రాజ‌కీయ చాణిక్యుడి పాచిక త‌డ‌బ‌డిన వేళ‌.. ఏపీలో చ‌ర్చ‌..!

VUYYURU SUBHASH
అవును!  ఏపీ సీఎం, టీడీపీ అదినేత చంద్ర‌బాబు గ్యాప్ ఇవ్వ‌లేదు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో ప‌రిస్థితి దారుణంగా త యారైంది! ఇప్పుడు ఈ విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఎవ‌రికి బాబు గ్యాప్ ఇవ్వ‌లేదు. ఎందుకు ఇవ్వ‌లేదు? అనే ప్ర‌శ్న‌లు సాధార‌ణంగానే తెర‌మీదికి వ‌స్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. కేంద్రం నుంచి ఏపీకి ఎలాంటి స‌హకార‌మూ అంద డం లేదు. అదేస‌మ‌యంలో కేంద్రం నిర్వ‌హిస్తున్న ప్రాజెక్టుల‌కు కూడా కేంద్రం నుంచి నిదులు రావ‌డం లేదు. దీంతో ఎ క్కడి అభివృద్ధి అక్క‌డే అన్న విధంగా మారిపోయింది మ‌రీ ముఖ్యంగా కేంద్రంలోని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. చంద్రబాబు ను ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశారు. అంతేకాదు, ఆయ‌న‌ను తీవ్రంగా అవ‌మానించారు కూడా. బాబు క‌న్నా తెలంగాణా సీఎం కేసీఆర్ కు ముందు చూపు ఎక్కువ ఉంద‌ని పార్ల‌మెంటు సాక్షిగా పెద్ద ఎత్తున వ్యాఖ్యానించారు. 


కేంద్రం నుంచి వ‌స్తున్న స‌హకారం నిలిచిపోయింద‌ని చంద్ర‌బాబు సైతం ప‌లు సంద‌ర్భాల్లో వ్యాఖ్యానించారు. అయితే, దీనిపై ఆది నుంచి ఓ విధ‌మైన చ‌ర్చ సాగుతూనే ఉంది. కానీ, ఇప్పుడు దీనికి గ‌ల కార‌ణాలు ఏంటి? ఎందుకిలా జ‌రుగుతోం ది.. అనే కీల‌క‌మైన అంశాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న విష యం తెలిసిందే. ఏపీలోకి నాలుగు ఎమ్మెల్యే సీట్ల‌ను రెండు పార్ల‌మెంటు స్థానాన్ని కూడా టీడీపీ ఇచ్చింది. ఫ‌లితంగా కాపురం స‌జావుగా సాగుతుంద‌ని అనుకున్నారు. అయితే, రెండు సంవ‌త్స‌రాలు బాగానే సాగిన బాబు-బీజేపీల కాపురం.. త‌ర్వాత మాత్రం బెడిసి కొట్టింది. దీనికి కార‌ణం.. ఏంటి? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. తానే బ‌య‌ట‌కు వ‌స్తున్నాన‌ని బాబుతో చెప్పించ‌డం లో బీజేపీ వ్యూహాత్మ‌కంగా విజ‌యం సాధించింది. 


అయితే, స్థానికంగా ఏపీ బీజేపీ నేత‌లు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే బీజేపీ పెద్ద‌లు టీడీపీతో అంటీ ముట్ట‌నట్టు వ్య‌వ‌హ రించ‌డం ప్రారంబించార‌ని తెలిసింది., రాష్ట్రంలో బీజేపీని ఎద‌గ‌నివ్వ‌కుండా .. చంద్ర‌బాబు పావులు క‌దిపార‌ని, కేంద్రం నుంచి నిధులు వ‌చ్చి.. ప్రారంభించిన ప‌థ‌కాల‌కు కూడా బీజేపీ నేత‌ల‌కు ఆహ్వానాలు అందేవి కావ‌ని, తీవ్రంగా అవ‌మానించార‌ని, ముఖ్యంగా జాతీయ ప్రాజెక్టు అయిన పోల‌వ‌రం ప‌నుల‌ను దూసుకుపోయేలా చేయ‌డంలో కేంద్రంలో ని మోడీ ప్ర‌భుత్వం చురుగ్గా వ్య‌వ‌హ‌రించింద‌ని, అయితే, ఇక్క‌డ మాత్రం ఆయా ప‌నుల రికార్డుల‌ను చంద్ర‌బాబు త‌న ఖాతాలోనే వేసుకున్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా ఎటు చూసినా.. బీజేపీ ఎదిగేందుకు చంద్ర‌బాబు గ్యాప్ ఇవ్వ‌కుండా వేధించార‌ని పేర్కొంటున్నారు. ఈ ప‌రిణామ‌మే బీజేపీకి-టీడీపీకి మ‌ధ్య గ్యాప్‌ను పెంచింద‌నేది బీజేపీ సీనియ‌ర్ల వాద‌న‌. రాబోయే రోజుల్లో త‌మ పోరు మ‌రింత ఉధృతంగా ఉంటుంద‌ని కూడా చెబుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: