మాజీ ప్రధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి కన్నుమూత!

Edari Rama Krishna

భారతీయులు గర్వించ దగ్గ ప్రధానుల్లో ఒకరైన మాజీ ప్రధాని, బీజేపీ తొలి అధ్యక్షుడు  ‘భారతరత్న’ అటల్ బిహారీ వాజ్‌పేయి ఇకలేరు.   రాజ‌కీయ దృఢ సంక‌ల్పం క‌లిగిన అట‌ల్ బిహారీ వాజ్‌పేయి 1999న అక్టోబ‌ర్ 13న భార‌త ప్ర‌ధానిగా రెండ‌వ ప‌ర్యాయం బాధ్య‌త‌లు చేప‌ట్టి కొత్త సంకీర్ణ ప్ర‌భుత్వం నేష‌న‌ల్ డెమోక్ర‌టిక్ అల‌య‌న్స్‌ కు నాయ‌క‌త్వం వ‌హించారు. అంత‌కుముందు 1966లో స్వ‌ల్ప‌కాలంపాటు ఆయ‌న దేశ ప్ర‌ధానిగా ఉన్నారు.భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి(93) ఆరోగ్యం విషమించింది. కిడ్నీ సమస్య, వృద్ధాప్య సమస్యలతో కొద్దికాలంగా బాధపడుతున్న వాజ్‌పేయి ఇటీవల ఎయిమ్స్‌లో చేరారు. 


ఆయన ఆరోగ్య పరిస్థితి బుధవారంనాడు క్షీణించడంతో పార్టీ అగ్రనేతలు అధికారిక కార్యక్రమాలను వాయిదా వేసుకుని ఎయిమ్స్ చేరుకున్నారు. వాజపేయి ఆరోగ్య పరిస్థితిని, ఆయనకు అందిస్తున్న వైద్యం గురించి ప్రధాని మోదీ వైద్యులను వాకబు చేస్తున్నట్టు తెలుస్తోంది.  తాజాగా  వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్‌ బులెటిన్‌ను ఎయిమ్స్‌ వైద్యులు ఆయన మరణించినట్లు న్యూస్ విడుదల చేశారు.  


యావత్ భారతదేశాన్ని దు:ఖసాగరంలో ముంచేస్తూ గురువారం (ఆగస్టు 16) సాయంత్రం 5.05 గంటలకు ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మృతితో బీజేపీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. బుధవారం రాత్రి వాజ్‌పేయి ఆరోగ్యం విషమించడంతో ఆయణ్ని వెంటిలేటర్‌పై ఉంచారు. గురువారం ఆరోగ్యం మరింతగా విషమించడంతో ఆయన అనంత లోకాలకు వెళ్లిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: