నన్ను ముఖ్యమంత్రిని చేయండి అంటూ ప్రజలను కోరుకుంటున్న పవన్..!

KSK
తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ జరిగిన బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తాను రాజకీయాల్లోకి పదవుల కోసం రాలేదని పార్టీ ఆవిర్భావం నుండి మొన్నటి వరకు కామెంట్ చేశారు పవన్. అయితే ఆంధ్రా లో 2019 వ సంవత్సరం ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ వైఖరిలో రోజు రోజుకి మార్పు కనిపిస్తుంది. మొన్నటి వరకు ప్రశ్నించడానికి జనసేన పార్టీ పెట్టాను అని అంటున్న పవన్..తాజాగా తాను ముఖ్యమంత్రి అవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువత కోరుకుంటున్నట్టు తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన మహాసభలో కామెంట్లు చేశారు.  


తాజాగా క‌త్తిపూడి బ‌హిరంగ స‌భ‌లో అధికార టీడీపీ పై, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాల‌న పై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేసిన ప‌వ‌న్.. ఆ త‌ర్వాత మాట్లాడుతూ న‌న్ను ముఖ్య‌మంత్రిని చేయండి.. బాధ్య‌త‌గా ప‌నిచేయ‌క‌పోతే చొక్కా ప‌ట్టుకొని నిల‌దీయండి.. న‌న్ను ముఖ్య‌మంత్రిగా చూడాలని యువ‌త కోరుకుంటుందంటూ.. ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్ని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తాయి.


మొన్నటి వరకు వైసిపి పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని జగన్ చేసిన కామెంట్ల విషయంలో..జగన్ ముఖ్యమంత్రి అయితేనే పని చేస్తాడని కామెంట్లు చేసిన పవన్..తాజాగా తనను ఏకంగా ముఖ్యమంత్రి చేయాలని నేరుగా ప్రజలకు విన్నవించుకోవడం తో ..పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు విన్నా చాలా మంది సీనియర్ నాయకులు షాక్ కి గురయ్యారు.


నీతిమాలిన రాజకీయాలలో నీతివంతమైన రాజకీయాలు చేయడానికి వచ్చాను..పదవుల కోసం రాలేదు ప్రశ్నించడానికి వచ్చాను అంటూ మొదట చెప్పి..ఇప్పుడు ఎన్నికలు వస్తున్న తరుణంలో పవన్ ముఖ్యమంత్రి అయితే అన్నీ చేస్తాం అని చెప్పటం సిగ్గుచేటు అంటూ కొంతమంది రాజకీయ నాయకులు కామెంట్లు చేస్తున్నారు. అయితే పవన్ కామెంట్ విన్నా మరికొంతమంది పవన్ కళ్యాణ్ పూర్తి రాజకీయ నాయకుడిగా ఆవిర్భవించాడని వ్యాఖ్యానిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: