చంద్రబాబు స్వంత భవనాల నిర్వహణ సిసిటివీలు, కెమెరాల భారం ఉభయ రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థలకే తలనొప్పా?

ఇదేమైన రాచరిక వ్యవస్థా? ఒక ముఖ్యమంత్రికి ఇన్ని భవనాలా? ప్రజాధనం వీరి గృహావసరాలకు ఏరులై పారుతుంది. హైదరాబాద్‌  జూబ్లీహిల్స్ రోడ్‌ నెంబర్ 65లో అత్యంత అదునాతనంగా నిర్మించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంటికి నిధులు ఇక కేటాయించలేమని రహదారులు మరియు భవనాల శాఖ ఆర్ అండ్ బీ అధికారులు తేల్చిచెప్పారు.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంటికి సీసీ కెమెరాల నిమిత్తం రూ.20 లక్షలు కేటాయించాలని ప్రతిపాదనలు అందాయి, ఈ దస్త్రాన్ని "ఆర్ అండ్ బీ ఎలక్ట్రికల్ విభాగానికి పంపారు. అయితే ఇప్పటికే ఎలక్ట్రికల్‌ విభాగం నుంచి సీసీ కెమేరాలకు, సోలార్‌ ఫెన్సింగ్‌ కోసం రూ.12 కోట్లకు పైగా నిధులు కేటాయించారు.
 
*జూబ్లీహిల్స్ రోడ్‌ నెంబర్ 65 భవనంతో పాటు,
*లేక్‌-వ్యూ అతిధి గృహం,
*మదీనాగూడ లోని ఫాంహౌస్,
*నాలుగేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 24లో అద్దెకున్న ఇంటికి,
*నారావారిపల్లె లోని ఇంటికి ఈ నిధులు ఖర్చు చేశారు.
*ఉండవల్లి కరకట్ట పక్కనున్న నివాసాన్ని క్యాంపు కార్యాలయం ఖాతాలో....

అధికారికంగా క్యాంపు కార్యాలయంగా ఉపయోగిస్తున్న ఉండవల్లి కరకట్ట పక్కనున్న నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా గుర్తించారు.  కాబట్టి దానికే నిధుల్ని ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సాధారణ  పరిపాలన శాఖ అనుమతులు మంజూరు చేస్తుంది. ఇక్కడ ఇప్పటికే సీసీ-టీవీ కెమేరాలు బిగించేందుకుగాను రూ.కోటి ఖర్చు చేశారు. హైదరాబాద్‌లో లేక్‌ వ్యూ అతిధి గృహాన్ని మొట్ట మొదటిసారిగా క్యాంపు కార్యాలయంగా గుర్తించడంతో అక్కడ సీసీటీవీ కెమెరాలను బిగించేందుకు, ఫెన్సింగ్‌ ఏర్పాటు కు రూ.3 కోట్లు వ్యయం చేశారు. ఆ తర్వాత మదీనాగూడలో ఫాంహౌస్‌కు, అద్దెకున్న జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబరు 24లో నివాసాలకు సీసీకెమేరాలు బిగించాలని నిధులు కేటాయించారు. సీఎం సొంత జిల్లా చిత్తూరులోని నారావారిపల్లెకు రూ.36 లక్షలు కేటాయించారు. అయితే సీసీ-టీవీలకు నిధుల కేటాయింపునకు అభ్యంతరాలు వ్యక్తం కాగా, ఉన్నత స్థాయిలో జోక్యం చేసుకుని నిధుల విడుదలకు అనుమతులిప్పిచ్చారు.
 
మళ్లీ  హైదరాబాద్‌ లోని ముఖ్యమంత్రి ఇంటికి సీసీ కెమెరాలకు గాను ఇప్పుడు రూ.20 లక్షలకు ప్రతిపాదనలు పంపడంపై ఆర్‌అండ్‌బీ వర్గాలు ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నాయి. హైద్రాబాద్ ఇంటికి  నిధులు విడుదల చేస్తే  ఆడిట్ ఇబ్బందు లు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయా? లేదా? అనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయాలకు లెక్క లేనంతగా పారుతున్న నిధుల వరదకు ఎట్టకేలకు అడ్డుకట్ట పడింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో రోడ్‌ నెంబరు 65 లో నూతనంగా నిర్మించిన సీఎం ఇంటికి నిధులు ఇక కేటాయించలేమని రహదారులు, భవనాల శాఖ తేల్చింది. 

CM Chandrababu naidu & his family stayed in a rental house in Jubilee Hills Road no 24 for some time decorated at government cost 


నారావారిపల్లె లోని ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో సుందరీకరణ 

ఉండవల్లి కరకట్ట పక్కనున్న చంద్రబాబు నివాసం - ప్రభుత్వ లెఖ్ఖలో కాంప్ ఆఫీస్ 

తెలంగాణలోని హైదరాబాద్‌లో ఇంటికి నిధుల విడుదలకు ఆడిట్‌ అభ్యంతరాలు వ్యక్తమవుతాయనే ఉద్ధేశంతో నిధుల మంజూరుకు అధికారులు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. అయితే నిధుల విడుదలకు సీఎంవో నుంచి ఒత్తిళ్లు అధికం అవుతున్నాయని ఆర్‌ అండ్‌ బీ ఉన్నతాధికారి ఒకరు ఒక ప్రముఖ మీడియాకు తెలిపారు.


ఆర్ధికంగా ఎంతగానో ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిగారి బహుళ గృహాల సముదాయాలకు విలాసవంతమైన ఖర్చుల లెఖ్ఖలు రాసి పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన పొగాకు రైతు సుబ్బారావు లేఖ ద్వారా ప్రశ్నించి ఆత్మహత్య కు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన అప్పట్లో జాతీయ మీడియా లో సంచలనమైంది. సీఎం క్యాంపు కార్యాలయాల ఖర్చుపై విమర్శలు వెల్లువెత్తుతున్నా, చంద్రబాబుకు చీమైనా కుట్టిన దాఖలాలు లేవు. ఇదీ మన ముఖ్యమంత్రి గారి ప్రజలపై ఏ మాత్రం ఖాతరు చేయని ప్రేమ.  ఇదంతా చూస్తుంటే చంద్ర భవనాల భారం మోయటం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ తల్ల కిందులవనుందా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: