పకోడీల వ్యాపారిపై ఐటి అధికారుల దాడి లో పట్టుబడింది ₹1.20 కోట్లు–ఆయన టిడిపి వారా?

అతి చిన్న స్ట్రీట్ వెండార్స్ కుటుంబ సభ్యులంతా దివారాత్రులు కలసి కష్టపడి  కృషిచెస్తేనే కొంత సంపాదన అమురుతుంది. అయితే కొందరు వ్యాపారులు సంపాదిస్తు న్న ఆదాయంపై పన్ను చెల్లించడం లేదని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం అందటంతో పదిరోజుల క్రితం లూథియానా నగరంలోని “పకోడీలు  మరియు చాట్ వ్యాపారి “ ఇంటిపై దాడి చేసిన ఐటీ అధికారులు 60 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 

లూథియానా నగరంలో జరిగిన ఘటన మరవక ముందే పాటియాలా నగరంలో మరో ఛాట్ వాలా ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక  తనిఖీలు జరిపారు. ఈ తనిఖీ ల్లో లెక్కలలో చూపని ₹1.20 కోట్ల నగదు గుర్తించబడింది. చాట్ వాలా వివాహాలకు పెద్ద ఆర్డర్లు తీసుకోవడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాడని ఐటీ అధికారుల తమ సోదాల్లో గుర్తించారు. 


అలాంటి చిన్న వ్యాపారి తెలుగు దేశం పార్టీ కార్యకర్త కాదు. అయినా వారి ఉద్యోగ ధర్మం వారు నిర్వహించబట్టే కదా! వాళ్ళు దొరికింది. ఆ వ్యాపారి తనపై జరిగిన దాడిని అన్యాయం అనలేదు. కేంద్రం ద్రోహం చేసిందని నిందించ లేదు కారణం ఆయన సాధారణ పౌరుడు. 

కాని ప్రజాధనాన్ని వారి రక్త మాంసాలను, ఇతరుల అవకాశాలను రాజకీయ ఎత్తుగడలతో బలవంతంగా దోచుకునే, మన ప్రజాప్రతినిధులు మాత్రం ఇలాంటి దాడులను తమను లక్ష్యంగా చేసు కొనే కేంద్రం చేయించినదని అంటుంటారు.  జనాన్ని లూటీ చేసి దోచుకున్న అదే సిఎం రమేష్, ప్రజాప్రతినిధి రాజ్యసభసభ్యుడు అంటే దొడ్డిదారినో, రికమండేషన్లతోనో, ఏదో ప్రలోభం చూపో, అంతకు మించి నాయకుని ఆస్తులకు బినామీదారుగా ఉంటేనో తప్ప, ముఖ్యమంత్రి ఆయన తనయుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి కేంద్రం రాష్ట్రంపై  దాడిగా అభివర్ణిస్తారు.

లేకుంటే ఒక నేరస్తుడు పట్టుబడ్డాదని జాతికి పెనాల్టీల రూపంలో ఆదాయం వస్తుందని సంతోష పడతారు.  అక్కడ కామన్ మాన్ తప్పుచెస్తే దిక్కులేదు. కాని, ఇక్కడ సిఎం రమెష్ అనే ముద్ధాయి, ప్రజాప్రతినిధి, తప్పుచెస్తే ఆయన రక్షణకు "సిరికింజెప్పడు శంఖ చక్ర యుగమున్ చేదోయి సంధింపడే..." అన్న చందంగా ప్రభుత్వమే తనకై తాను నేరగాణ్ణి సమర్ధిస్తూ స్పందిస్తే — తనవాళ్ళ తప్పులను కాయటానికే ప్రభుత్వాలున్నట్లా? మరెందుకు మనకీ ప్రభుత్వాలు? దుర్మార్గ సంపాదనా పరులకు, నేరగాళ్లకు, దోపిడీగాళ్ళైన రాజకీయ నాయకులకు పోలీసు రక్షణ కలిపించి కాపాడితే --- ఇంక పార్లమెంట్, శాసనసభలు, న్యాయస్థానాలు, అధికారవర్గాలు దేనికి?   అధికారం లో ఉన్నంత మాత్రాన ఒక నేరగాడు రక్షించబడాలా?   

నేరగాడెవరైనా, సామాన్యుడైనా, అనన్యసామాన్యుడైనా ఒకటిగా పరిగణించబడని నాడు ఆ ప్రజాస్వామ్యం కాల్చనా? కూల్చనా?  ఇంటిపై వ్యాపార సంస్థలపై సోదాచెస్తేనే ₹100 కోట్లు లెక్కల్లో చూపని నల్లధనం ఆంధ్రప్రదేశ్ దొరికింది. టిడిపిని లక్ష్యంగా చేసుకొని ఐటి శాఖ దాడులు చేసిందని అంటున్నారు. అలా ఐతే దేశంలో జరిగిన ఐటి దాడులన్నీ టిడిపి లక్ష్యంగా చేసుకొని జరిగినవే నంటారా? 

సిఎం రమెష్ ఆస్తులు, సంస్థలపై ఐటి శాఖ దాడులు చెస్తే వీరెందుకు వణికిపోతున్నారు?

సిఎం రమెష్ గృహమే ఇది!!!!?????

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: