అంత పాదయాత్ర లోనే చెబుతా అంటున్న జగన్..!

KSK
విశాఖపట్టణం విమానాశ్రయంలో ఇటీవల వైసీపీ అధినేత జగన్ పై నిందితుడు శ్రీనివాస్ చేసిన హత్యాయత్నం ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వైసీపీ అధినేత జగన్ కావాలనే తనపై హత్యాయత్నం చేయించుకొని సానుభూతి రాజకీయాలు పొందటానికి తెరలేపారని మాట్లాడుతూ మరోపక్క  జగన్ కుటుంబ సభ్యుల జగన్ పై దాడి చేయించారని ఇష్టం వచ్చిన రీతిలో కామెంట్లు చేశారు.


అయితే ఈ క్రమంలో నిందితుడు శ్రీనివాస్ ని పట్టుకున్న పోలీసులు ఇంకా విచారణ పేరుతో విచారిస్తున్నారు. మరో పక్క తన భుజానికి గాయమైన నేపద్యంలో విశ్రాంతి తీసుకున్న జగన్ తిరిగి ప్రజా సంకల్ప పాదయాత్ర చేయడానికి రెడీ అయిపోయారు. గతంలో దాడి జరిగిన తర్వాత నవంబర్ 3 నుండి ప్రారంభిద్దామని పార్టీ నేతలకు సూచించిన జగన్..గాయం ఇంకా మానకపోవడంతో పాదయాత్రకి  మరికొన్ని రోజులు బ్రేక్ ఇవ్వాలని వైద్యులు సూచించడంతో యాత్రను రద్దు చేసుకున్నారు.


అయితే తాజాగా ఈ నెల 12వ తేదీ నుండి జగన్ పాదయాత్రను పున : ప్రారంభించనున్నారు. విజయనగరం జిల్లాకు బయలుదేరేందుకు వీలుగా నవంబర్ 11వ తేదీ సాయంత్రం జగన్ హైద్రాబాద్ నుండి విజయనగరం జిల్లాకు బయలు దేరనున్నారు.12వ తేదీ నుండి యాత్రను ప్రారంభిస్తారు.తనపై శ్రీనివాసరావు దాడికి సంబంధించి పాదయాత్రలో వివరిస్తానని జగన్ గతంలోనే ప్రకటించారు.


అయితే ఈ దాడి ఘటనకు సంబంధించి జగన్ ఏం చెబుతారనేది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల లో ఆసక్తికరంగా మారింది. ఇదే క్రమంలో పాదయాత్ర చివరి దశకు చేరుకుంటున్న క్రమంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వైసీపీ నేతలు జగన్ ఇప్పటినుండి తల పెట్టబోయే ఈ షెడ్యూల్ భారీ గా ఉండాలని మరియు భద్రత కూడా కట్టుదిట్టంగా ఉండాలని దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: