స్పెషల్: ఎవరి కోసం అమరావతి? కులవాదంతో తరిస్తే అది భ్రమరావతే?

ఆంధ్ర ప్రదేశ్ లో సినీ నటుడు శోంటినేని శివాజీకి ఇంత ప్రాచారం జరగటానికి కారణం రాజకీయాధికారం, పాలనా ధికారం, న్యాయాధికారం చివరకు సమాచార ప్రసార వ్యవస్థపై ఆధిపత్యం ఒకే కులం (అదే బాబు గారి స్వంత కులం) చేతిలో బందీ కావటమే.


వేరెవరైనా అయితే ఇంత సంచలనం, కలకలం, హడావిడి, హల్-చల్ చేస్తే ఇంత ప్రచారం ఇచ్చిన సందర్భం ఉందా? అందుకే  ఈ వ్యాసం "అ ఆ - లో ప్రజాస్వామ్యం అంతరించి కులస్వామ్యం" అవతరించిందని చెప్ప వచ్చు. ప్రజలకూ అనుమానాల్లేవు ఈ విషయంలో. 


చెవిలో ఇయర్ ఫోన్స్‌తో సీరియస్‌గా పాటలు వింటున్న ఒకs విద్యార్థివద్దకు వెళ్లి, ‘చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించు కోవా?’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక ఇయర్ ఫోన్‌ను తన చెవిలో పెట్టుకుని విన్నారు. అనంతరం ఆవిద్యార్థిని ప్రశ్నిస్తూ ‘ఏ కులం మీది?’ అని అడిగారు. విద్యార్థి ఎస్సీ అని బదులివ్వగా ‘ఎస్సీ అంటే మాల లేదా మాదిగా?’ అని అడిగారు. ఆ విద్యార్థి మాదిగ అని చెప్పడంతో, ‘ఇక నువ్వేం చదువుతావులే. ఈ వెధవ పరీక్ష కూడా రాసి ఉండడు. మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? పొలం ఉందా? బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంది? డబ్బుల్లేకపోతే ఎలా చదువు కుంటావ్ ఫోన్లవి పక్కనపెట్టి చదువుకో’ అంటూ ఆ విద్యార్థిని గద్దించారు తెలుగుదేశం పార్టీ నేత, ఏపీ ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య వార్తల్లో నిలిచారు. 


"యథారాజా తథా ప్రజా" అనే సామెతకు పేరడీ రాసుకోవాలసిన రోజులొచ్చాయి ఆంధ్రప్రదేశ్ కు. "యథా అధినేత తదా ప్రతి నిధి" ఎందుకంటే ఒకానొక సభలోనే ఆ పార్టీ అధినేత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా "ఎవరైనా ఎస్సి ఎస్టి గా పుట్టాలని కోరుకుంటారా?" అన్నరోజే రాష్ట్రం ఈ ఐదేళ్ళు కులపాలితం అని అనుకోవాలసి వస్తుంది. 


అసలు ఇంత విద్యావంతుడు, నలభైయెళ్ల రాజకీయ అనుభవమున్న భారతీయ సీనియర్ రాజకీయవేత్తైన చంద్రబాబు ఒక విషయం మర్చిపోయారు.


కులం అనేది ఒకరు ఎన్నుకునేది కాదు జన్మతః వచ్చేది. చంద్రబాబు తనను బ్రహ్మదేవుడు సృష్టించటానికి ముందు తనను:

కమ్మ కులజుడుగా పుట్టించమని అర్ధించి ఆ కులంలో పుట్టారా?

ఆ తల్లితండ్రులకే ఆ యింట్లోనే పుట్టాలని కోరుకుని పుట్టారా?


ఎవరికీ ఆ అవకాశం ఉండదుకదా! మరెందుకీ కుటిల రాజకీయం? ఆయనే ఒక విధంగా రాష్ట్రానికి పట్టిన దురదృష్టం అని చెప్పొచ్చు అంటారు ప్రజలు.


పోనీ ఆ కుల మతాలను కాసేపు అంగీకరిస్తే – వాటి విషయంలో కూడా -  ఆయన నిర్ణయాలు కూడా పూర్తి అసమంజసంగా ఉంటున్నాయి.


జన్మతః క్రిష్టియన్ అయిన పాయకరావు పేట శాసన సభ్యురాలు వంగలపూడి అనితను పూర్తి హిందూ సాంప్రదాయానికి పుట్టిల్లైన తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యురాలుగా నియమించటం ఎంత ద్రోహం!


అలాగే క్రిష్టియన్ వ్యవస్థలతో దగ్గరి సంభంధము ఉండి సువార్త సభలకు స్పాన్సరర్ గా వ్యవహరించిన వ్యక్తి, క్రైస్తవ మత సానుభూతి పరుడు టీటీడీ చైర్మన్ గా ఉండటమా?  అని కొంతమంది కాషాయ ధారులు బుగ్గలు నొక్కుకున్నారు.


ఆయన టీటీడీ చైర్మన్ అవుతాడనే ఊహాగానాలు వచ్చినప్పటి నుంచి వాళ్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ వచ్చారు. అయితే చంద్రబాబు వారి అభ్యంతరా లను లెక్క చేయలేదు, తను అనుకున్నదే చేశాడు. పుట్ట సుధాకర యాదవ్ ను అదే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షునిగా నియమించటం ఎంత ద్రోహం!


ఆపై హిందూ వర్గాల నుండి తీవ్ర వ్యతిరేఖత రావటంతో యాదవులపై కులం కార్డ్ వాడి తన దౌర్భాగ్యపు రాజకీయాలతో హిందూ సమాజంపై దాడి చేయటం మరోసారి ఈ దేశంలో ఔరంగజేబును గుర్తుచేశారు. ఇలా తన పదవీ అధికారాలను నిలుపుకోవటాని కి తను జన్మించిన హిందు సమాజంపైనే రాజకీయాలు చేయటం నేఱం కాదా?


ఇలా కులాలతో ఇంత బరితెగించి రాజకీయాలు చేసే ముఖ్యమంత్రి ఈ దేశంలో మరొకరు ఉన్నారా? ఇలాంటి వాళ్ళు ఈ దేశానికి కనీసం తన స్వంత రాష్ట్రానికి మేలు చేస్తారని నమ్మొచ్చా?  రాజకీయాల్లో బహిరంగ కుల సమీకరణాలకు దోహదం చేసి, వాటికి అత్యంత ప్రాధాన్యం తెచ్చిపెట్టిన అపర (కుటిల) రాజనీతిఙ్జుడు నారా చంద్ర బాబు నాయుడు అనటానికి పెద్దగా సంశయించాల్సిన అవసరం లేదు అంటున్నారు విశ్లేషకులు.


అంతకు ముందు కుల ప్రాధాన్యత ఇప్పుడున్నంత విచ్చలవిడిగా ఉండేది గాదు. అందుకే కుల సమీకరణాలతో రాజకీయాలు చేస్తాడు చంద్రబాబు అనే పేరుంది.ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కులాలవారీ విభజన చేసి పంపకాలు బహిరంగంగా మొదలెట్టి కు(ల)సాంప్రదాయానికి పెద్ద పీఠ వేసి అదీ కూడా కుల విభజన ఫలాలు తన వారికే అంటే తన పార్టీవారికి, తన కుల బందు స్నేహ పరివారా నికి తనిష్టం వచ్చినట్లు పంచి పెట్టటంలో కూడా ఆయనది అందెవేసిన చెయ్యి అంటున్నారు.


ఈ పాపకార్యంలో కూడా న్యాయముండని విధానం అవలంభించి “అమరావతి అన్నా ఆంధ్రప్రదేశ్ అన్నా(అ,ఆ)” కులాల కురుక్షెత్రంగా మార్చిన రాజనీతిఙ్జుడు.


‘ఏ కులం వారిని ఆ కులం వారి చేతే విమర్శింపజేయటం, తిట్టించడం అనే సూత్రం కనిపెట్టిందే చంద్రబాబు’ అని విశ్లేషకులు అంటారు. తెలుగుదేశం పార్టీని తన చెప్పు చేతుల్లోకి తీసుకున్నాక చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నేతల్లో ఎవరి మీద విమర్శలు చేయాలన్నా, వాళ్ల కులం వారిచేత దుమ్మెత్తి పోయించే విధానాన్ని అమల్లోకి తెచ్చాడని గమనించే వాళ్లంతా చెబుతూ ఉంటారు. తిట్ల దండకం అసాధారణంగా ఉంటుంది.

పుట్టా సుధాకర్ యాదవ్ వ్యాఖ్యలు చంద్రబాబు గురించి ఈ మర్ధన ఎంతసమ్మగా ఉందో కదా! దీనికే టిటిడి చైర్మాన్ పదవి ఇచ్చారా!


ఇది తెలుగుదేశం పార్టీ సాంప్రదాయానికి “లోగో” గా చెప్పవచ్చు. ఆంతేకాదు నందమూరి తారక రామారావును వెన్నుపోటు ద్వారా పార్టీ నుండి నిర్దాక్షిణ్యం గా వెలివేసిన నాటి నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తుందని అంటున్నారు. ఏన్ టి ఆర్ యువతలో ఐఖ్యత తెచ్చి హిమలయ పర్వతం లాంటి బలమైన ఇందిరా కాంగ్రేస్ కు ‘చెక్’ చెప్పి - వెనుకబడిన వర్గాలకు పాలనలో చోటు కలిపిస్తే, ఇప్పుడు ఆ కులాలను విడగొట్టి  “విభజించి పాలించు” అనే బ్రిటీష్ సాంప్రదాయాన్ని బహుముఖం గా విని యోగించుకోవటంలో చంద్రబాబు విజయం సాధించారు.



వైఎస్ జగన్మోహనరెడ్డి మీద విరుచుకుపడే రెడ్డి కులవర్గానికి, టీడీపీ తరఫున ఎన్నికల్లో ఓడిపోయిన వారికి, ఎమ్మెల్సీ పదవులు మంత్రి పదవులు, నామినేటెడ్ పొస్టులు కూడా దక్కిస్తూ, వారిమద్య వారికి తంపులు పెట్టి, అధికారంలో కొనసాగు తుండటం టిడిపి ఆచారం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బొజ్జల గోపాల కృష్ణ రెడ్డి, సతీష్ రెడ్డి వంటి వాళ్లు ఇందుకు ఉదాహరణ. బొజ్జల ను నెమ్మదిగా వట్టిపోయిన గొడ్దును చేసేసి వదిలించు కున్నారని అంటున్నారు.


గతంలో తెలంగణాలో రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి కిరీటమే పెట్టి ‘ఓటుకు నోటు కేసుకు బలిశువుగా సమర్పించేసి, ఆ పాపం లో రెవంత్ ఇరుక్కోవటంతో తాను ఆ పాప కూపం నుండి తప్పించుకోవటానికి కృషి చేస్తున్నారు చంద్ర బాబు. ప్రత్యేకించి ఫిరాయింపు రెడ్లను చంద్రబాబునాయుడు ఇలా వాడేస్తూ ఉన్నాడు. వీరు మాత్రమే కాదు. ముద్రగడ పద్మనాభంపై విమర్శల కు కొంతమంది కాపు నేతలు, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ లాంటి వాళ్లకు పదవులిచ్చి ప్రాపకం చేసేది ఇందు కే ఉంటారు. ఇది ఒక కులాన్ని ఆ కులం సభ్యుల నే  ‘అస్త్రం-శస్త్రం’ గా వాడేసే కుటిల వ్యూహం చంద్రబాబు రచిస్తూ ఉంటారనేది ప్రతీతి. 



రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజేయ కల్లం కూడా తన 'మేలు కొలుపు’ అనే పుస్తకం ద్వారా ప్రజా స్వామ్యాన్ని చంద్రబాబు ఎలా ఖూనీ చేస్తున్నారో వివరించారు. ఇలా సామాజిక న్యాయం చేస్తూ నిరవధికంగా ముందుకు సాగుతున్న చంద్ర బాబుపై ఇప్పుడు కుల పిచ్చి ఆరోపణలు పతాక స్థాయికి చేరుతున్నాయి. అమరావతి నిర్మాణం విషయం దగ్గర్నుంచీ విమర్శలు తీవ్రం అయ్యాయి.


తమ కులంవారు గట్టిగా ఉన్న ప్రాంతంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశాడు అనే ఆరోపణను అనేకమంది చేశారు. ఆఖరికి చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలిచిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఇదే మాటే అన్నాడు.  ఇటీవలే మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్, ‘ఎవరి రాజధాని అమరావతి?’ అంటూ ప్రశ్నించాడు.


ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు కులపిచ్చిఅని, ప్రత్యేకించి న్యాయమూర్తుల ఎంపికలో తమ కులం వారికి ప్రాధాన్యతను ఇస్తూ, ఇతరుల అవకాశాలను దెబ్బతీసేలా  వ్యవహరిస్తున్నాడని, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  హోదా లో ఆయన ఈ అధి కార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని రిటైర్డ్ జడ్జి ఈశ్వర్యయ్య ఆరోపించడం సంచలనాత్మకం.


హైకోర్టు జడ్జిల ఎంపికలో చంద్రబాబు నాయుడు పక్షపాత వైఖరి బయట పడిందని, హైకోర్టు జడ్జిల రేసులో నిలిచిన ఇతర కులస్తులైన న్యాయమూర్తు లపై అకారణమైన ఆరోపణలు చేస్తూ, వారు ఆపదవులకు తగినవారు కాదని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి రాసిన రహస్యలేఖ, కాన్-ఫిడెన్షియల్ లేఖలను కూడా ఈ న్యాయమూర్తి బయట పెట్టారు.


కేవలం తన కులస్తులు మాత్రమే హైకోర్టు జడ్జిలుగా ఉండాలనేది బాబు కోరిక అని ఈ మాజీ న్యాయమూర్తి ఆరోపించాడు. దీన్నిబట్టే చంద్రబాబు న్యాయవ్యవస్థను మానేజ్ లేదా నియంత్రించ గలుగుతున్నాడని తలంపు ప్రజల్లో, విశ్లేషకుల్లో, రాజకీయ నాయకుల్లో విపరీత ప్రచారంలో ఉంది.


ఋజువు కావాలంటే ఆయన పదుల సంఖ్యలో “కేసులపై విచారణ నిలుపుదల” సాధించటం చూపిస్తున్నారు. ఇదే ప్రజల్లో న్యాయవ్యవస్థను చంద్రబాబు పరోక్షంగా నియంత్రిస్తున్నాడన్న ఆలోచనకు బలం చేకూరుస్తుంది.


చంద్రబాబు నాయుడు తప్పుడు లేఖలు రాశాడని కూడా నిఘాసంస్థ, ఐబీ ఆ తర్వాత ధ్రువీకరించిందని రిటైర్డ్ జడ్జి ఈశ్వర్యయ్య పేర్కొన్నారు. ఇప్పటికే న్యాయవ్యవస్థ ను నియంత్రించగలడు అని చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్ష పార్టీలు తరచూ ఆరోపణలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ రిటైర్డ్ జడ్జి ఈశ్వర్యయ్య ఆరోపణలు మరింత తీవ్రమైనదిగా, నారా చంద్రబాబు బాబుపై ఉన్న ఆరోపణల వాడి పెంచేవిలా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.


అంతే కాదు భారత్ సర్వసత్తాక లౌకిక ప్రజాస్వామ్య దేశం. ఇలాంటి వ్యవస్థలో శాసన నిర్మాణ విభాగం, పాలనా నిర్వాహణ విభాగం, న్యాయ విభాగం అనే ఉపాంగాలతో మన రాజ్యాంగం నిర్మితమై ఉంది. కాలక్రమంలో సమాచార విభాగం (మీడియా) నాలుగవ విభాగంగా ప్రజలు గుర్తించి గౌరవిస్తున్నారు.


చంద్రబాబు తన కుల వ్యూహం ద్వారా ధనబలం, అధికారబలం, మీడియా తదితర బలాలను సమీకరించుకొని రాజ్యాంగాన్ని చట్తాన్ని ప్రక్కనబెట్తి తన వ్యూహలతో సింక్రనైజ్ చేసి ఈ నాలుగింటిని తనపాలనా ప్రాంత పరిమితులను లేదా సరిహద్దులను దాటి దేశ సర్వోన్నత న్యాయ స్థానంపై తన కులాధిపత్య, ప్రాంతాధిపత్య వ్యక్తు లతో పట్టు సాధించారని అంటారు. బహుశ ఉభయ తెలుగు రాష్ట్రల్లో ఇంత పాపానికి ఒడిగట్టిన మరో రాజకీయ నేత లేడనటం అతిశయోక్తి కాదు.


సుప్రీం కోర్ట్ న్యాయమూర్తుల్లో తెలుగు వారు ముగ్గురే. వారిలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ (ఈ మద్యే రిటైరయ్యారు), జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు వీరు ముగ్గురు చంద్రబాబు కులానికి చెందిన వారే, అంతే కాదు అమరావతికి ఇరుగుపొరుగు ప్రాంతాలకు చెందినవారు, కావటం యాదృచ్చికం అనవచ్చా? లేక వ్యూహం అనవచ్చా?


అంతే కాదు ఇటీవల న్యాయవ్యవస్థలోని ప్రముఖులకు అమరావతిలో చంద్రబాబు నాయుడు విందు రాజకీయాలు నడిపి వారిని కూడా అపప్రదల రొంపి లోకి దింపాడని ప్రచారమైంది. ఈ న్యాయ వ్యవస్థలోని ప్రముఖులకు విందు రాజకీయాలు సర్వ సాధారణమని కూడా ప్రతిపక్షం వారు విస్త్రుతంగా చెప్పుకుంటూ ఉంటారు.


అన్నింటిని మించి గత కొన్నేళ్ళుగా ప్రధాన తీర్పులన్నీ చంద్రబాబు నాయుడు కు అనుకూలంగా వస్తున్నాయని, “పెద్దపెద్ద కేసులు దేశప్రజలందరూ టెలివిజన్ లో కనులారా వీక్షించిన ‘ఓటుకు నోటు కేసు’ పై విచారణలను బలహీనం గా మార్చివేటమే కాకుండా అలాంటి కేసులు పదుల సంఖ్యలో ఉండటం న్యాయవ్యవస్థ ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా పని చేస్తుందనేది ప్రజలకు అనుమానాస్పధంగా తయారైంది. ఇప్పుడు చంద్రబాబునాయుణ్ణి అపర చాణుక్యుడు అనగలమా?


2500 యేళ్ళ నాడు తక్షశిల ఆర్ధిక శాస్త్ర విభాగాధిపతి ఆర్య చాణక్యుడు 6000 పైగా ఉన్న చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలను ఏకం చేయటానికి కృషి చేయటంలో అద్భుత వ్యూహాలు పన్ని దేశాన్ని ఏకం చేసి జగజ్జేత అలగ్జాండరుకు ముచ్చెమటలు పట్టించారు.


అలాంటి చాణక్యునితో - ఐఖ్యతతో మెలిగే తెలుగు రాష్ట్రాలవారిని కులాలుమతాలుగా విభజించి “విభజించి పాలించే” అలగ్జాండరు రీతి పాలన తెచ్చిన నారా చంద్ర బాబు నాయుడు గారిని అపర చాణక్యుడు అని అనకూడదని మనవి. కావాలంటే నంద సామ్రాజ్యం కోసం ప్రజలను, తన జీవితాన్ని ఫణంగా పెట్టిన “అమాత్య రాక్షసుడు” తో, తన కుటుంబం ఆపై కులం కోసం సమస్తం అర్పించే చంద్ర బాబును పోల్చటం ఏవిధంగా న్యాయమనిపిస్తుందని సామాజిక విశ్లేషకులు అంటున్నారు. 

హిందూ సంస్థ తిరుమల తిరుపతి దెవస్థానంలో మతరచ్చ రేపిన టిడిపి నాయకత్వం


గతంలో కాంగ్రెస్ అధికారంలో ఇలాంటిది ఏదైనా జరిగి ఉంటే, చాలామంది చంద్రబాబు సామాజిక వర్గం వాళ్ళు రోడ్లు ఎక్కేవాళ్లు. తిరుమలను క్రిస్టియన్ల పరం చేస్తున్నా రని అనేక మంది విరుచుకుపడే వాళ్లు. ఒక కులపోళ్లు అయితే వీర హిందుత్వవాదులు అయ్యేవాళ్లు. తెలుగుదేశంపార్టీ కోసం అలా మత రాజకీయం చేసి తలా ఒక చెయ్యేసి ఆదుకునేవాళ్ళు.


అయితే ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తోంది, తాజాగా కాంగ్రెస్ సంస్కృతి జన్మతః వంట బట్టించుకున్న, మేకవన్నెపులి అంటే లోపల కాంగ్రెస్ పులి బయటకు మేక లక్షణాలను వెలువరించే టిడిపి అధినేత చంద్రబాబు కదా! అందుకే ఆ సామాజిక వర్గం అంతా గప్-చుప్, అంతా నిశ్శబ్ధం. ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్! ఆదీ బాబు గారి కులవర్గ సిద్ధాంతం.


అయితే ఆ తర్వాత సదరు టీటీడీ చైర్మన్ కొత్త వాదన అందుకున్నాడు. తన పై మత పరమైన ఆరోపణలు వస్తే ఆయన కులం అస్త్రాన్ని తీశాడు. ఒక బీసీ నాయకుడు టీటీడీ చైర్మన్ అయితే కొంతమంది సహించలేకపోతున్నారని ఆయన ధ్వజమెత్తాడు. ఆయన క్రైస్తవ సానుభూతి పరుడు అని టీటీడీ చైర్మన్ ఎలా అవుతాడు అని ప్రశ్నించిన జనాలకు కులంతో సమాధానం ఇచ్చాడు.  భలే ఐడియా! ఇది చంద్రబాబు బ్రాండ్ రాజకీయమని అందరూ గుర్తించారు. జనం ఎవరూ కూడా దీని వెనుక బాబు హస్తం లేదని చెప్పలేకపోతున్నారు.


ఇక టీటీడీ బోర్డులో సభ్యురాలు గా నియమితులైన మరో టీడీపీ నేత కూడా ఇదే లెక్క వేసుకున్నట్టుగా ఉన్నారు. తన కారులో బైబిల్ ఉంటుంది, తన హ్యాండ్ బ్యాగ్ లో బైబిల్ ఉంటుంది తన బెడ్ రూం లో బైబిల్ ఉంటుంది అని ఆమె గతంలో వనిత టివి లో సగర్వంగా చెప్పారు. అందులో తప్పేం లేదు కూడా. అయితే ఆమె టీటీడీ బోర్డులో సభ్యురాలిగా నియమితం కావడంతోనే విమర్శలు మొదలయ్యాయి.


క్రైస్తవాన్ని ఆమె అంతగా అనుసరిస్తున్నప్పుడు, బైబిల్ పక్కన లేందే రోజు గడవదని ఆమె చెబుతున్నప్పుడు, అలాంటి వ్యక్తిని టీటీడీలో అదీ పాలకవర్గ సభ్యురాలుగా నియమించటం పై విమర్శలు హిందూ సమాజంలో తీవ్ర స్థాయికి చేరాయి.


వీటిని ఎదుర్కోవడానికి సదరు నేత కూడా కులం అస్త్రాన్ని తీశారు. ఒక దళిత బిడ్డ టీటీడీలో నియమించబడితే అదీ ఒక మహిళ కావటంతో తట్టుకోలేక పోతున్నారు అని ఆమె నుంచి వాదన వినిపిస్తోంది. వెనుకటికి చాలామంది దళితులు టీటీడీలో నియమించబడ్డారు.  కాంగ్రెస్ హయాంలో కూడా దళితులు టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉండేవారు.


అయితే బైబిల్ పక్కన లేందే దిక్కుతోచదని చెబుతున్నఆమె టీటీడీలో నియ మించబడటంపై, విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి నియామకాలే కాంగ్రెస్ హయాంలోనో, మరేయితర రాజకీయ పార్టీ హయాంలోనో జరిగి ఉంటే, అనేక మంది బాబు సామాజిక వర్గపు వీరహిందుత్వవాదులు ఉరేసుకున్నంత పని చేసేవాళ్లు.


తమ సామాజికవర్గపు రాజకీయానికి ఇలాంటి అవకాశాలను చక్కగా ఉపయోగించుకునే వాళ్లు. ఇప్పుడు చంద్రబాబు నియామ కాలు కాబట్టి ఎక్కడి దొంగలు అక్కడే గప్‌-చుప్! చివరకు ఆ సామాజిక వర్గం తాము నివసించే సమాజంలోని ఇతర సామాజిక వర్గ జనులకు క్రమంగా దూరమవుతూ అంటరానివారుగా మారే దాఖలాలు కనిపిస్తు న్నాయి. చివరకు దీనికి చంద్రబాబు నాయుడే కారణంగా మిగిలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.


చంద్రబాబుకు ‘సమయానికి తగు మాటలాడే వ్యక్తులు, తగు రాతలు రాసే పత్రికలు, తగు విశేషాలు చూపించే చానళ్ళు, ఇక సోషల్ మీడియాలో చంద్రబాబు చాణక్యానికి చైనా అధ్యక్షుడు జి జిన్-పింగ్ కూడా డంగైనట్లు రాతలు రాసే జోకర్ గాళ్ళు చాలా మంది ఉన్నారు. చంద్రబాబు దెబ్బకు నరెంద్ర మోడీ ఖతమై పోతారనే రాతలు రాసే ‘తొక్కలో యు-ట్యూబ్ చానళ్ళు’ చాలా ఉన్నాయి.


కాలం మారింది ఒక వర్గం పత్రికలని నమ్మేవాళ్ళు క్రమంగా కనుమరుగైపోగా చివరకు స్వకుచమర్ధనం చేసుకునే సామాజిక వర్గానికే ఆ చానళ్ళు పరిమితమైపోయే రోజులు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: