జనసేన లోకి “కృష్ణంరాజు”... “ఎంపీ” గా “ఆ స్థానం” ఫిక్స్

Bhavannarayana Nch

ఏపీలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకి కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి..వచ్చే ఎన్నికల్లో త్రికోణ పోరు ఉన్న నేపధ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది..పక్క తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణలో ఇప్పటికే పొత్తుల విషయంలో ఒక క్లారిటీతో ఉన్న ప్రతిపక్ష ,అధికార పార్టీలు ఎవరి వ్యూహారచనల్లో వారు బిజీ బిజీగా ఉన్నారు అయితే ఏపీలో ఇప్పటికీ  పొత్తుల విషయంలో క్లారిటీ లేకపోయినా అభ్యర్ధుల విషయంలో మాత్రం ఒక క్లారిటీకి వచ్చేశారట అయితే ముందుగా ఏ పార్టీ  అభ్యర్ధులను ప్రకటిస్తుందో అంటూ ఎవరికీ వారు సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటున్నారు..

 

ఏపీలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొదటి సారిగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎంతో కీలకం కానున్న నేపధ్యంలో ఈ ఎన్నికల్లోనే తన సత్తా చాటాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎక్కువగా దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితమే అత్యంత కీలకమైన జిల్లా అయిన తూగో నుంచీ ఆ పార్టీ మొదటి అభ్యర్ధిగా బీసీ శెట్టి బలిజ వర్గానికి చెందిన పితాని బాలకృష్ణ ని ప్రకటించారు.. అయితే ఇప్పుడు పవన్ పశ్చిమ గోదావరి జిల్లాపై దృష్టి పెట్టారట ఇక్కడి డెల్టా ప్రాంతం నుంచీ ఎంపీ అభ్యర్ధిగా...

 

ఎవరిని ప్రతిపాదిస్తే బాగుంటుందనే నేపధ్యంలో తనకి అత్యంత కీలకమైన కోటరీ తో చర్చలు జరిపారట  అయితే సామాజిక వర్గాల పరంగా ఆలోచిస్తే తెలుగుదేశం ,వైసీపీ లు ఇరువురూ కూడా ఎంపీ అభ్యర్ధులుగా క్షత్రియ  సామజిక వర్గానికి చెందినా వారినే అభ్యర్ధులుగా నిలబెడుతూ వస్తున్నారు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు కూడా అయితే పవన్ కూడ ఇదే సామాజిక వర్గంలోకి ఓ కీలక వ్యక్తిని తన పార్టీ ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించనున్నారని తెలుస్తోంది అయితే ఆ నేతతో ఇప్పటికే పవన్ చర్చలు జరిపినట్టుగా కూడా తెలుస్తోంది..ఆయన ఒకే చెప్తే నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా ఆయన్ని ఖరారు చేయనున్నారాట..ఇంతకీ ఎవరా కీలక నేత అనే వివరాలలోకి వెళ్తే.

 

ఆయన ఎవరో కాదు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు..అలియాస్ రెబల్ స్టార్ కృష్ణంరాజు...టాలీవుడ్ లో పాత తరం హీరోలలో ఒక ఊపు ఊపేసిన గొప్ప నటుడు..కృష్ణం రాజు గతంలోనే అంటే   1991 లోనే కాంగ్రెస్ తరువునుంచీ లోక్ సభకి పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్ధిపై ఓడిపోయారు..అయితే 1998 లో బీజేపీలో చేరిన ఆయన   కాకినాడ లోక్ సభ నుంచీ పోటీ చేసి విజయం సాధించి పార్లమెంట్ లో అడుగుపెట్టారు..తరువాత మధ్యంతరం నేపధ్యంలో 1999లో కనుమూరి బాపిరాజుపై నరసాపురం నుంచీ పోటీ చేసి గెలిచి వాజ్పేయ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు..2009 లో ప్రజారాజ్యం లో చేరి ఓడిపోయిన కృష్ణంరాజుకి నరసాపురం లో అత్యంత బలమైన కేడర్ ఉంది అంతేకాదు.

 

క్షత్రియ సామాజిక వర్గం అండదండలు కూడా ఎక్కువగానే ఉన్నాయి వీటితో పాటుగా సినిమా గ్లామర్ ప్రభాస్ ఫ్యాన్స్ సప్పోర్ట్ అదేసమయంలో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ సప్పోర్ట్ కూడా ఉంటుందనేది జనసేన నాయకుల అభిప్రాయం...అయితే గత కొంత కాలంగా బీజేపీ తీరుపై విసుగు చెందిన ఆయన ఉభయగోదావరి జిల్లాలలో అనతి కలంలోనే సీనియర్ పార్టీలకే హడలు పుట్టిస్తున్న జనసేన వైపు చూస్తున్నారని తెలుస్తోంది..ఈ క్రమంలోనే పవన్ కృష్ణంరాజు ని జనసేన తరుపునుంచీ నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయాలని కోరనున్నట్టుగా తెలుస్తోంది..అయితే ఇదే జరిగితే జనసేన ఖాతాలో ఒక ఎంపీ టిక్కెట్టు ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: