లోకేష్ నోరు తెరవకపోవడమే టీడీపీ కీ పెద్ద మేలు...!

Prathap Kaluva

లోకేష్ మాట తీరు గురించి అందరికీ తెలిసిందే. ఒకటి మాట్లాడ బోయి మరొకటి మాట్లాడతాడు. ప్రతి పక్ష పార్టీని తిట్ట బోయి తమ పార్టీనే తిడుతాడు. ఇంకా చెప్పాలంటే లోకేష్ గారి రికార్డు లు చాలా ఉన్నాయి. అయితే తాజాగా చినబాబు తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై స్పందించాడు. ఒక లెవల్లో లెక్చరిచ్చాడు. అందులో చెప్పుకొచ్చింది ఏమిటంటే.. తెలంగాణకు ముందస్తు ఎన్నికలు సరికాదు అని. ప్రజలు ఐదేళ్లపాటు పాలించడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి.. కేసీఆర్ ఐదేళ్ల పాటు పాలించాల్సిందని, శాసనసభను రద్దు చేయడం సబబు కాదని లోకేష్ చెప్పుకొచ్చాడు.


ముందస్తు ఎన్నికలకు వెళ్లడం కేసీఆర్ బాధ్యతా రాహిత్యమే అని, రాజ్యాంగాన్ని అవమానించడమే అని.. లోకేష్ తనకు తెలిసిన పదాలన్నీ ఉపయోగించి విరుచుకుపడ్డాడు. సరే.. అలాగే అనుకుందాం. ముందస్తు ఎన్నికలు తప్పే, శాసనసభను రద్దు చేసుకుని ముందస్తుగా ఎన్నికలు తీసుకురావడానికి ముఖ్యమంత్రికి రాజ్యాంగం ఇచ్చిన విశేష అధికారాన్ని లోకేష్ తప్పు పడుతున్నాడు.


మరి అలాగైతే.. గతంలో లోకేష్ తండ్రివర్యులు చంద్రబాబు నాయుడు గతంలో చేసిన దాన్ని ఏమనాలి? 2004లో చంద్రబాబు నాయుడు వెళ్లింది ముందస్తు ఎన్నికలకు కాదా? తనపై అలిపిరిలో అటాక్ జరగగానే.. సానుభూతి వర్షిస్తుంది, ఓట్ల వాన వస్తుంది.. అని చంద్రబాబు నాయుడు శాసనసభను రద్దు చేసుకోలేదా? తను ముందస్తుకు వెళ్లడమే గాక.. బీజేపీని తీసుకెళ్లలేదా? అందుకే లోకేష్ బాబు నోరు తెరవకుండా ఉంటే.. తెలుగుదేశం పార్టీకి పెద్ద మేలు చేసిన వాడవుతాడేమో!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: