిల్చేసింది. ఈ పరిణామంతో ఆంధ్రరాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. అయితే తాజాగా ప్రస్తుతం ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అడుగుపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.


గతంలో రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పార్టీ అంటూ చెప్పులు గుర్తుకే ఓటు వేయాలంటూ రాష్ట్ర సమైక్యాన్ని చాటాలంటు గతంలో అనేక ప్రకటనలు చేయడం జరిగింది. ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో  కాంగ్రెస్ పార్టీ జై సమైక్యాంధ్ర పార్టీ అడ్రస్ లేకుండా పోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.ఈ క్రమంలో ఇటీవల కిరణ్ కాంగ్రెస్ లో తిరిగి చేరడంతో...జాతీయస్థాయిలో పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.


ఒకవేళ అది కుదరకపోతే ఏపీ పీసీసీ బాధ్య‌త‌లు కూడా అప్ప‌గించే అవ‌కాశాలున్నాయ‌నీ కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప‌ద‌వుల‌తో సంబంధం లేకుండా ఏపీ కాంగ్రెస్ విష‌యంలో కిర‌ణ్ కు ఫ్రీ హ్యాండ్ ఇస్తార‌నీ అంటున్నారు! కిర‌ణ్ కుమార్ రెడ్డి పాత్ర, పార్టీలో ఆయ‌న ప్రాధాన్య‌త‌, ఆయ‌న‌కు ఇవ్వ‌బోతున్న ప‌ద‌వి… ఇవ‌న్నీ ఓ ప‌దిహేను రోజుల్లో ఏర్పాటు చేయ‌బోతున్న బ‌హిరంగ స‌భ త‌రువాత స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని కాంగ్రెస్ వ‌ర్గాల నుంచి తెలుస్తోంది. త్వ‌ర‌లో ఆంధ్రాలో ఒక భారీ బ‌హిరంగ స‌భ పెట్టాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత కాంగ్రెస్ చేప‌డుతున్న అతిపెద్ద కార్య‌క్ర‌మంగా దీన్ని నిర్వ‌హిస్తార‌ట‌..!


ఇది కిర‌ణ్ కుమార్ నేతృత్వంలోనే జ‌రుగుతుంద‌ని స‌మాచారం! అంతేకాకుండా రాష్ట్ర విభజన హామీలు అమల్లోకి రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని  ఈ సభను రాష్ట్రంలో పెట్టడానికి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో...అన్ని సర్వేలలో కూడా టీడీపీకి భారీ మెజారిటీ ఖాయం అని తేలడంతో కాంగ్రెస్ అధిష్టానం మరోపక్క చంద్రబాబుతో జతకట్టాలని కూడా భావిస్తున్నారట. మరి ఈ విషయంలో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి. దీంతో ఇరు పార్టీల కలయిక పై వస్తున్న వార్తలపై వైసీపీ పార్టీ నాయకులు రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగు కాంగ్రెస్ పార్టీ రాబోతుందని సంచలన కరమైన కామెంట్లు చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో టీడీపీ హవా కొనసాగుతుంది మన వార్తలపై కూడా మండిపడ్డారు వైసిపి నాయకులు...ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత ఉన్నది...అందుమూలంగా నేత మాజీ నాయకుడు జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర లో ఇసకేస్తే రాలనంత ప్రజలు హాజరవుతున్నారని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: