జగన్ పై జరిగిన దాడి పై స్పందించిన పవన్ కళ్యాణ్..!

KSK
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పై విశాఖపట్టణం ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడిని ఖండించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయం నుండి ఒక లేఖను విడుదల చేశారు. ‘ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు జరగరాదని జనసేన విశ్వసిస్తుంది.


ఈ హత్యాయత్నాన్ని  ప్రజాస్వామ్యవాదులందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష నేతపై జరిగిన ఈ దాడిని తీవ్రమైనదిగా జనసేన భావిస్తోంది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. గాయం నుంచి జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం.


ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేసి కుట్రదారులను శిక్షించాలి.’ అని జనసేన పార్టీ ఓ లేఖను విడుదల చేసింది. విజయ్ క్రమంలో జగన్ పై జరిగిన దాడిని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు తీవ్రంగా తప్పుబట్టారు.


కేంద్ర భద్రతా వలయంలో ఉండే విమానాశ్రయంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం దారుణమని మరి కొంతమంది రాజకీయ నేతలు పేర్కొంటున్నారు. ఇది కావాలని ఉద్దేశించి వైయస్ జగన్ పై ఫ్రీ ప్లాన్ మర్డర్ అని అంటున్నారు మరికొంతమంది. ఏది ఏమైనా పెద్ద ప్రమాదం నుండి జగన్ తప్పించుకున్నరు అనడంలో ఎటువంటి సందేహం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: