అడక్కముందే రజినీకాంత్ చెప్పేశాడుగా...!

Prathap Kaluva

రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తునట్టు ప్రకటించిన సంగతీ తెలిసిందే. ఇప్పటికే తమిళ్ నాడు రాజకీయాల్లో కమల్ హాసన్ ఎంట్రీ ఇచ్చిన సంగతీ తెలిసిందే. అయితే రజినీకాంత్ కూడా రాజకీయాల్లోకి రావడం తో సీను రసవత్తరంగా మారింది. అయితే ఇప్పడూ రాజకీయాల్లో జమిలీ ఎన్నికల గురించి చర్చ జోరుగా సాగుతుంది. చాలా పార్టీలు ఇప్పటికే ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. అయితే తాజాగా రజనీకాంత్ కూడా తన మనుసులోని మాట వెల్లడించాడు. 


అయితే ఈ విషయంలో జాతీయ న్యాయ కమిషన్.. దేశంలోని వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నది. అయితే పవన్ కల్యాణ్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి వారు స్థాపించిన బొడ్డూడని పార్టీల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం కమిషన్ చేస్తున్నట్టు లేదు. అయినా సరే.. రజనీకాంత్ తనకు తానుగా ముందుకొచ్చి.. జమిలి ఎన్నికల గురించి... తన అభిప్రాయాన్ని వెల్లడించేశారు. ఇది చాలా మంచిదే అని.. దేశంలో ఎన్నికల ఖర్చు తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన అంటున్నారు.


మతలబు ఏంటంటే.. తెరాస మినహా వ్యతిరేకిస్తున్న వాళ్లంతా అంతో ఇంతో ప్రజల్లో ప్రాబల్యం ఉన్న వాళ్లు. తమ ‘లోకల్’ బలానికి ఈ  జమిలి ఎన్నికలు గండి కొడతాయేమో అనేది వారి ప్రధాన భయం. అందుకే వ్యతిరేకిస్తున్నారు. నిన్న గాక మొన్న కొత్తగా పార్టీ పెట్టిన రజనీకాంత్ కు జమిలి ఎన్నికల వలన పోయేదేమీ లేదు. అందుకే ఆయన దానికి జై కొడుతుండవచ్చుననే అభిప్రాయం విశ్లేషకుల్లో వ్యక్తం అవుతోంది. రజనీ బాటలోనే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా.. జమిలి ఎన్నికల విషయం మాట్లాడాల్సి వస్తే.. మోడీకే జై కొడతారని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: