పొలిటికల్ టచ్ లో బుల్లితెరపై అడుగుపెట్టబోతున్న పవన్ కళ్యాణ్…!

KSK
ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్న క్రమంలో ఆ వ్యతిరేకతను ఓటుగా మలచుకొని రాబోయే ఎన్నికలలో అధికార పీఠం తగ్గించుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకి ఎప్పుడు అండగా ఉండే మీడియా తనకు సరైన కవరేజ్ ఇవ్వకపోవడంతో పవన్ తనకంటూ ఇటీవల కొన్ని చానల్స్ ఉండేటట్టు లీజుకు తీసుకున్న సంగతి మనకందరికీ తెలిసినదే.


ప్రస్తుతం నాటకంలో చంద్రబాబు పరిస్థితి చూస్తే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కని విధంగా ఉన్నాయి. ఇదిలాఉండగా పవన్ కళ్యాణ్ ఓ న్యూస్ ఛానల్ లో బుల్లితెరపై ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ నేషనల్ న్యూస్ ఛానెల్ లో సామజిక సమస్యల పై వచ్చే ప్రోగ్రాం లో అయన పాల్గొననున్నారని సమాచారం. అప్పట్లో అమెరికన్ సత్యమేవజయతే తరహా లో పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అంటూ చాలా మంది కోడై కూసారు.


కానీ ఈ ప్రోగ్రాం ఆగిపోయింది. ఇప్పుడు ఇదే టీం తో స్క్రిప్ట్ కోసం పవన్ కళ్యాణ్ టీం కసరత్తు చేస్తుంది. మరికొద్ది వారాల్లో ఈ ప్రోగ్రాం ప్రసారం కానుంది. విద్య , ఆరోగ్యం పై ఈ ప్రోగ్రాం ఉంటుందని సమాచారం.


ఇక ఈ ప్రోగ్రాం నిడివి అరగంట అయితే పవన్ కళ్యాణ్ సన్నిహితుల సమాచారం ప్రకారం ఈ ప్రోగ్రాం కేవలం ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు తప్ప ప్రచారానికి మాత్రం ఎట్టి పరిస్థితులలో ను కాదని తేల్చి చెప్పారు. ఏది ఏమైనా ప్రజా సమస్యల కోసం పవన్ కళ్యాణ్ మీడియా ను వాడుకుంటున్నారు. మరోపక్క జాతీయ స్థాయిలో కూడా పొలిటికల్ రంగంలో తనకంటూ సొంత ఇమేజ్ ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: