కేరళా బాధితులకు గూగుల్ భారీ విరాళం!

Edari Rama Krishna
కేరళ వరద భాధితులకు తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది గూగుల్ కంపెనీ.  గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా కేరళను వరదలు ముంచెత్తడంతో 400 మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 10 లక్షల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. అంతే కాదు పర్యటానికి నెలవైన దేవభూమి వరదలకు కకావికలం కావడం అందర్నీ కదిలించింది. తాజాగా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు గూగుల్‌ భారీ సాయం ప్రకటించింది.రూ. 7 కోట్లు విరాళమిస్తున్నట్టు గూగుల్‌ ఇండియా ట్విటర్‌లో వెల్లడించింది. 

 ఈ వితరణలో ఉద్యోగులు కూడా పాలుపంచుకున్నారని తెలిపింది. 1924లో ముంచుకొచ్చిన వరద ముప్పు నుంచి తేరుకున్న  ఎంతో అభివృద్ది సాధించి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.   అయితే ఈ నెల మొదటి వారం నుంచి కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లాయి. తో జలాశయాలన్నీ నిండిపోవడంతో ఒకేసారి 34 ప్రాజెక్టుల గేట్లు ఎత్తేశారు. దీంతో రాష్ట్రం వరద ముంపునకు గురైంది.  ఇదిలా ఉంటే ఆ మద్య కేరళా బాధితులను ఆదుకునేందుకు ఇంటర్నెట్ లేకున్నా మొబైల్ ఫోన్ల ద్వారా ఆఫ్ లైన్ లో లొకేషన్ షేర్ చేసుకొనే ఫెసిలిటీని కేరళ ప్రజలకు కల్పించింది.

వరద భాధితులు…..తమ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ల ద్వారా ఉన్న లొకేషన్ పై ప్లస్ కోడ్ ను జనరేట్ చేసి షేర్ చేసుకోవచ్చని, వాయిస్ కాల్ లేదా SMS ల ద్వారా కూడా ప్లస్ కోడ్‌ లను షేర్ చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది.

తాజాగా ఇప్పుడు ఏడు కోట్ల విరాళం ఇచ్చి సంస్థ మంచి తనాన్ని చాటుకుంది. ఇదిలా ఉంటే..కేరళా వరదల బాధ మరిచిపోకముందే..ఈ విపత్తు పక్కకున్న కర్ణాటకను కూడా తాకింది. వరదల కారణంగా కొడగు జిల్లా నీట మునిగి 17 మంది చనిపోయారు.  తాజాగా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రపంచంలోని కేరళీయులు ఒక నెల జీతం విరాళంగా ఇచ్చి కేరళను ఆదుకోవాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
 .@Googleorg and Google employees are contributing $1M, to support flood relief efforts in Kerala and Karnataka. #GoogleForIndia@RajanAnandan
— Google India (@GoogleIndia) August 28, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: