టీటీడీ “200 కోట్ల పరువునష్టం” దావా...షాక్ లో... “ఆ ఇద్దరు”

NCR

కొన్ని నెలల క్రితం టీటీడీ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని రమణదీక్షితులని టీటీడీ నుంచీ తప్పించిన విషయం అందరికి తెలిసిందే ఆ సమయంలో ఆ ఇష్యూ మెల్ల మెల్లగా రాజకీయ రంగు పులుముకుని విశ్వవ్యాప్తంగా  సంచలనం సృష్టించింది..ఎన్నడూ లేని విధంగా తిరుమల స్వామి వారి కొండపై ఇలాంటి రాజకీయాలు జరగడం తమ రాజకీయ మనుగడల కోసం వెంకన్నను కూడా వాడుకోవడం ఈ సోకాల్డు రాజకీయ నేతలకే చెల్లింది అనడంలో సందేహం లేదు.. రమణదీక్షితులు ప్రెస్ మీట్ లు పెట్టి మరీ గుడిలో అపచారం జరుగుతోందని సంచలన ఆరోపణలు చేయడం ఆయనకీ తోడుగా మేము ఉన్నామని అంటూ వైసీపీ నేత విజయసాయి రెడ్డి కూడా రంగంలోకి దిగడం ఇలా చిలికి చిలికి ఆ వివాదం గాలి వానగా మారి పెద్ద తుఫాను అయ్యింది.

 

ఇదిలాఉంటే మెల్లగా ఈ ఇష్యూ సర్దుమనిగింది అనుకున్న సమయంలో మరొక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది..వైకాపా రాజ్యసభ సభ్యుడు 'విజయసాయిరెడ్డి, టిటిడి మాజీ అర్చకుడు రమణదీక్షితులు చేసిన విమర్శలు, అసత్యఆరోపణలపై టిటిడి రూ.200కోట్లకు పరువునష్టం కేసు దాఖలు చేసింది. విజయసాయిరెడ్డి ,రమణదీక్షితులు కలసి తిరుమల తిరుపతి దేవస్థానం పరువు తీశారని టిటిడి అధికారులు కేసు వేశారు..అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఇక్కడే మరొక వివాదం టీటీడీ ని అంటుకుంది..

 

ఈ కేసు దాఖలు చేయడానికి రూ.2కోట్లను ఫీజుగా చెల్లించడంపై ఇంటా , బయట పలు రకాల విమర్శలు వస్తున్నాయి. ఇది టిటిడి పరువు కోసం వేసింది కాదని, అసత్య ఆరోపణలు, విమర్శలు చేసినందుకే పరువు నష్టం కేసు వేయడం జరిగిందని, టిటిడి అధికారులు చెబుతున్నారు. ఇదిలాఉంటే రూ.2కోట్లు చెల్లించి..పరువు నష్టం దావా వేయగా...విజయసాయిరెడ్డి, రమణదీక్షితులు ఎంత స్టాంప్‌ డ్యూటీ కడతారో తెలియడం లేదు. దేశ, విదేశాల్లో ఎంతో పరువున్న టిటిడి దేవస్థానంపై అసత్య ప్రచారం చేసిన వారనికిని క్షమించా కూడదని టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇక్కడి వరకూ బాగానే ఉన్నా కోర్టు ఫీజు కింద రెండు కోట్ల రూపాయలు చెల్లించినంత మాత్రాన. టీటీడీ  విలువ రూ.200కోట్లేనా అంటూ చాలా మంది సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు..దాంతో టీటీడీ సైతం అలాంటి వారి వ్యాఖ్యలపై గట్టిగానే కౌంటర్ ఇస్తోంది..ఎంతో పవిత్రంగా చూసుకునే వెంకన్న ఆలయాన్ని, ఆలయ పవిత్రతని  సాయిరెడ్డి, రమణదీక్షితులు అసత్య ప్రచారం చేసినప్పుడు అభ్యంతరం చెప్పని మీరు ఇప్పుడు నీతులు చెప్పడం మంచి పద్దతి కాదని సున్నితంగా కౌంటర్ ఇస్తున్నారు...మరి టీటీడీ దాఖలు చేసిన విజయ సాయిరెడ్డి , రమణదీక్షితులపై కోర్టు ఎటువంటి చర్యలు తీసుకోబోతుందో..దీనికి ఆ ఇద్దరు ఎలా స్పదిస్తారో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: