తన అజ్ఞానాన్ని మళ్ళీ బయటికి పెట్టుకున్న పవన్...!

Prathap Kaluva

పవన్ కళ్యాణ్ తుఫాన్ భాదితులను పారామర్సించకుండా కవాతు చేయడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే దానికి పవన్ సమాధానం వింటే ఎవరికైనా తన అజ్ఞానం అర్ధం కాక తప్పదు. తను బయటికి వస్తే సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందంటా... అయితే తరువాత పవన్ తుఫాన్ భాదితులను సందర్సించి  ఏమన్నాడంటే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా పునరుద్ధరించామని, నీళ్లు అందుతున్నాయని, సమస్యలన్నింటినీ పరిష్కరించామని ప్రభుత్వం చెబుతోందని.. వాస్తవానికి వాటిలో ఒక్కటి కూడా జరగలేదని వ్యాఖ్యానించారు.


ఎక్కడో కేరళలో వరదలు వస్తే అందరూ ఏకమై అండగా నిలిచారని, కానీ ఇక్కడ ఇప్పటి వరకు ఒక్క సాయం కూడా అందలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు. శ్రీకాకుళం తుఫాన్ బాధితుల ఇబ్బందులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తాను తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ‘నేను మీ వాడిని.. మీ బాధను నేను బయటకు తీసుకెళ్తాను’ అని పవన్ ఉద్ఘాటించారు. ప్రభుత్వ సహాయ సహకారాలను దెబ్బతీయడానికి తాను శ్రీకాకుళం రాలేదని చెప్పాడు . 


అసలు ఎంత సహాయం చేస్తున్నారు.. అది ప్రజలకు సరిపోతుందా లేదా అనే విషయాన్ని అధ్యయనం చేయడానికి వచ్చానని వెల్లడించారు. కొబ్బరి చెట్టుకు రూ.1200 ఇస్తే సరిపోదని, మరో 25 సంవత్సరాల పాటు అండగా ఉండటానికి పథకాలు, ఆచరణ ఎలా ఉండాలో చెప్పడానికి తాను బయటికి వచ్చానని చెప్పారు. అన్ని గ్రామాలు తిరిగి జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తానని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: