'రాఫెల్ గాంధి' గా రాహుల్ గాంధి ఒకటే అజెండా! అధికారమే లక్ష్యం!

దేశ రక్షణ విషయాలపై నానా రచ్చ చేస్తున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. అదేపనిగా చేసే రచ్చ పెద్ద రభసైన తరవాత ప్రధాని నరెంద్ర మోడీ అందులోని రహస్యాలు బయటపెడితే అందులో రాహుల్ నేరారోపణలు నిజం కాకపోతే  “పంచతంత్రంలోని జిత్తులమారి నక్క” లాగా లాక్కోలేక పీక్కోలేక చచ్చెలా ఉంటుంది వాతావరణం ఆయన అలా చేసు కుంటున్నారు.


బోఫోర్స్ కుంభకోణంలో కాంగ్రెస్‌ పై మచ్చ పడిన విషయం గత స్మృతులు కాంగ్రెస్‌ను నేటికీ వెంటాడు తున్నాయి. పడిన మచ్చ చెరిగి పోక పోగా మరో దైన్య స్థితిలో పడవలసి వస్తుంది.  దేశ సరిహద్దుల్లో ఎండనక, వాననక, కుటుంబాలకు దూరంగా కాపలాకాస్తున్న జవాన్లకు అందించే శతఘ్నుల కొనుగోలులో కుంభకోణం చేసిన కాంగ్రెస్ కృతఘ్నులు ఈ సందర్భంగా నిన్న ఎన్సిపి నేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు గుర్తుకు తెచ్చుకుంటే మంచిది.


రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలు అంశంలో ఎన్సీపీ అధినేత, మాజీ రక్షణ మంత్రి శరద్‌ పవార్‌ ప్రధాని నరెంద్ర మోదీకి బాసటగా నిలిచారు. రాఫెల్‌ ఒప్పందం విషయంలో నరెంద్ర మోదీపై ప్రజలకు ఎలాంటి సందేహాలు లేవని స్పష్టం చేశారు. రాఫెల్‌ కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని నరెంద్ర మోదీ సర్కారుపై కాంగ్రెస్‌ ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న ప్రస్తుత తరుణంలో శరద్ పవార్‌ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.


ఇటీవల మరాఠీ వార్తా చానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలులో నరెంద్రమోదీపై ప్రజలకు ఎలాంటి అనుమానాలూ లేవన్నారు. అంతేకాదు యుద్ధవిమానాల సాంకేతిక వివరాలను వెల్లడించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌లో అర్థం లేదన్నారు. అయితే యుద్ధవిమానాల ధరలు వెల్లడిస్తే ప్రభుత్వానికేమీ ముప్పుండదని తెలిపారు.


వ్యక్తిగతంగా మోదీపై ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉండవని, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ వినిపించిన వాదనే ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించిందని అన్నారు. అరుణ్ జైట్లీ మాత్రం ప్రభుత్వ వాదనను సమర్థంగా వినిపిస్తున్నారని వ్యాఖ్యానించారు ఈ మాజీ రక్షణ మంత్రి.


రాహుల్ ఆరోపణలపై స్పందించిన ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.  ‘2008 నాటి సెక్యూరిటీ ఒప్పందం ప్రకారం రక్షణ వ్యవహారాలకు చెందిన రహస్యాల ను ఇరు దేశాలు బహిర్గతం చేయకూడదు. ఆ ఒప్పందానికి మేము కట్టుబడి ఉన్నాం. రక్షణ సంబంధిత వ్యవహారాలను బహిర్గతం చేయడం వల్ల దేశ భద్రత, రక్షణ వ్యవహారాలపై ప్రభావం పడుతుంది. ఈ నియమం 2016లో 36రఫెల్ యుద్ధ విమానాల కోసం చేసుకున్న ఒప్పందాలకు కూడా వర్తిస్తుంది’’ అని ఫ్రాన్స్ స్పష్టం చేసింది. ఆర్టికల్ 10 ప్రకారం రాఫెల్ యుద్ధ విమానాలపై ఫ్రాన్స్‌తో కేంద్ర ప్రభుత్వం 2008, జనవరి 25న నాటి రక్షణ మంత్రి ఏకే ఆంటోని సంతకం చేశారని తెలిపారు. రఫెల్ ఒప్పందాన్ని బహిర్గతం చేయలేమని భారత మీడియా ప్రతినిధులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు స్పష్టం చేశారు రక్షణ మంత్రి.


మరోవైపు ఈ ఒప్పందం ద్వారా నరెంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ భారీగా అక్రమాలకు పాల్పడు తోందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో పవార్‌ మోదీని సమర్థించేలా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌కు కాకుండా, ఇతర సంస్థలను (తమకు అనుకూలమైన) ఈ ఒప్పందంలో భాగస్వాములుగా చేర్చడంద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడటమే కాకుండా, దేశ భద్రతకు ముప్పువాటిల్లే అవకాశం ఉందని కాంగ్రెస్‌ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.


ఫ్రాన్స్‌తో జరిగిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం సాంకేతిక అంశాలతో కూడుకున్న అంశం. ‘ద సాల్ట్’ పేరుగల ఫ్రెంచి విమాన నిర్మాణ తయారీ సంస్థ నుంచి 36 యుద్ధ విమానాలను కొంటున్నట్లు మూడేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు.


రష్యా, అమెరికా, యూరప్ దేశాలను కాదని ఈ ఒప్పందం ఫ్రాన్స్‌తో 2012లోనే యుపిఏ హయాం లోనే తీసుకున్న నిర్ణయమైంది. భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు తీసుకున్న చర్య ఇది. ఈ విమానాలు రెండు ఇంజన్లు కలిగి వుంటాయి. 126 విమానాలను కొనుగోలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని యూపీఏ ప్రభుత్వం వాయిదావేస్తూ వచ్చింది. ఇవి చాలా ధర కల్గినవి. దశాబ్దకాలం యూపీఏ ప్రభుత్వం చర్చలు జరిపింది.


స్వార్ధప్రయోజనాలే ప్రాధమ్యాలుగా పనిచెసే మన కాంగ్రెస్ రాజకీయవేత్తలు దెశరక్షణ విషయంలో రాజీపడిన దాఖలాలు మనకు గతమంతా అవగతమే. ‘పాలసీ పెరాలసిస్’ వల్ల అమలు చేయలేకపోయింది. అంతే కాదు నిర్ణయలేమి, చేతకానితనం, డోలాయమాన ప్రవర్తన, ఎల్లకాలం ఆర్ధిక నేఱాలతో బ్రతికి అటు స్వార్ధం త్యాగం చేయలేక ఇటు ప్రతిపక్షాల నుండి ఇటు ప్రజల నుండి ఎదురుదాడి మనసులో మెదలటంతో మొదలైన భయం వారిని నిర్ణయం తీసుకోవాలంటే నే వణుకు పుట్టించి ఉండవచ్చు.


నరెంద్ర మోడీ కి ఆ భయం లేదు పటుతర నిర్ణయం తీసుకున్నారు. తనపై అవినీతి ఆరోపణలు త్రోసి రాగలరు. మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ అన్నట్లు ఆయన కు కుటుంబమా? పిల్లలా? ఎవరి భవిష్యత్ కోసం సంపాదించాలి? ఏ బాదరబందీ లేని మొండి ఘటాన్ని ఏవరూ ఏమీ చేయలేరు కదా! దేశ రక్షణ ఆయన మనసును శాసించి ఉండవచ్చు. ఆయనకు నిర్ణయ రాహిత్యం ఎప్పుడూ లేదు. ఇప్పుడూ అదే జరిగింది.     


యూపీఏ-2 హయాంలో అనేక అవినీతి కుంభకోణాలు కూడా వెలుగుచూశాయి. కనుక ఇది సాధ్యం కాలేదు. కాని భారత వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు మోదీ అధికారంలోకి రాగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి, 2016లో ఒప్పందం ఖరారైంది. ఒప్పందం ప్రకారం యుద్ధవిమానాల తయారీ సంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత రక్షణ పరిశోధనా సంస్థ- డిఆర్‌డివోతో పంచుకుంటాయి.


రాహుల్ గాంధి ఎవరో నేర్పిన మాటలు చిలకలా పలుకుతారు కాని, ఆయనకు అసలు  'రాఫేల్ ఒప్పందం" మీద సూక్ష్మంగా నైనా హోంవర్క్ చేసి ఉంటారా? అనేది అనుమానాస్పదమే. అని ఆయన ధైహిక భాషే (బాడీ లాంగ్వేజ్) చెపుతుంది. కాంగ్రెస్ నాయకులు రిలయన్స్ పాత్ర విషయంలో నీతులు చెపుతారు కాని వాళ్ళ పాలనలో ఉన్న "నెపోటిజం" తో పోలిస్తే బిజెపి పాలనలో ఆ అంతరం హస్తి మశాంతకమంత. 


ఈ ఒప్పందం కుదరగానే కాంగ్రెస్ పార్టీ - ఎన్డీఏ చెబుతున్న ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రాజెక్టు పెద్ద విఫల ప్రయోగం అని విమర్శించింది. కాని మోదీ ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ కు కొత్త భాష్యం యిచ్చింది. ఇతరుల సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం సొంతం చేసుకోవడం కూడా ఇందులో భాగం. ఈ ట్విన్-ఇంజన్ విమానం బహుళ ప్రయోజనాలు కలది. పదేళ్ళ క్రితం ధరలకు కొంత ద్రవ్యోల్బణం, డాలరు విలువ అన్నీ తోడవుతాయి. అయినప్పటికీ మోదీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో, యుపిఎ కంటె ఎన్‌డిఎ హయాంలో ధరలు తక్కువగానే వున్నాయి. ఈ ఒప్పందంలో అనేక విషయాలకు సంబంధించిన కొనుగోలు వివరాలు చూస్తే ఒప్పందం చౌకగానే జరిగిందని అర్థం అవుతుంది.


కాని యితర సాంకేతికాంశాలు, రక్షణ రహస్యాలు పైగా ఇరుదేశాల మధ్య జరిగిన రక్షణ ఒప్పందం తాలూకు విశ్వసనీయత లెక్కలోకి తీసుకోకుండా కాంగ్రెస్  అధినేత  రాహుల్ గాంధి ఈ ఒప్పందంపై నానా రభస చేయటం ఆయనకు భావి భారత ప్రధాని కావాలని అనుకునే ఆయన కలలకు మాత్రం శ్రేయోదాయకం కాదు. కొనుగోలు చేయనున్న 36 విమానాలకు సంబంధించి 15 శాతం అడ్వాన్సు చెల్లించారు. మొత్తం ధర రూ. 58 వేల కోట్ల లో 30 % భారత సైనిక వైమానిక పరిశోధనా రంగంలో పెట్టు బడి పెడుతుంది. 20% రాఫెల్ విడిభాగాల తయారీలో కూడా పెట్టుబడి పెడ్తుంది. ఈమేరకు అదనపు ఒప్పందం కూడా కుదిరింది.


ఫ్రాన్సులోని దసాల్ట్ సంస్థ అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్‌ను భాగస్వామిగా చేసుకోవడం పట్ల కూడా కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోంది. నిజానికి రిలయన్స్ డిఫెన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ ఏరో స్పేస్, ద సాల్ట్ ఏవియేషన్‌తో కలిసి ద సాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్‌ గా జాయింట్ వెంచర్‌గా ఏర్పడ్డాయి. ఇది రెండు ప్రైవేటు సంస్థల మధ్య జరిగిన వొప్పందం. ఇందులో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదు. దీన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా క్లియర్ చేసింది.


ఫ్రాన్స్ మాజీ ప్రధాని ఫ్రాంకొయిస్ హోలాండే పై మనదేశంలో సోనియా గాంధి పై ఉన్నట్లే భిన్న రకాల ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి కూడా! అక్కడ ఫ్రాన్స్ లోని నేరాభియోగాలున్న హోలాండే ఇక్కడ వందల సంఖ్యలో అభియోగాలున్న గాంధి కుటుంబం చెప్పే మాటలు ఇరుదేశాల ప్రజలు ముఖ్యంగా భారత ప్రజలు శరద్ పవార్ అన్నట్లు విశ్వసించే పరిస్థితులు లేవు.


రిలయన్స్ అధినేత అంబానీ ఇది వరకే రాహుల్‌కు ఈ విషయమై హెచ్చరిక జారీచేశారు. తాజాగా ఆయన పై ₹ 5,000 కోట్ల మేరకు పరువునష్టం దావావేశారు. రాహుల్‌కు చెందిన “నేషనల్ హెరాల్డ్   పత్రిక”ఈ విషయమై అనేక అవాస్తవాలు ప్రచురించింది. రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఒప్పందాలను భద్రతా కారణాల దృష్ట్యా బయట పెట్టలేమని చెప్పారు. సరిగ్గా ఇదే మాట నాడు ప్రభుత్వంలో ఉండగా మన్మోహన్ సింగ్, ఆంటోనీ లు చెప్పారు. జెట్ విమానాలతో పాటు వచ్చే యాక్సెసరీస్ ఆయుధాల వివరాలను కూడా భద్రతా కారణాల దృష్ట్యా వివరించ లేమని ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం అంటోంది.


నిజానికి భారత్ రక్షణావసరాలపై చాలా విశ్లేషణ జరిగింది. ఇది యుపిఎ హయాం లోనే జరిగింది. 10 ఏళ్ళపాటు ధరలపై యుపిఎ చర్చలు జరిపింది. పాకిస్తాన్‌ను, చైనా ను ఒకేసారి ఎదుర్కొనే సామర్థ్యం వాయుసేన కిచ్చేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పైగా నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక సాంకేతిక యుద్ధాలకు సంభందించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంది.


ఇందులో యుద్ధ విమానాల్లో “అణుశక్తిని మాధ్యమం” గా చేసుకొని యుద్ధం చేసే వెసులు బాటు కూడా వుందని అంటున్నారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో జరిగిన చర్చల్లో సామాన్య యుద్ధవిమానాలు కొనుగోలు అంశమే ప్రధానం.  కార్గిల్ యుద్ధం తరువాతనే ఈ తరహా విమానాల విషయమై నాదు అంటే 2003 వరకు చర్చోప చర్చలు జరిగిన తరవాత గాని నిర్ణయం రికార్డు చేయబడిందని సమాచారం. దీనికంతటికి యుపిఏలోని నిర్ణయలేమి ప్రధాన కారణం.


నిర్ణయం జరిగాక పదేళ్ళ వరకు అంటే 2004 నుంచి 2014 వరకు యుపిఎ ఎందుకు కాలయాపన చేసింది? కాలంతోబాటు ధర పెరుగదా? వీటికి తోడు తయారీ రంగం ఏఅమాత్రం పుంజుకోని భారత్ లో విజృంభించిన ఈంఫ్లేషన్ (ద్రవ్యోల్బణం) ఫారిన్ ఎక్చేంజ్ (విదేశీ మారకం) వ్యత్యాసం - అంటే పరోక్షంగా యుఎస్ డాలర్, యూరోల మారకం వంటివి కూడా ఈ పెరుగుదలకు కారణం కావచ్చు.


ధరలు పెరగడం వల్లనే కొనాలనుకున్న ఎయిర్ క్రాఫ్ట్‌లను 36కు తగ్గించింది ఎన్‌డిఎ ప్రభుత్వం. కొన్ని సాంకేతికాంశాలను కూడా జతచేసి ఎయిర్‌ క్రాఫ్ట్‌ల నిర్మాణం జరగాలని నిర్ణయించారు. బహుశ ఈ కొద్ది సంఖ్యలోని ఈ వార్ జెట్ ల సామర్ధ్యం మన సైనిక అవసరాలకు సరిపోతుందేమో? సాంకేతికాంశాల వెల్లడి కోరటం పరమ దుర్మార్గం. బహుశ దేశ భద్రత దృష్ట్యా తన పదవి పోయినా నరెంద్ర మోడీ ఆ విషయాలు బయట పెట్టకపోవచ్చు. "హాఫ్ – ఇండియన్" అని చెప్పబడుతున్న రాహుల్ గాంధికి  గొప్ప సెంటిమెంట్ ఉండకపోవచ్చు.


అయినా ధర ఎంత పెరిగినా యుపిఎ ప్రభుత్వ పాలనలో- 2007లో జరిగిన ధరనిర్ధారణ కంటే యిపుడు సరఫరా చేసే ఎయిర్‌ క్రాఫ్ట్‌ల ధర తక్కువగానే వుండాలని భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వ నేతలు భావించారు. ఈ లెక్కన ప్రస్తుతం ఎన్‌డిఎ కొనాలను కుంటున్న రాఫెల్ విమానాలు 9 శాతం తక్కువ ధరకే సరఫరా అవుతాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.


కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్లు యిందులో కుంభకోణం ఆనవాళ్ళు మచ్చుకైనా కానరావు. బోఫోర్సు కుంభకోణంలో ఇటలీ పెద్ద చేపలైన ఖత్రోచి లాంటి వ్యక్తులు బయట పడ్డారు. వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి చేరిన మొత్తాలు తెలిసొచ్చాయి. కాని యిపుడు అలాంటి విషయాలేమైనా వున్నాయా? అలాంటిది ఉంటే నరేంద్ర మోడీ ఖాతాల్లోకి ప్రవహించిన సొమ్ముల లెక్కలు చెపితే రాహుల్ గాంధిని నమ్మవచ్చు. సాంకేతిక వివరాలు రాఫెల్ వార్ జెట్ లలో అమర్చిన సాంకేతిక పరికరాల వివరాలు అడిగితే చెప్పటానికి నరెంద్ర మోడీ రాహుల్ గాంధి లాగా జోకర్ మాత్రం కాదు.


భారత్ పట్ల బాధ్య ఏమాత్రం ప్రదర్శించని రాహుల్ గాంధి “కర్ణాటకలో బిజెపి ఓటమే ధ్యేయంగా పట్టుమని 35 స్థానాలు కూడా గెలవని జెడిఎస్ దురాశాపరుల పాదాల చెంత మోకరిల్లిన రోజే ఆయన ప్రజావిశ్వాసం కోలోయారు – తన పార్టీ ప్రజా ప్రతినిధుల మనోగతాలను ఎమోషన్స్ సైతం పాతరేసిన, ఈ రాహుల్ గాంధి రేపు చిన్న ప్రయోజనం కనిపిస్తే భారత్ ప్రతిష్ఠ ని ఫణంగా పెట్టరని గ్యారెంటీ ఉందా?” మన ప్రవర్తన ద్వారానే  అధికారం కోసం ప్రాకులాడే నైజం బహిరంగ పరుస్తూ - నీ పార్టీ నే ముంచేసిన నీ దౌర్భాగ్యం అధికారలోకి వస్తే రేపు భారత్ కు పట్టదనే విశ్వాసం ఆసేతుసీతాచలం అఖిల భారత జనావళికి మాత్రంలేదు. 


2007 ఒప్పందంలో హెచ్‌ఎఎల్ ప్రస్తావన వుంది. కాని హెచ్‌ఎఎల్‌కు ఆ సామర్థ్యం ఆ సమయంలో లేని కారణంగానే ఆ ఒప్పందాన్ని ఫ్రాన్సు రద్దు చేసుకుంది. ప్రస్తుతం హెచ్‌ఎఎల్ కూడా “తేజస్ విమానాలు” ఉత్పత్తి చేస్తున్నది.


హెచ్‌ఎఎల్‌ కు ఇపుడు పూర్తిస్థాయిలో వ్యాపారం వుంది. ఈ ఒప్పందం తాలూకు ధరల నిర్ణయంలో:

*ప్రైస్ నెగోషియేషన్ కమిటీ,

*కాంట్రాక్టు నెగోషియేషన్ కమిటీ 14 నెలలపాటు అవి శ్రమించాయని సమాచారం


ఇవి లేకుండా ఇవన్నీ జరిగకుండా ఏ ప్రభుత్వమూ పనిచేయదు. దీని తరువాత భద్రత పై క్యాబినెట్ కమిటీకి “ధర వరల రికమండేషన్” వెళ్ళిన తరవాతే ఆమోదం జరిగిందని సమాచారం.  ఇవేవీ లేవని రాహుల్ గాంధి బుకాయించడం కేవలం ఎన్‌డిఎ పై బురదజల్లే ప్రయత్నం మాత్రమే కాదు 2019 లో అధికారంలోకి రావాలన్న అత్యంత దురాశ పేరాశ తప్ప మరేమీ కాదు. 


పైగా ఈ ఒప్పందంలో “సీక్రెసీ క్లాజు” లేదని ఆనాటి రక్షణమంత్రి ఏ,కె ఆంటోనీ బల్లగుద్ది చెప్పగలరా? రాహుల్ గాంధి కి ఈ తరహా ఒప్పందం 2008 లో జరిగిందని తెలియకపోవడం అత్యంత దయనీయం కొండొకచో శోచనీయం. “ఫ్రెంచి ఎంబసీ ఈ తరహా క్లాజు” ఈ ఒప్పందంలో ఉందని  స్పష్టం చేసింది. ఇది రాహుల్‌ గాంధి కి తెలియదా! 


ఈ మధ్య లండన్, జర్మనీల పర్యటనల్లో మోదీ ప్రభుత్వం డోక్లామ్ సమస్యను సరిగా చక్కబెట్ట లేదని రాహుల్ ఆరోపణ చేశారు. ‘మీ పార్టీ సభ్యుడు ప్రధాని స్థానంలో వుంటే ఏం చేస్తారని అడిగితే, డోక్లాం గురించి నాకు వివరాలు తెలియవని ఆయన అక్కడ పరువు ప్రతిష్ఠ అంతర్జాతీయ సమాజం ముందు పోగొట్తుకున్నారు. ఇవేమీ తెలియకుండానే, తెలుసుకోవటానికి ప్రయత్నించ కుండానే సరైన హోం వర్క్ చేయకుండానే ఎన్‌డిఎ ప్రభుత్వాన్నిభారత ప్రధానిని “దొంగ” అని విమర్శించటంలోని ఔచిత్యం పాలెంత? 


ప్రధాన ప్రతిపక్ష నేతగా ఇంత అపరిపక్వత ప్రదర్శిస్తున్న వ్యక్తి రేపు భారత్ లాంటి 125 కోట్ల ప్రజానీకానికి నాయకత్వం వహించటం సాధ్యమా? ఈలా అభాసు పాలయ్యే ప్రధానిగా ఎలా సరిపోతారు. రక్షణ బలగాలలో ఆత్మస్థైర్యం నింపే రాఫెల్ ఒప్పందాన్ని ప్రతిపక్ష నేతగా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. “అబద్ధాన్ని పదిసార్లు చెబితే అది నిజమవుతుందనే ఈ తరహా వ్యక్తిత్వం భారత ప్రధానికి సమర్ధత నిర్ణయిస్తుందా? కాంగ్రెస్ పార్టీకి కాని,  రాహుల్‌ గాంధికి గాని ఈ తరహా దూకుడు ఆత్మహత్యా సదృశం కాకుండా పోదు. తస్మాత్ జాగ్రత్త.


అంతే కాదు రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఎయిర్ చీఫ్ మార్షల్ ‘బీరేంద్ర సింగ్ ధనోవా’ కూడా సమర్థించారు. రష్యా నుంచి ఎస్-400 క్షిపణ రక్షణ వ్యవస్థను కొనుగోలు పైనా ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్’ సారథ్యంలో ‘ఐఏఎఫ్ ఫోర్స్ స్ట్రక్చర్ - 2035’ అనే అంశంపై ఇతీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ధనోవా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ:


రాఫెల్ యుద్ధ విమానాలు, ఎస్400 క్షిపణి వ్యవస్థను సమకూర్చడం ద్వారా ప్రభుత్వం పొరుగు దేశాలకు దీటుగా భారత వైమానిక దళాన్ని బలోపేతం చేస్తోంది...’’ అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో కూడా అత్యవసర సమయంలో మనం పలుమార్లు ఆయుధాలను కొనుగోలుచేసినట్టు గుర్తు చేశారు. ‘‘1983లో పాకిస్తాన్ తొలిసారి ఎఫ్-16 యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. వీటితో ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు అప్పట్లో నాలుగోతరం యుద్ధ విమానాలు లేకపోవడంతో ప్రభుత్వం సోవియట్ యూనియన్‌ను సంప్రదించింది. దీంతో సోవియట్ నుంచి రెండు స్క్వాడ్రన్‌ మిగ్-23ఎమ్ ఎఫ్ విమానాల ను పంపారు. ఆకాశంలో ధీటుగా పోరాడగల ఈ విమానాలు సోవియట్ యూనియన్ వద్ద మాత్రమే ఉండేవి...’’ అని ఆయన పేర్కొన్నారు.

 

నాలుగో తరం విమానాలు అందుబాటులోకి వస్తుండగానే 1985లో ఫ్రాన్స్ నుంచి మనదేశం మరో రెండు స్క్వాడ్రన్ల మిరాజ్-2000 యుద్ధవిమానాలను కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఆ తర్వాత పాకిస్తాన్ మరిన్నిఎఫ్-16 విమానాల వైపు మొగ్గు చూపడంతో, మళ్లీ సోవియట్ యూనియన్ నుంచి భారత్ మరో రెండు స్క్వాడ్రన్ల మిగ్-29 విమానాల ను కొనుగోలు చేసినట్టు ధనోవా గుర్తుచేశారు.


ప్రభుత్వాల మధ్య అంతర్గత ఒప్పందాల (ఐజీఏ) ద్వారా రక్షణ సంపత్తిని సత్వరమే సమకూర్చు కునే అవకాశం ఉంటుందనీ, ఇందులో భాగంగానే తాజాగా మరో రెండు స్క్వాడ్రన్ల కు సరిపడా 36 రాఫెల్ యుద్ధ విమానాలను ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు ఎయిర్ ఫోర్స్ చీఫ్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: