లోక్ సభలో నరేంద్రమోడి ప్రభుత్వంపై జరుగుతున్న అవిశ్వాస తీర్మానం చర్చలో హటాత్తుగా ఒక అరుదైన దృశ్యం కనిపించింది. చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధి దాదాపు గంటసేపు అనర్ఘళంగా ప్రసంగించారు. తన ప్రసంగం యావత్తు చెళుకులతో, చమక్కులతో, ఆరోపణలు, విమర్శలతోనే సాగింది. ఆరోపణలు, విమర్శలు యావత్తు ప్రధానమంత్రి నరేంద్రమోడిని లక్ష్యంగానే చేసుకున్నారని కొత్తగా ఎవరికీ చెప్పక్కర్లేదు.
అదరగొట్టిన రాహూల్
సరే, ఆరోపణలు, విమర్శలు చేస్తున్నపుడు రాహూల్ ప్రసంగానికి బిజెపి సభ్యులు మధ్యలో చాలా సార్లే అడ్డు తగిలారనుకోండి అది వేరే సంగతి. రాహూల్ ప్రసంగం సాతం మోడి కూడా విన్నారు. దాదాపు గంటపాటు రాహూల్ ప్రసంగం సాగిన తర్వాత స్పీకర్ కు ధన్యవాదాలు తెలిపి ప్రసంగాన్ని ముగించారు.
మోడితో రాహూల్ షేక్ హ్యాండ్
అయితే హటాత్తుగా తన స్ధానంలో నుండి బయటకు వచ్చిన రాహూల్ నరేంద్రమోడి స్ధానం వైపు కదిలారు. సభ్యలరందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎందుకంటే, ప్రధానమంత్రి స్ధానం వైపు రాహూల్ ఎందుకు వెళుతున్నారో ఎవరికీ అర్ధ కాలేదు. చివరకు స్పీకర్ సుమిత్రా మహాజన్ సైతం తన స్ధానంలో కూర్చునే రాహూల్ ను చూస్తున్నారు.
సభ్యుల హర్షాతిరేకాలు
ఇంతలో ప్రధాని స్ధానం వద్దకు వెళ్ళిన రాహూల్ హటాత్తుగా క్రిందకు ఒంగి మోడి చెవిలో ఏదో చెప్పారు. దాంతో ప్రధాని రాహూల్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంతలోనే రాహూల్ హటాత్తుగా మోడి పైకి ఒంగి గట్టిగా హత్తుకున్నారు. దాంతో సభ్యుల హర్షధ్వానాలతో ఒక్కసారిగా లోక్ సభ మారుమోగిపోయింది. ఒక నిముషం తర్వాత రాహూల్ వెనక్కుతిరిగారు. అయితే వెళ్ళిపోతున్న రాహూల్ ను మోడి మళ్ళీ వెనక్కు పిలిచారు. బాగా ప్రసంగించినట్లు అభినందించటంతో సభ్యులందరూ బల్లలు చరిచి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. నిజంగానే ఇది అరుదైన సంఘటనగానే చెప్పుకోవాలి.